S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాంజలి

07/27/2019 - 19:28

హరికథ మన తెలుగువారి విశిష్ట కళారూపం. భక్తి కథలను, ప్రధానంగా హరి లీలను సంగీత సాహిత్య నృత్యపరంగా చెప్పడాన్ని హరికథ అంటారు. నారదుడు మొదటి హరిదాసు అంటారు. హరికథ చెప్పేవారికి ఆట పాట మాట మీద పట్టు ఉండాలి. వీరిలో ప్రసిద్ధులు భాగవతారిణి కావూరు శారద. 30 సంవత్సరాలుగా కొన్ని వేల హరికథ ప్రదర్శనలిచ్చారు. భక్తి చేత, భక్తి నుండి, భక్తి వలన ప్రచారం పొందాయి భారతీయ కళలు. వీటి పథమూ, గమ్యమూ భగవంతుని పాదములే!

07/20/2019 - 20:05

అమెరికాలో ఎంతోమంది తెలుగు వెలుగులు, మన కళలు వ్యాప్తిచేస్తూ, అక్కడి నుండే మన కళామతల్లికి సేవ చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ కళలను అక్కడి పిల్లలకు నేర్పిస్తూ, లలిత కళలకు జీవం పోస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు మన కట్టూబొట్టూ, భాష, పండుగలూ పబ్బాలూ, పిండివంటలు, ఆచార వ్యవహారాలు కరువవుతాయి. అన్నింటికీ అమ్మ ఉందిగా!

07/13/2019 - 18:41

కూచిపూడి మన తెలుగువారి మణిమయ కిరీటం. తరతరాలుగా ఈ నృత్యానికే అంకితమయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీరు నటరాజస్వామి ముద్దుబిడ్డలు. ఎన్నో జన్మల పుణ్యం వల్ల నృత్యం నేర్చుకుంటాము, నేర్పిస్తాము. మన సంప్రదాయ నృత్యాలన్నీ భగవంతుని పాదాల నుండి పుట్టి, తిరిగి భగవంతుని పాదాలకే ‘నృత్యం సమర్పయామి’ అనే పూజావిధానంలో అర్పించబడతాయి. భారతీయ నృత్యాల పథం, గమ్యం భక్తియే!

06/15/2019 - 19:23

భారతదేశం లలితకళలకు పుట్టిల్లు. సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం అనే అయిదు కళలను లలిత కళలు అంటారు. నాట్యం సమాహార కళ. కేవలం నాట్యంలో సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం ఇమిడి ఉన్నాయి. దక్షిణ భారతంలో కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మోహినీ అట్టం సంప్రదాయ శాస్ర్తియ నృత్యాలు ఉన్నాయి. అవికాక అసంఖ్యాకమైన జానపద నృత్య రీతులు ఉన్నాయి. మన తెలుగు వారికి కూచిపూడి మకుటము వంటిది.

03/16/2019 - 19:54

భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలలో ఆహార్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే వస్తమ్రులు, మాలలు, ఆభరణములు మొదలైన వాటి వివరణ వీటిలో సుదీర్ఘంగా ఇవ్వబడింది. కొన్ని ఆభరణాలు విశిష్ట స్థానాన్ని సంతరించుకుని, తమకంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాయి. వేల సంవత్సరాలుగా ఆభరణాల చుట్టూ అల్లబడిన కథలు, సంఘటనలు, కావ్యాలు, నాటకాలు ఉన్నాయి. ఇవి సంస్కృత, తెలుగు, ఇతర భాషల్లో చూస్తాం.

02/23/2019 - 20:32

శరత్‌చంద్ర ఒక యుగం, ఒక హిమపర్వతం, ఒక గంగానది. ఈయన రాసిన నవలలు దేశ, కాలములను అధిగమించి సర్వవ్యాప్తమైనాయి. అనగా త్రికాలా బాధితం. వీరు 15, సెప్టెంబర్ 1876 దేవానందపూర్, హుగ్లీలో జన్మించారు. వీరి బాల్యం నిరంతరం గర్భదారిద్య్రం, పరాశ్రయంలోనే గడిచిపోయింది.

02/16/2019 - 20:22

మన భారతదేశం గర్వించే రచయిత శరత్‌చంద్ర. వీరు బెంగాలీ రచయిత అయినా, వీరి నవలలు, కథలు అన్ని భాషలలోకి అనువదింపబడ్డాయి. వీరు సెప్టెంబర్ 1876లో హగ్లీ దేవానందపూర్‌లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భువల మోహిని, మోతీలాల్. తోబుట్టువులు అనిలాదేవి, ప్రకాశ్, ప్రభాస్, సుశీల. వీరి జీవితం సారా, నల్లమందు, ప్రేమానే్వషణ సత్యానే్వషణలో గడిచిపోయింది. ఇతడే దేవదాసు కదా!

02/09/2019 - 20:22

కాకతీయ సామ్రాజ్యాన్ని 13వ శతాబ్దంలో ఏలిన సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి. ఆవిడ తల్లిగా, కూతురిగా, భార్యగా, మహారాణిగా, వీర వనితగా, సైన్యాన్ని ముం దుకు నడిపించిన శక్తి స్వరూపిణిగా ఎన్నో బాధ్యతలు వహించింది. ఆమె మరణించే సమయానికి 80 ఏళ్ల వయసు దాటినట్లు తెలుస్తున్నది. ఒకప్పుడు ఆమెకు విధేయుడైన జన్నిగదేవుడు, అతని తమ్ముడు త్రిపురాంతకుడు ఆమెకు ఎంతో సహాయం చేసేవారు.

02/02/2019 - 19:48

కూచిపూడి మణిమయ కిరీటం భామా కలాపం. వందల సంవత్సరాలుగా, తరతరాలుగా చేసేవారినీ, చూసేవారినీ పవిత్రులని చేస్తూ, రసగంగలా ప్రవహిస్తోంది. భామాకలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుడు, మాధవి పాత్రలు ఉన్నాయి. సత్యభామ సౌందర్య గర్విత; భర్తను కొంగుకు కట్టుకున్న స్వాధీనపతిక. సత్యభామ జీవాత్మకు సంకేతం. శ్రీకృష్ణుడు పరమాత్మ. అందం, అహంకారం వదిలి, జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడం భామాకలాపం యొక్క సారాంశం.

01/26/2019 - 23:06

డా.పి.రమాదేవి ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు, రచయిత్రి. కూచిపూడి నృత్యంలో పిహెచ్.డి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.్ఫల్ చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.లో స్వర్ణ పతకం పొందారు. వీరు ఎన్నో పుస్తకాలు రాశారు. శ్రీసాయి నటరాజ అకాడమీ స్థాపించి దశాబ్దాలుగా నృత్యం నేర్పిస్తూ ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. వీరు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. డా.

Pages