S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచనాలు!

06/18/2017 - 23:52

నిలువెత్తు నీడ
నాకు తోడొస్తుంది
ఎంతెత్తు కట్టడాలనైనా
చిటికెలో అధిగమించేస్తుంది
కడలి సుడుల అడుగు
అగాధంలో సైతం
సంవత్సరాల తరబడి
‘శ్వాస’ పీల్చకుండా
సాహసయానం చేస్తుంది
అందరినీ అలరించి
ఆశ్చర్యంలో ముంచెయ్యాలని
ఎన్ని అద్భుతాలు చేసినా
తనని ఎవరూ గుర్తించలేదని
‘మాట’ మానేసి వౌనంగానే
తన సాహసాలను సాగిస్తుంది

06/18/2017 - 23:51

అలా ఒంటికాలితో
జపం చేస్తున్నదేం
కొంగ
చేపల్ని వేటాడ్డానికా...

కావ్... కావుమంటూ
మందిని కాకి
పిలుస్తున్నది
సమష్టి ఆరగింపుకా...

తోటంతా గాలించి
శోధించీ చిలుక
ఓ తియ్యని జాంపండుని
సాధించి వదిలి వెళ్లిందే...

06/18/2017 - 23:49

మా ఇంటి చూరు కింద కుంపటి
పస్తుల పూటల్ని దాటుకుంటూ
ఇయ్యాల.. కాస్తంత రాజుకొంటుంది
ఒళ్లంతా పేదరికాన్ని కప్పుకున్న
కట్టెలు కూడా కనికరంగా
పెళపెళమంటున్నాయ

06/18/2017 - 23:47

సన్నగా పొందిగ్గా
పొడుగ్గా పెరిగి
పక్వానికొచ్చి
ఎర్రగా మిలమిల మెరిసే
నన్ను అల్లారుముద్దుగా పెంచుకున్న
నా రైతు బతుకుటకై
మార్కెట్టుకు తరలించగా
వేలంలో వెర్రిగా బలై
కూడబలుక్కున్న దళారీల దగుల్బాజీల
మూడుముక్కలాటలో
ముప్పుతిప్పలపాలై
అప్పుల రొంపిలో
ఎగబోస్తూ ఎగాదిగా
తూలనాడుతూ
తక్కెడలో తూస్తున్న నన్ను చూసి

06/18/2017 - 23:45

వెంటాడే వేధించే భయానివి నువ్వు
నీ కోసం వెతుకుతూ వేచి ఉన్న ప్రేమని నేను
అందనంత దూరంలో నువ్వున్నా...
అందుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నా!
సముద్రంలోని అలలా ఎప్పుడూ పారిపోతూనే ఉన్నావ్!
నీ శ్వాసనై నీలో చేరిపోదామనుకున్నా...
కానీ నిఛ్వాసనై విడిపోతానేమోనని భయం
నీ నీడనై ఉందామంటే చీకటితో చెరిపేస్తావని భయం
వాననై వచ్చి పలకరిద్దాం అంటే

06/11/2017 - 00:53

అమ్మ లాలన
జోలపాట దీవెన
బోసినవ్వులు!

వేసవికాలం
మల్లెల గుబాళింపు
తొలి వలపు!
తాటి ముంజెలు
విసనకర్ర చెట్టులో
వెన్నముద్దలు!

వీస్తున్న గాలి
కొత్త ఊహల్లో తేలి
పురివిప్పింది!
ఏరు చెప్పింది
నేలమ్మతో చెలిమి
ఎంతో బలిమి!

06/11/2017 - 00:52

పావురాన్ని చంపినంత తేలిక కాదు
ప్రాణాన్ని పోయగల పాటని చంపడం
ఏడంతస్తుల మేడని కూల్చినంత తేలిగ్గాదు
శిథిలాల్లోంచి చిగురుటాశను పుట్టించే
పాటని మట్టుబెట్టడం!

06/11/2017 - 00:47

ముళ్ళ కంచెలెన్నో దాటుకొచ్చా కానీ
నీ చూపుల కంచెలనే దాటలేకపోతున్నా!

కష్టాల కడలినే దాటుకొచ్చా కానీ
నీ మాటల సంద్రానే్న దాటలేకపోతున్నా!

ఆశల కలలెన్నో నింపుకొచ్చా కానీ
చేసిన బాసలను నింపుకోలేకపోతున్నా!

ఈసడింపులెన్నో తుంచుకొనొచ్చా కానీ
నీ చులకనభావాన్ని తుంచలేకపోతున్నా!
అడ్డంకులెన్నో తుడుచుకొనొచ్చా కానీ
నీ వౌనపు మసిని తుడవలేకపోతున్నా!

06/04/2017 - 01:23

కూలిపోయన వంతెనలగుండా
మాటలు చిక్కుకుని విలవిలలాడినప్పుడు
ఎండ సోకని మూలాలలో నన్ను నేను
ఎప్పటికప్పుడు తప్పిపోతాను

కడవల కొద్దీ కన్నీళ్లను
అనుభవాల దొంతరలో
పాతరేసి పోరాడుతున్న
ఒంటరి కెరటాన్ని

06/04/2017 - 01:20

సర్దుకుపోవడం
సరైన పద్ధతి కాదు
సర్దుకుపోవడమంటే
తప్పును సమర్థించడమే
జరిగే తప్పుని ఎదిరించలేక
ఓ మూల ఒదిగిపోవడమే

తప్పును తప్పించుకుపోతే
తప్పు తప్పులతో కలిసి
తడికలా అల్లుకుపోతుంది
కదిపే ప్రయత్నం జరిగితే
కల్లోలం సృష్టించి
ఒప్పును కప్పేస్తుంది

Pages