S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్య భాగ్యం

10/21/2018 - 21:59

స్ర్తిలకు తలపైన ఒత్తయిన మెత్తని కురులు ఎంతో అందం. అవి కొంత మందిలో బిరుసుగాను, వంకీలుగాను, ఉంగరాలతోను కూడా అందమిస్తాయి. అయితే అవి వేరే అసహజమైన ప్రదేశాలలో అంటే ముఖంపైన పై పెదవి మీద, చిబుకం మీద, చేతులు ముంజేతులు, మోకాళ్ల మీద నల్లని వెంట్రుకలు ఉంటే అది గమనించి చికిత్స చేయించవలసిన పరిస్థితి. ఛాతి మీద కూడా కనిపించవచ్చు. గొంతు స్వరం మారవచ్చు.

10/06/2018 - 18:57

ఎముకలు అనేవి అస్థిపంజరం బలం. వీటి ఆధారంగానే కండరాలు, నరాలు, శరీరం, అవయవాలు, చర్మం, రక్తం లాంటివి మనిషి రూపాన్ని తయారుచేస్తాయి. అయితే పుట్టినపుడు వందల్లో వుండే ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి బలమైన ఇనుపరాడ్లలాగా తయారవుతాయి. మనిషి నిలబడటం, నడవడం, కూర్చోవడం, బరువులు మోయడం, వంగడం వంటి పనులను తనకు నచ్చినట్టు చెయ్యగలుగుతాడు.

09/22/2018 - 18:43

స్ర్తిలకు ఏ వయసు వారికి కేన్సర్ రాదు అని చెప్పలేం కానీ 10-15 సం.ల వయసు వరకూ హార్మోన్ల తాకిడి వుండదు కనుక జననేంద్రియాల కేన్సర్, రొమ్ము కేన్సర్ రాదని చెప్పవచ్చు. కానీ కొన్ని ఓవరీల కేన్సర్ జెనిటిక్ కారణాల వల్ల చిన్నతనంలో వస్తుంది. ఐతే ఇది చాలా అరుదు.

09/08/2018 - 18:46

అన్ని విటమిన్లు శరీరారోగ్యానికి అవసరమే అయినా ఒక్కొక్క విటమినుకి శరీరంలో ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. విటమిన్ ‘డి’ మన శరీరంలోని ఎముకలకి, గుండెకు చాలా అవసరం. డి విటమిన్ 30 నుంచి 100 యూనిట్ల వరకు ఉండడం అత్యవసరం. 30 కంటే తక్కువ ఉన్నవారికి రకరకాల బాధలు చిన్నవి, పెద్దవి కంప్లయింట్లు ఉంటాయి.

09/01/2018 - 18:24

మనిషి పుట్టిన దగ్గర్నుంచీ పెరుగుతూ వచ్చి చివరిదశలో తగ్గుతూండేవి మూడు విషయాలు... ఒకటి బరువు, రెండోది కంటిచూపు, మూడోది వినికిడి శక్తి. వీటిలో రెండోది, మూడోది సమస్యలే కానీ పరిష్కార మార్గాలు చాలా నికరంగా ఉంటాయి. కానీ బరువు గురించి ఏకసూత్రం ఏకాభిప్రాయం ఉండదు. ఈ బరువు ఆయా వ్యక్తుల వంశపారంపర్యత, ఆహారపు అలవాట్లు.. వాళ్ల శరీర వ్యాయామం, పనులపై ఆధారపడి ఉంటుంది.

08/19/2018 - 07:01

చిన్న వయసులో ఉన్న ఒక గృహిణి, హాయిగా సంసారం చేస్తున్న అమ్మాయి హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిందనుకోండి. ఒళ్లు చల్లబడి స్పృహ వస్తూ పోతూ లేస్తూ మళ్లీ పడిపోతుందనుకోండి. డాక్టర్లకి ముఖ్యంగా గైనకాలజిస్టుకి తట్టేది ప్రెగ్నెన్సీ - ఎబార్షన్ - ఎక్టోపిక్ అంటే పిండం వేరే చోట పెరగడం - పగిలిపోవడం - అనేది తప్పక మనసులోకి వస్తుంది. ఇవి కాదని తేలితేనే మిగతా కారణాలు అనే్వషిస్తారు.

08/14/2018 - 19:27

బాల్యావస్థ దాటి కౌమార దశలోకి, ఆ తర్వాత యవ్వనం లోకి అడుగుపెట్టే సమయంలో బాలికల్లో చాలా శారీరక మార్పులు, కొన్ని మానసిక మార్పులు రావడం సహజం. తల్లులు, అక్కచెల్లెళ్ళు లేదా స్నేహితుల సహాయంతో వీరు తమలోని మార్పులను అర్థం చేసుకుని పెరుగుతారు. కొద్దిమంది మాత్రం కొన్ని రకాల శారీరక సమస్యలను ఎదుర్కొంటారు.

07/28/2018 - 19:11

ఈమధ్య మనుషులలో ఆరోగ్యం గురించి చాలా చైతన్యం వచ్చింది. ఇది మంచి పరిణామమే గానీ దానివల్ల కొన్నిచోట్ల నష్టాలు కూడా వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనలు, రకరకాలు టీవీ, వార్తాపత్రికలు, రేడియోల ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి.

07/21/2018 - 19:36

ముప్ఫై, నలభై సంవత్సరాల వయస్సు వరకు ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎముకల్లోని కాల్షియం, విటమిన్ ‘డి’ తగ్గి పల్చబడిపోతాయి. అందుకనే నడుము, ఛాతీ ముందుకు వంగి పొడుగు తగ్గిపోవడం జరుగుతుంది. ప్రతి స్ర్తీకి మెనోపాజు తర్వాత ప్రతి పది సంవత్సరాలు అంటే దశాబ్దానికి ఒక సెంటీమీటరు పొడవు తగ్గుతుంది. ఎన్ని దశాబ్దాలైతే అని సెంటీమీటర్లు తగ్గుతుంది.

07/14/2018 - 19:13

గర్భధారణ సమయం తొమ్మిది నెలలయినా అది పూర్తయే కాలం ఎవరూ ముందు చెప్పలేరు. ఎందుకంటే వారి శరీర తత్వాన్నిబట్టి అండం ఎప్పుడు విడుదల అవుతుందో అప్పటి నుంచి లెక్కపెట్టాలి. అందుకనే 9 నెలలకి ఒక వారం కలిపి డెలివరీ తేదీ నిర్ణయిస్తాం. అంటే ఉదాహరణకు ఒక వనిత నెలసరి - జనవరి ఒకటో తేదీన మొదలైందనుకుంటే 9 నెలలు కలిపితే అక్టోబర్ ఒకటి, ఆపై ఏడు రోజులు అంటే 8 అక్టోబర్‌న ఆమె ప్రసవ తేదీ.

Pages