S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాంజలి

01/19/2019 - 20:37

డా. అక్కిరాజు సుందర రామకృష్ణ జగమెరిగిన కళాకారుడు. ఈయన కవి, నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేసి, ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి అందుకున్నారు. పద్యకవి, అధిక్షేప కావ్య రచయిత వీరు. వారి గురించి వారి మాటల్లోనే...
* * *

01/12/2019 - 20:23

మస్తాన్‌రాజా ప్రఖ్యాత కీ బోర్డ్ ప్లేయర్. వీరి స్టేజి పేరు చంద్రలేఖ. ప్రొ.అలేఖ్య పుంజాల, దీపికారెడ్డి, పద్మభూషణ్ స్వప్నసుందరి మొదలగు కళాకారుల ప్రదర్శనలలో వీరు సంగీత సహకారాన్ని అందించారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు విద్యాసాగర్, స్నేహలతా మురళి మొదలగు వారితో కలిసి పనిచేశారు. టీటీడీ ఆధ్వర్యంలో బి.వి. మోహన కృష్ణగారికి వంద అన్నమయ్య పదాలకి కీబోర్డు వాయించారు.

01/05/2019 - 20:38

క్రీ.శ.1290 ప్రాంతంలో భారతదేశ చరిత్రను మార్చిన వీరుడు మాలిక్ కాఫిర్. ఇతడు ఢిల్లీని పాలించిన అల్లావుద్దీన్ ఖిల్జీకి బానిస. వెయ్యి దీనారాలకు అమ్ముడుపోయి, నపుంసకుడిగా మార్చబడిన ‘హజార్ దీనారీ’ మాలిక్ కాఫిర్. ఇతను వీరుడు. కానీ నాయకుడు, ప్రతినాయకుడు కాదు. అంటే ఇతను హీరో కాదు, విలన్ కాదు. వేటాడి, వేటాడబడి, తన క్రోధాగ్నిలో తనే ఆహుతి అయిపోయిన అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రియుడు.

12/29/2018 - 18:41

ఏ భారతీయ నృత్యానికైనా ఆంగికం, వాచికం, సాత్త్వికం, ఆహార్యం అని నాలుగు అభినయాలు ఉంటాయి. నర్తకీమణులు, నర్తక రత్నాలు ఎంతో బాగా నృత్యం చేసి, హావభావాలతో ప్రేక్షకులను అలరించినా, ఆహార్యం అంటే మంచి వస్తధ్రారణ చాలా ముఖ్యం. ఆ విధంగా జీవితాన్ని నృత్య ఆహార్యానికి అంకితం చేసిన గొప్ప కళాకారుడు శ్రీ నాగయ్యగారు.

12/22/2018 - 20:29

కె.పరంజ్యోతి గారు ప్రఖ్యాత తబలా విద్వాంసులు. దాదాపు 75 సంవత్సరాలు సంగీతానికే అంకితమై, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికాలో నలభై ఏళ్లు నివసించి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పండిట్ రవిశంకర్, హరిప్రసాద్ చౌరాసియా, సంతూర్ శివకుమార శర్మ, లక్ష్మీశంకర్, జి.ఎస్.సచ్‌దేవ్, వసంతరాయ్, నిఖిల్ బెనర్జీ వంటి ఎంతో గొప్ప కళాకారుల ప్రదర్శనలలో తబలా వాయించారు.

12/15/2018 - 19:59

డాక్టర్ చింతా ఆదినారాయణ శర్మగారు ప్రఖ్యాత కూచిపూడి గురువు, నర్తకుడు. వీరు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. వీరి కళాసేవకు తార్కాణం గౌరవ డాక్టరేట్. త్యాగరాజ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్‌లో కూచిపూడి అధ్యాపకుడిగా పనిచేసి, రిటైరయ్యారు. దాదాపు 15వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్తమ అధ్యాపకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సత్కరింపబడ్డారు.

12/08/2018 - 20:00

శ్రీమతి కె.నిర్మల ప్రఖ్యాత గాయని, నటి, రచయిత్రి. అమెరికాలో 40 ఏళ్లు నివసించారు. గృహిణిగా, తల్లిగా వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూ, 36 సంవత్సరాలు సైంటిస్టుగా పనిచేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. స్పెక్స్ ఇండస్ట్రీలో సైంటిస్టు, వైస్ ప్రెసిడెంట్‌గా దశాబ్దాలు పనిచేసి రిటైరయ్యారు. లలిత సంగీతంలో కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమందికి సంగీతం నేర్పిస్తున్నారు.

12/01/2018 - 20:09

ప్రఖ్యాత నర్తకి శ్రీమతి గంటి ఇందుమతి గురువు, పరిశోధకురాలు, సంగీత విద్వాంసురాలు. వ్యక్తిగతంగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ నృత్యంలో సంగీతంలో దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. వీరు తమ తల్లి వద్దే కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు.
జీవన ప్రస్థానం..

11/24/2018 - 19:38

గన్ను కృష్ణమూర్తిగారు ప్రఖ్యాత కవి, కథకుడు, వ్యాసకర్త, పరిశోధకుడు. ఇన్ని సంగతులు ఒకరిలో దాగి ఉండటం చాలా అరుదైన విషయం. వీరు రాసిన ‘రాముడండే ఎవరు? రామాయణమంటే ఏమిటి?’ ఎంతో అద్భుతమైన పరిశోధనా గ్రంథం. కృష్ణాయణం ఒక నక్షత్ర మహాయానం, ఋషి హృదయం - వేదాల మీద.. చతుర్వేద సాగర మథనం బృహద్గ్రంథాలు. మహా అపభంజనం, యార్లగడ్డ వారి వస్త్రాపహరణం, రంగనాయకమ్మ గారి రామాయణ పరిజ్ఞానం? వంటి సాహిత్య విమర్శలు ఎన్నో రాశారు.

11/17/2018 - 18:30

కూచిపూడి సంప్రదాయ కుటుంబానికి చెందిన డా.ఆచార్య భాగవతుల సేతురాం ప్రఖ్యాత గురువు, నర్తకుడు, పరిశోధకుడు, ప్రొఫెసర్. ఆచార్య సేతురాం గారి తండ్రి ప్రఖ్యాత భాగవతుల రామకోటయ్య గారు. రామకోటయ్య గారు తెలంగాణలో మొట్టమొదట కూచిపూడి శిక్షణాలయం ప్రారంభించి (1946-1979) కళాసేవ చేశారు. తండ్రికి తగ్గ తనయుడు ఆచార్య భాగవతుల సేతురాం.

Pages