S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం... మీరే డిటెక్టివ్

11/18/2018 - 03:31

(అయోధ్యకాండ సర్గ 105వ సర్గ 33వ శ్లోకం నించి)
*
రాముడు తను చెప్పేది ఇలా కొనసాగించాడు.

11/18/2018 - 03:29

ఇలా దుఃఖించే కౌసల్యని ఓదార్చి రాజభార్యలంతా ఆశ్రమాన్ని చేరి అక్కడ స్వర్గం నించి భూమికి వచ్చిన దేవతలా ఉన్న రాముడ్ని చూశారు. సమస్త భోగాలని వదిలి ఆశ్రమంలో ఉన్న రాముడ్ని చూడగానే కౌసల్యా, ఇతర తల్లులు విచారంతో పెద్దగా ఏడ్చారు. మనుషుల్లో శ్రేష్ఠుడు, మాట తప్పని రాముడు లేచి ఆ తల్లులందరి పాదాలని తాకి నమస్కరించాడు.

11/03/2018 - 21:57

పూర్ణచంద్రుడి లాంటి మొహం గల సీతతో రాముడు విచారంగా చెప్పాడు.
‘ఓ సీతా! నీ మామగారు మరణించారు. ఓ లక్ష్మణా! నువ్వు తండ్రి లేని వాడయ్యావు. మహారాజు మరణించాడనే విచారకరమైన వార్తని భరతుడు చెప్తున్నాడు’
రాముడి మాటలు విన్న కీర్తివంతులైన భరత, లక్ష్మణ, శతృఘ్నల కళ్ల నించి నీళ్లు కారాయి. సోదరులంతా రాముడ్ని ఓదార్చి, ‘తండ్రికి జలతర్పణాలు ఇవ్వు’ అని ప్రార్థించారు.

10/27/2018 - 21:59

హరిదాసు ఆ రోజు రామాయణం హరికథని ఆరంభిస్తూ ఇలా చెప్పాడు.
‘ఇందాక ఎవరో అడిగారు. మనకి హనుమంతుడు ఎప్పుడు వస్తాడు. వచ్చే కాండలో వస్తాడు. మనం అయోధ్యకాండలో దాదాపు చివరికి వచ్చేసాం. ఇంకో రెండు, మూడు కాండలతో అది పూర్తయి సుందర కాండలోకి ప్రవేశిస్తాం. సరే. నిన్న దానికి కొనసాగింపుగా మిగిలింది చెప్తాను. శ్రద్ధగా వినండి.

10/20/2018 - 19:50

మీకో ప్రశ్న:
========
రాముడు చెప్పిన రాజనీతిలో మండలం మధ్యలో ఉన్న రాజుని ఏమంటారు?

10/13/2018 - 23:40

(అయోధ్యకాండ 100వ సర్గ - 11వ శ్లోకం నించి)
హరిదాసు ఆ రోజు కథని ఇలా మొదలు పెట్టాడు.
‘రాముడు భరతుడ్ని మళ్లీ కుశల ప్రశ్నలు వేయడం కొనసాగించాడు. ఈ సర్గలో రాముడు భరతుడికి చెప్పే విషయాలన్నీ రాజు విధులు. ఇవి అన్ని కాలాలకి, అన్ని దేశాలకి వర్తించేవి. ఇవాళ ఈ సర్గని పూర్తి చేస్తాను.

10/13/2018 - 23:38

సేనని అక్కడ నిలిపిన భరతుడు అన్నని చూడాలనే ఆత్రంతో శతృఘు్నడికి గుర్తులని చూపించాడు. పెద్దల మీద అధిక ప్రేమ గల భరతుడు ‘నా తల్లులని త్వరగా తీసుకుని రండి’ అని వశిష్ఠుడ్ని ఆదేశించి తను ముందు తొందరగా వెళ్లాడు. సుమంత్రుడు కూడా శతృఘు్నడిని అనుసరించాడు. రాముడ్ని చూడాలనే కోరిక భరతుడికి ఎంతుందో సుమంత్రుడికి కూడా అంత ఉంది.

09/29/2018 - 22:23

చాలా కోపంతో, తొందర పడే లక్ష్మణుడ్ని శాంతింపజేస్తూ రాముడు చెప్పాడు.

09/29/2018 - 22:22

సీతకి పర్వతాల అందాన్ని చూపించాక రాముడు మంగళకరమైన నీళ్లతో నిండిన అందమైన మందాకినీ నదిని ఆమెకి చూపించాడు. పద్మాల్లాంటి కళ్లు గల రాముడు అందమైన కటి ప్రదేశం, చంద్రుడి లాంటి ముఖం గల వైదేహితో చెప్పాడు.

09/29/2018 - 22:20

‘నిన్న మనం అయోధ్య కాండ 93వ సర్గ చెప్పుకున్నాం. ఇవాళ 94వ సర్గ చెప్తాను. వినండి’ హరిదాసు ఆ రోజు హరికథని ప్రారంభిస్తూ చెప్పాడు.
భరతుడు చెప్పడం ఇలా కొనసాగించాడు.

Pages