S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశం కథలు

09/22/2018 - 19:01

కాలం గడుస్తూనే ఉంటుంది. దశాబ్దాలు, శతాబ్దాలు ఎనె్నన్నో దొర్లుతూ పోతూ ఉంటాయి. అలాగే ఆ కాలవాహినిలో ఎందరెందరో కలిసిపోతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ కొందరు మహానుభావులు మాత్రము చరిత్రలో చెరగని ముద్రతో నిలిచి తన తరం వారినేగాక భావితరాల వారిని కూడా ప్రభావితులను గావిస్తూ ఉంటారు. అటువంటి వారిలో ప్రకాశంగారు అగ్రగణ్యులు. ప్రకాశం గారిని తలుచుకున్నప్పుడల్లా ఆశ్చర్య చకితులవుతుంటాము. గగుర్పాటు కలుగుతుంటుంది.

09/15/2018 - 22:14

ప్రకాశంగారు రాజకీయ రంగంలో ప్రవేశించిన క్షణం నుంచి గ్రామాభ్యుదయం కోసం రైతు జన సంరక్షణ, సౌభాగ్యమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకొని తన సర్వస్వాన్ని అంకితం చేశారు. ఆ రోజులలో దక్షిణ భారతంలో దాదాపు 80 శాతం ప్రజానీకం వ్యవసాయ రంగం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉండేది.

09/15/2018 - 22:13

మన రాజ్యాంగ చట్ట రచనకు ముందే ప్రకాశం పంతులు మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1946లో గ్రామాలకు, పల్లెలకు స్వయం పోషణ, స్వావలంబనతో కూడిన ఖాదీ గ్రామ కుటీర పరిశ్రమలతో కూడిన గ్రామ స్వరాజ్య ప్రాతిపదికకు నిర్దుష్టమైన, నిర్దిష్టమైన రూపురేఖలను రచించి ‘్ఫర్కా డెవలప్‌మెంట్ స్కీమ్’ శాఖను రూపొందించారు.

09/15/2018 - 22:12

ప్రకాశం పంతులుగారు రెండు చేతులా సంపాదించి గాంధీజీ పిలుపుమేరకు స్వాతంత్య్ర ఉద్యమంలో దూకి గుండ్లకే గుండె చూపి, తెల్లవారి గుండెల్లో సింహస్వప్నమై వారిని గడగడలాడించిన వీరుడుగా మనకి తెలుసు. తను న్యాయవాద వృత్తిలో సంపాదించిన అపార సంపదనూ, జీవితాన్ని, న్యాయవాద వృత్తిని దేశ హితానికి, స్వరాజ్య, స్వరాష్ట్ర సాధనకు ఆహుతి అయిన నిష్కళంక దేశభక్తుడిగా, నిస్వార్థ త్యాగధనుడుగా మనందరికీ సుపరిచితులు.

09/02/2018 - 22:27

మహాపురుషులు తమ స్వలాభంతో తృప్తిపడరు, ఇతరుల క్షేమాన్ని ఆకాంక్షిస్తారు. దేశంలో శాంతిభద్రతలకోసం, ప్రజా అభ్యున్నతికోసం నిజశక్తులను ఉపయోగిస్తారు. ఏ వ్యక్తి అయినా, సంస్థనైనా సరే కష్టాలలో వుంటే, వారికి ఆశ్రయమిచ్చి ఆదుకుంటారు. ఆపన్న హస్తాన్ని అందిస్తారు. అలాంటి మహనీయుడే మన ప్రకాశం పంతులుగారు. ఉదాహరణలు కోకొల్లలున్నాయి.

08/17/2018 - 20:38

భారత స్వాతంత్య్ర ఉద్యమాల చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైన రోజు. సరిగ్గా 76 ఏళ్ల క్రితం అంటే ఆగస్ట్ 9, 1942న భారత ప్రజల కోపాగ్ని జ్వాలలకు తట్టుకోలేక కుటిల ఆంగ్లేయులు తోకముడిచిన రోజు. దేశ దాస్య విమోచన తుది పోరాటం, తుది విప్లవం ‘క్విట్ ఇండియా విప్లవం’ పరిపాలనను తుదముట్టించిన పోరాటం.

08/14/2018 - 19:06

దేశ కాల పరిస్థితులు, విప్లవ జ్వాలలు ఎందరో యుగ పురుషులకు, మహానుభావులకు జన్మనిస్తుంది అనడానికి తార్కాణం 19వ శతాబ్దమే. అనేక మంది మేధావులను, మహా నాయకులను, ఆధ్యాత్మిక శక్తివంతులను, రాజనీతిజ్ఞులను, కళాకారులను, కవులను, త్యాగధనులను భారతదేశానికి సమర్పించింది 19వ శతాబ్దం. ఇలాంటి మహాపురుషులలోని వారే మహత్మాగాంధీ, ఆంధ్రకేసరి ప్రకాశం.

08/14/2018 - 19:00

భారత స్వాతంత్య్ర సమరాంగణంలో మహోజ్జ్వల తారగా వెలిగి, నాలుగు దశాబ్దాలపాటు దక్షిణ భారత ప్రజా జీవిత రంగంలో స్వయం ప్రకాశమై ‘ప్రజలే తానై, తానే ప్రజలై’ నిలిచిన భరతమాట ముద్దుబిడ్డ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు. ‘నా ప్రజలు - నా బిడ్డలు’ అని వారి శ్రేయస్సుకై తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహానుభావుడు.

08/14/2018 - 18:56

ప్రకాశం పంతులుగారి జీవితమే ఒక అద్భుతం. అనేకమైన సాహస ఘట్టాలతో చిత్ర విచిత్ర మలుపులతో కూడినది. ఆయన సహజగుణాలైన ధైర్యం, సాహసం, నిర్లక్షణ చిన్నతనం నుంచే కనపడ్డాయి. చాలాసార్లు ప్రాణాపాయ స్థితులలో అదృశ్య హస్తం ఆయన వెంట ఉండి కాపాడింది. దానినే విధి, కాలం , అదృష్టం, దైవ నిర్ణయం అంటారేమో.

08/14/2018 - 18:50

ప్రకాశంగారి జీవితమే ఒక పోరాటం. ఎన్నో సందర్భాలలో మృత్యువు అంచుల దాకా వెళ్ళి, ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకుని ధైర్యంతో చివరిక్షణందాకా పోరాడి విజయం సాధించాడు. అయితే ఆయన అల్లరి చిల్లరి వారితో తిరిగినా, ఆ నాటకాల గొడవల్లో పడి తగాదాల్లో కూరుకుపోయినా ధర్మం తనవైపే ఉందన్న ఆత్మజ్ఞానమే ఆయనను రక్షించింది.

Pages