S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మండి! ఇది నిజం!!

01/22/2017 - 00:44

కొన్ని వింటే నమ్మలేం. స్వయంగా చూసినా కొందరు నమ్మలేరు. అలాంటి సంఘటన ఒకటి లూయిస్ మేరిసన్ అనే ఇంగ్లీష్ టీచర్ జీవితంలో జరిగింది. ఆమె ఇంగ్లీష్ మాట్లాడని దేశాల నించి అమెరికా వచ్చిన వలసదారులకి ఇంగ్లీష్ నేర్పించే క్లాస్‌లని నిర్వహించేది. ఆమె విద్యార్థుల్లోని ఒకరు థామర్‌చెక్.

01/07/2017 - 23:54

1901... బ్రిటన్‌కి చెందిన లీసా గారిక్ వయసు 11. తండ్రి ఆమెకి బాలె నృత్యాన్ని నేర్పించడానికి ఇంటికి వచ్చి బోధించే టీచర్ని నియమించాడు. కాని లీసాకి అది నేర్చుకోవడం ఇష్టం లేక టీచర్ వచ్చినప్పుడల్లా పారిపోతూండేది. గవర్నెస్ వెతికి లీసాని టీచర్ దగ్గరికి తీసుకెళ్తూండేది.

01/01/2017 - 03:16

21 మే 1960. ఉదయం ఐదుంపావు. చిలీలో ఆ సమయంలో తొమ్మిది అగ్నిపర్వతాలు పేలి సంభవించిన భూకంపంలో 1500 మంది మరణించారు. రెక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 8.5గా నమోదైంది. ఫలితంగా పసిఫిక్ మహాసముద్రంలో సునామీ ఆరంభమైంది.

12/24/2016 - 22:40

అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో నలభై రెండేళ్ల హెలెన్ మేసన్ తన కూతురు ఆలిస్ పోయిన దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉంది. అక్కడికి పనె్నండు మైళ్ల దూరంలోని మరో ఊళ్లో పనె్నండేళ్ల లోరీ మరణశయ్య మీద ఉంది. ఆమెని పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ స్టెతస్కోప్‌ని చెవుల నించి తీసేసి లోరీ తల్లి మార్గరెట్‌తో చెప్పాడు.
‘ఐయాం సారీ. గుండె ఆగిపోయింది’
వెంటనే మార్గరెట్ ఏడుస్తూ కూతుర్ని కౌగిలించుకుంది.

12/18/2016 - 01:40

1950లలో హాంకాంగ్‌కి వెళ్లిన పర్యాటకులని గైడ్లు కేట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌కి తప్పనిసరిగా తీసుకెళ్లేవారు. అక్కడ ఓ బల్ల ముందు పుట్టుగుడ్డి ఐన ఓ ముసలివాడు, ఆయన ఆరేళ్ల మనవడు సదా ఉండేవారు. పనె్నండు హాంకాంగ్ డాలర్లు, అంటే దాదాపు రెండు అమెరికన్ డాలర్లని చెల్లిస్తే ఆయన ఓ ప్రశ్నకి జవాబు చెప్పేవాడు. ఏమీ చూడకపోయినా ఆయనకి అన్నీ తెలుసు. రాయడం, చదవడం రాని ఆయన దాన్ని సన్నటి పుల్లతో ఓ కాగితం మీద రాసేవాడు.

12/10/2016 - 22:31

చాలామంది మరణించిన వారు తిరిగి రారని చెప్తారు. కొందరు మాత్రం తిరిగి వస్తారని చెప్తారు. అలాంటి వాళ్లల్లో ఎలిసన్, అతని భార్య కూడా ఉన్నారు. మరణించాక వేరే చోటికి, ఈ ప్రపంచానికి మధ్యగల ఛేదించలేని కంచెని ఎలిసన్ సంతానంలోని ఒకరు ఛేదించారు.

12/04/2016 - 04:48

ఈ ప్రపంచంలో వివరణ దొరకని చాలా విచిత్రాలు జరిగాయి. అలాంటి వాటిలో ఒకటి ఆకాశం నించి పడే వర్షం. ఐతే నీటి బిందువులు కాక రాళ్లు వర్షించడం విచిత్రం. ప్రపంచంలో అనేక కాలాల్లో, అనేక చోట్ల అంతుపట్టని రాళ్ల వర్షాలు కురిసాయి.

12/03/2016 - 21:42

జానీ తను మూడో సంవత్సరం వైద్య విద్యార్థినని సర్కస్‌లో ఎవరికీ చెప్పలేదు. తన కాలేజ్ ఫీజ్ కట్టటానికి అతను వేసవి సెలవుల్లో ఆ సర్కస్‌తోపాటు ప్రయాణించేవాడు. అతని తోటి విద్యార్థులకి కూడా ఇది తెలీదు. దాంతో తన పేరు స్థానంలో బుల్‌వాకర్ అనే పేరుతో ప్రచారం పొందాడు. అతనకి అప్పటి నించీ వైద్యుడిగా నొప్పి మీద ఆసక్తి కలిగింది.

11/19/2016 - 21:39

ప్రపంచంలో రోడ్ల మీద నివసించే బీదవారు కోట్లలో ఉన్నారు. రాత్రైతే తలదాచుకోడానికి వారు తగిన ప్రదేశాలని నిత్యం వెదుకుతూనే ఉండాలి. పార్క్‌లు, పేవ్‌మెంట్స్, అరుగులు లాంటివి వాతావరణం బావున్నప్పుడు ఫర్వాలేదు కాని, వర్షం, మంచు లాంటి ప్రతికూల వాతావరణంలో ఇంకాస్త సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కోవాలి.

11/12/2016 - 19:50

ప్రపంచంలోని పది అనాగరిక ఆయుధాలలో ఒకటి బార్బ్‌డ్ వైర్. 150 ఏళ్ల క్రితం దీన్ని కనిపెట్టారు. ఇది స్వేచ్ఛని కోరే వారికి శత్రువు. ఇనుప తీగెల చుట్టూ ముల్లులా బయటికి పొడుచుకు వచ్చేలా అల్లిన కంచే బార్బ్‌డ్ వైర్ అంటే. దాని లక్ష్యం అడ్డగించి వెనక్కి పంపడం, ప్రవేశాన్ని, పారిపోవడాన్ని నిషేధించడం. గత నూట యాభై ఏళ్లుగా ఇది ఆవులని, ఇతర పెంపుడు జంతువులని బయటికి పోనివ్వకుండా కాపాడుతోంది.

Pages