S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

02/19/2017 - 01:34

శీతాకాలం ముగిసి వసంతం వచ్చేసినట్లు తెలియాలంటే వాతావరణంలో వచ్చిన మార్పులు, పంచాంగాలపై మనం ఆధారపడతాం కదా! కానీ ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ‘గ్రౌండ్‌హగ్స్’ కదలికల ఆధారంగా వసంతం ఎప్పుడు వచ్చేదీ తెలుసుకుంటారు అక్కడి వారు. శీతాకాలంలో సుషుప్తావస్థలో గడిపేసే ఈ ఉడతజాతి జీవులు మత్తు వదిలి బొరియల్లోంచి బయటకు వచ్చి తమ నీడ పడే తీరును చూసి వసంతం మొదలయ్యే రోజును లెక్కిస్తాయట.

02/19/2017 - 01:32

పెంపుడు జంతువులు, ఉడకని మాంసాహారం తినడం ద్వారా ఇతర జీవుల్లోకి చేరే పరాన్నజీవి టేపేవార్మ్. అతిధేయి తినే ఆహారాన్ని తిని బతికే టేప్‌వార్మ్ (బద్దెపురుగు) చాలా సన్నగా, తెల్లగా పొడవుగా ఉంటుంది. పెద్దచిన్న పేగుల్లో ఆశ్రయించి తన పబ్బం గడుపుకునే ఇవి అతిధేయి జీవిని బట్టి పొడవు పెరుగుతుంది. మనుషుల్లో నాలుగైదు అడుగుల మేరకు పెరిగితే కొన్ని జంతువుల్లో 30 అడుగుల మేర పొడవు ఉంటుంది.

02/12/2017 - 04:17

మనదేశంలో చాలాచోట్ల సంక్రాంతి సందర్భంగా కనుమనాడు పశువులకు పూజ చేయడం రివాజు. కానీ వియత్నాంలో ఏటా ఫిబ్రవరి మొదటి వారంలో పశువులకు రంగులద్ది పండుగ చేసుకోవడం ఆనవాయితీ. దీనికోసం హనమ్ ప్రావిన్స్‌లో జరిగే పశువుల రంగుల పండుగకు దేశం నలుమూలల నుంచి వచ్చే రైతులు పోటీల్లో పాల్గొంటారు. తాము పెంచిన పశువులకు విభిన్నమైన రంగులతో అలంకరించి పోటీలోకి దించుతారు.

02/12/2017 - 04:16

ఉత్తర అమెరికా, కెనడాల్లో కనిపించే ఈ ‘రెడ్ కార్డినల్’ పక్షులను అలా పిలవడానికి అసలు కారణం తెలుసా. రోమన్ కాథలిక్ చర్చిలలో ‘కార్డినల్స్’ ధరించే వస్త్రాలు, టోపీ ఎర్రటి రంగులో ఉంటాయి. అలా ఎర్రటి రంగులో ఉండే ఈ పక్షులను కూడా ‘రెడ్‌కార్డినల్ బర్డ్స్’గా పిలవడం అలవాటైంది. కాంతివంతమైన ఎరుపు రంగుతో మెరిసిపోయే ఈ పక్షులు మగవి. ఆడపక్షులు ఇంత మెరుపు, ఎరుపుతో ఉండవు.

02/05/2017 - 01:09

ఉత్తర అమెరికా, మెక్సికో, కెనడాల్లో మాత్రమే కనిపించే ‘ప్రెయరీ డాగ్స్’ నిజానికి కుక్కలు కావు. కనీసం అవి కుక్కల జాతికి చెందినవి కూడా కాదు. వాటి రూపురేఖలు కూడా కుక్కలతో పోలి ఉండవు. కేవలం పేరులో మాత్రమే ‘డాగ్’ అన్న పదం ఉంటుంది. నిజానికి ఇవి ‘ఉడత’ (గ్రౌండ్ స్క్విరల్) జాతికి చెందినవి. సమూహాలుగా జీవించే వీటి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.

02/05/2017 - 01:07

సాధారణ ‘్ఫంచ్’ పక్షులు ఒక్క ఆస్ట్రేలియాలో తప్ప ప్రపంచం అంతటా కనిపిస్తాయి. అక్కడి వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలం కాదు. నాలుగు ఉపజాతులు, 40 రకాల ‘్ఫంచ్’ పక్షుల్లో కామన్ ట్రూ ఫించ్ పక్షుల సంఖ్య ఎక్కువ. ఆడపక్షులు కాస్త లేత రంగుల్లో ఉంటే మగపక్షులు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. సాధారణంగా ఎర్రటి ముఖంతో ఉండే మగపక్షులంటే ఆడపక్షులకు ఎంతో ఇష్టం.

02/05/2017 - 01:04

పిస్తా ఉత్పత్తిలో ఇరాన్ అగ్రస్థానంలో ఉన్నా వినియోగంలో మాత్రం చైనాయే టాప్. అక్కడి వారికి పిస్తా పప్పులంటే పిచ్చి. ఆరోగ్యం కోసం వాటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పిస్తా పప్పుల ఉత్పత్తిలోను, వినియోగంలోను అమెరికా రెండో స్థానంలో ఉంది. ఒక పిస్తా చెట్టు రెండేళ్లకు ఓసారి 50 కిలోల పప్పులను లేదా 50వేల పప్పుగింజలను ఇస్తుంది. మొదట

01/28/2017 - 23:35

ఔను. ‘్ఫగ్’ అని పిలిచే ‘అత్తి పండ్లు’ తింటే పొగాకు వాడకంపై ఏవగింపు పెరుగుతుందట. ఇది నిజమేకూడా. అందుకే సిగరెట్లు తాగేవారు ఆ అలవాటు మానుకోవాలంటే ఈ పళ్లను తినమని వైద్యులు సూచిస్తారు. మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో పుట్టి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతున్న ఫిగ్ తియ్యటి గుజ్జుతో కూడిన పండు. వీటిని ఔషధ పరిశ్రమలో క్రీములు, లోషన్స్ తయారీకి వాడతారు. కాస్మొటిక్ పరిశ్రమలోనూ దీనిని ఉపయోగిస్తారు.

01/28/2017 - 23:34

రకూన్స్ కుటుంబానికి చెందిన ఈ ‘కిన్‌కజూ’లను స్పానిష్ భాషలో ‘ల ల్లొరొన’ అని పిలుస్తారు. ఆంగ్లంలో దీని అర్థం ‘క్రయింగ్ విమెన్’ అని. ఇది విభిన్న రకాలుగా అరిచే జంతువే అయినా ఒక్కోసారి మహిళలు ఏడుస్తున్న విధంగా పెద్దశబ్దంతో ఇవి అరుస్తాయి. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. మెక్సికో, ఉత్తర, మధ్య అమెరికాలో ఇవి కనిపిస్తాయి. ఐదు అంగుళాల పొడవైన నాలిక వీటికి ప్రత్యేకం.

01/28/2017 - 23:33

కుక్కల జాతికి చెందిన తోడేళ్లలో ‘గ్రే వోల్ఫ్’ చాలా దేశాల్లో కనిపిస్తాయి. కోరపళ్లు, బలమైన దంతాలు, దవడలతో చిన్నచిన్న జంతువులను చీల్చిచెండాడి పీక్కు తినడంలో వీటికి పోటీ లేదు. ఇది అందరకూ తెలిసిందే. కానీ చాలా సందర్భాలలో ఇవి కొన్ని రకాల పళ్లను వెతికివెతికి మరీ తింటాయి. ముఖ్యంగా పియర్స్ పళ్లంటే వీటికి ఎంతో ఇష్టం. ఫిగ్స్, యాపిల్స్ నైట్‌షేడ్ కౌబెర్రి, బిల్‌బెర్రి పళ్లనూ, లిల్లీ పూలనూ తింటాయి.

Pages