S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతో - మీరు

04/29/2017 - 23:50

దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ నిజంగా ఆ పదవికి అర్హుడే. కుల రాజకీయాల్లో మగ్గిపోతున్న రాష్ట్రాన్ని ఉద్ధరించడం చాలా కష్టమే అయినా ఎవరైనా ఉద్ధరించే వారున్నారా అని ఆలోచిస్తే ఆ యోగి ఒక్కడే జ్ఞాపకం వస్తాడు.

04/22/2017 - 23:42

సండే గీత ‘అనుకూలం’ నేటి మేధావులనుకునే వారి నుంచి సామాన్యుల వరకు అనుసరణీయమైన ముఖ్య విషయాన్ని ప్రస్తావించారు. తనకు నచ్చని వృత్తి మార్పు వల్ల ఉత్పన్నమయిన కాలాన్ని వృథా కానీయక ‘లా’ పుస్తకాలను ఆంధ్ర, ఆంగ్ల భాషలలో రచించిన నిజామాబాద్ న్యాయమూర్తిగారు అభినందనీయులు.

04/16/2017 - 02:21

‘అమృతవర్షిణి’లో హరికథా పితామహుని విశేషాలు చదివి మిక్కిలి సంతోషించాం. ఆనాటి వారి మిత్రుల, బంధువుల, శిష్య ప్రశిష్యుల పేర్లను చదువుతుంటే ఏదో మధురానుభూతి. ఒకసారి నారాయణదాసు గారు ‘జానకీ శపథం’ కథ చెప్పబోతున్నట్లు ప్రకటించారు. పండిత పామరులందరూ రామాయణ కథలో సీతమ్మతల్లి చేసిన శపథం ఏమిటి చెప్మా అని ఆసక్తిగా చూడసాగారు. మన దాసుగారు రామాయణంలో కొన్ని అద్భుత ఘట్టాలను, అందరికీ తెల్సినవే గానం చేశారు.

04/09/2017 - 00:17

జనమే జయుడు మోదీ గురించిన కవర్‌స్టోరీ ఆహ్లాదకరంగా ఉంది. సామాన్యుడు అత్యున్నత పదవి చేపట్టి రాణించడం చాలా కష్టం. మోదీపై ఎన్ని కేసులు? ఎంత వ్యతిరేక ప్రచారం? ఎన్ని అవమానాలు? అయినా మోదీ విజేత అయ్యాడు. ప్రపంచంలో ఏ నేతా ఇంత విష ప్రచారాన్ని ఎదుర్కోలేదు. అలాగే ప్రపంచానికి మనం ఏమి ఇస్తామో ప్రపంచం మళ్లీ మనకు అదే ఇస్తుందన్న ధర్మసూక్ష్మం ‘సండే గీత’లో బాగా వివరించారు.

04/01/2017 - 23:33

స్వచ్ఛమైన మనసు, నిండైన ఆత్మవిశ్వాసం, సడలని మనోనిబ్బరం - ఇవన్నీ కలగలిసిన ఆత్మసౌందర్యమే అసలైన అందం - అంటూ యాసిడ్ దాడుల్లో కురూపులుగా మారిన యువతులు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన షీరోస్ రెస్టారెంట్ గురించిన ఫీచర్ ఆకట్టుకొంది. ఆగ్రా అనగానే తొలుత గుర్తుకు వచ్చేది తాజ్‌మహల్. తర్వాత సందర్శించేది షీరోస్‌నే అనడంలోనే ఉంది ఆ యువతులు సాధించిన విజయం.
-కె.సుధీర్ (శ్రీనగర్)

03/30/2017 - 02:43

ఒక నాయకుడి అద్వితీయత అన్నది అతని మాటల్లో కంటే కూడా చేతల్లోనే కనిపిస్తుందన్నది మోదీయిజం. ఎందుకంటే 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు అతి సాధారణ స్థాయి నుంచి నిరుపమాన నేతగా మోదీ ఎదగడానికి కారణం విషయ స్పష్టత. భారతదేశ సమస్యలు, సవాళ్లపై లోతైన అవగాహన ఉండటంతో పాటు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై వాస్తవికతతో కూడిన ఆలోచనలను ఆవిష్కరించగలగడం. ఆ యిజం ఆయనదే. ఆ వడీ, వొరవడీ ఆయనదే..

03/18/2017 - 23:31

‘మీకు మీరే డాక్టర్’ శీర్షికన అందజేసిన వ్యాసం ఉపయుక్తంగా ఉంది. అమీబియాసిస్‌కు ఆహారమే ఔషధం అని తెలుసుకొన్నాం. అలాగే ‘ప్రేమ ఎంత మధురం’ కథ ఆలోచింపజేసేదిగా ఉంది. ఇదొక చిక్కు సమస్య. దీనికి సమాధానం లేదని కాదు. మన సమాజ వ్యవస్థలో ఇది ఒక పెద్ద లోపం కాకపోయినా మగాడు భార్య చనిపోయిన ఏడాదికల్లా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. అది తప్పు అని ఎవరూ హెచ్చరించరు. పైగా ప్రోత్సహిస్తారు. కాని ఆడది అలాంటి సాహసం చేయలేదు.

03/12/2017 - 02:04

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు మేళవించిన పంచరంగుల భారతావని మనది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత. ఒక్కో రాష్ట్రానిది తనదైన అనిర్వచనీయ శైలి. మన సంప్రదాయంలో ప్రతిదీ కూడా ప్రజల్ని ఆకట్టుకొనేది. ‘క్రీడ.. క్రీనీడ’ కవర్‌స్టోరీ మమ్మల్ని ఎంతగానో అలరించింది. తమిళనాట చెలరేగిన జల్లికట్టు వివాదంతో అన్ని రాష్ట్రాలు కూడా తనదైన జంతు క్రీడలను తెరపైకి తెస్తున్నాయన్నది వాస్తవం.

03/05/2017 - 00:09

ఆదివారం అనుబంధంలో ఏ శీర్షిక ప్రత్యేకత దానిదే. ‘ఒక్క తూటా చాలు’ సీరియల్ ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఉంటోంది. రాసమణి చెప్పిన మాటలు ఎంతో బావున్నాయి. ఎదుటి మనిషి గురించి తెలుసుకోవాలంటే పెద్దగా తెలివిని ఉపయోగించాల్సిన పనిలేదు. అతను మాట్లాడే తీరు.. ఆలోచించే విధానం చాలు. రకరకాల మనుషులతో సావాసం చేసే రాసమణి పాత్రని మలచిన తీరు మాకెంతో నచ్చింది.

02/25/2017 - 21:51

ఏది ఆనాటి వారసత్వ సంగీతం? గుండె దడ పుట్టించే ధ్వనులనే సంగీతమనే దుస్థితి దాపురించింది. ఏది రాగమో, ఏది తాళమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. టెక్నాలజీ పెరగాలి. కొత్త వాయిద్య పరికరాలు వస్తున్నాయి. రావాలి కూడా. కాని వాటిని ఇష్టం వచ్చినట్లు పలికించేసి సంగీత పరిమాణాలను అపహాస్యం చేస్తున్నారు. ఈ సంగీతమనబడే హోరులో సాహిత్యం ఖూనీ చేయబడుతోంది.

Pages