S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

09/07/2019 - 19:55

వేదవాది ఆశ్రమంలో విద్యార్థులంతా ఆ రోజు మధ్యాహ్న భోజనం అయ్యాక గురువుగారి కోసం ఎదురుచూస్తూ నింబ అశ్వత్థ వృక్షాలు కలిసి ఉన్న అరుగు చుట్టూ కూర్చుని ఉన్నారు. వేదవాదుల వారు వచ్చి అరుగు మీద ఆశీనులై ‘బిడ్డలారా! ఈ వృక్ష ఛాయ ఎంత ఆహ్లాదంగా ఉందీ! చల్లని గాలులు, కమ్మని ప్రాణవాయువూ! అందుకే వృక్షాలు మన రక్షకులు అంటారు.’

08/24/2019 - 20:12

సత్యవతమ్మకి రాంబాబు ఒక్కగానొక్క కొడుకు. బిడ్డ పుట్టిన ఆరు మాసాలకే భర్త గతించడంతో ఎలా బతకాలో తెలీక ఉన్న ఊళ్లోనే కూలీనాలీ చేసుకుంటూ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది.

08/17/2019 - 20:33

మణిపురి పట్టణాన్ని మహారాజు నారాయణవర్మ పాలిస్తున్నాడు. అతనికి దైవభక్తి ఎక్కువ. అందుచేత తన ర్యాంలో చుట్టుపక్కల ఎక్కడా లేని శివాలయాన్ని నిర్మించాలని తలంచి విదేశీ కళాకారులను రప్పించి ఆలయాన్ని సుందరంగా చూడముచ్చటగా నిర్మింపజేశాడు. కానీ అందులో స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కాకుండానే దివంగతుడయ్యాడు. అతని తదుపరి ఆయన కుమారుడు యువరాజు రామేశ్వర వర్మ పరిపాలనా బాధ్యత చేపట్టి రాజ్యపాలన కావిస్తున్నాడు.

08/03/2019 - 19:59

సింగడు ఆటవిక తెగకు చెందిన యువకుడు. అడవిలోని గూడెంలో నివసిస్తున్నాడు. వన్యమృగాలను వేటాడి చంపి తినేవాడు. వన్య మృగాలను వేటాడకూడదని అటవిక శాఖ వాళ్లు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకునేవాడు ఆదు. ఒకరోజు గూడెం పెద్ద సింగడిని పిలిచాడు.

07/27/2019 - 19:31

చిన్నతనం నుండీ విక్రమ్, విజయ్ ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం. ఇద్దరి ఆశలూ ఆశయాలూ ఒక్కటే.
పాఠశాలలో చదువుకునేటప్పుడు దేశభక్తి వంటి భావాలు వాళ్లిద్దరినీ ఉత్సాహపరిచేవి. ఏనాటికైనా సైన్యంలో చేరాలని, దేశసేవ చేయాలని వాళ్లు ఆశయంగా పెట్టుకున్నారు. చివరికి వారి దృఢ సంకల్పమే వారికి సైన్యంలో చోటు కల్పించింది.

07/20/2019 - 20:08

సింహం బాగా ఆకలిగా ఉంది. ఆ రోజు ఉదయం నుండీ అది ఆహారం తినలేదు. దాంతో ఆకలి బాధ తాళలేక సింహం గుర్..గుర్.. అని గర్జిస్తోంది. అది ఆ ఆడవికి రాజు కూడా.
మామూలుగా అయితే ఏదో రోజు ఆ సమయానికి ఒక ఆహారం తినేదే. అయితే ఆ రోజు అడవిలో జంతువులకు ఎన్నికలు జరిగాయి. సింహం రాజుగా ఎంపిక అయింది.

06/15/2019 - 18:49

మహామల్లపురమనే ఒక చిన్న గ్రామంలో చలమయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు చాలా న్యాయంగా వ్యాపారం చేసేవాడు. తనకు రావలసిన లాభానికంటే ఒక్క రూక ఎక్కువ తీసుకునేవాడు కాదు.
అందుకని అందరూ చలమయ్య దగ్గరే వస్తువులన్నీ కొనేవారు. మహా మల్లపురం నుంచీ పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి వస్తువులు కొనాలంటే ఒక చిట్టడవి దాటాలి. ఆ అడవిలో కొందరు దారి దోపిడీ దొంగలు ఉండేవారు.

06/08/2019 - 19:53

తోటలో కొబ్బరి బొండాలు దింపుతున్నారు, ఎండిన కొబ్బరి మట్టల్ని తెగ్గొడ్తున్నారు చెట్లు ఏపుగా ఎదగటానికి. అలాగే ములక్కాడలు, టమాటాలు గంపల్లో సర్దుతున్నారు. ఇంకా బీరకాయలు, వంకాయలు, ఆకుకూరలు గోనె సంచుల్లో నింపుతున్నారు. ఇంకో పక్క బంతి, చామంతి, గులాబీలు వేటికవే గంపలకెత్తుతున్నారు. పచ్చి సరుకులు మార్కెట్‌కి పంపిస్తారు- ఇది దినచర్య.

06/01/2019 - 22:58

అవంతీ రాజ్యాన్ని చంద్రసేనుడు పాలించేవాడు. అతని భార్య అన్నపూర్ణాదేవి. వారికి లేకలేక పుట్టిన సంతానమే వైష్ణవి. రాకుమారి చక్కని చుక్క. రాజదంపతులు తమ కూతుర్ని ఎంతో గారాబంగా పెంచారు. వైష్ణవికి యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు మంచి యోగ్యుడైన వరుడితో వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రుల ఆలోచన. అయితే రాకుమారి వివాహ విషయంలో రాజదంపతులు ఏకీభవించలేక పోయారు.

05/25/2019 - 20:21

‘తాతయ్యా మోసపోవడం అంటే ఏమిటో చెప్పవా?’
‘అత్యాశకు పోయి నిజం కాని మాటలను నమ్మడమే’
‘మరి ఎలా మోసం చేస్తారు?’
‘మన బలహీనతని ఆయుధంగా చేసి ఉచ్చులోకి దించుతారు. కళ్లుకప్పి అంతా కాజేస్తారు’
‘అర్థం కాలేదు తాతయ్యా!’
‘సరే! మోసపోయిన ఒక పులి కథ చెప్తాను వినండి’
‘సరే తాతయ్యా!’
* * *

Pages