S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినదగు!

05/26/2018 - 21:48

‘దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం’ అని అంటాడు అర్జునుడు- కృష్ణుడితో విశ్వరూప దర్శన సందర్భంలో. అంటే, సౌమ్యమైన, సాత్వికమైన మానుష రూపానే్న మన మానవ మనస్సు అంగీకరించ గలుగుతుందే తప్ప తామసిక వికృత మానవ రూపాన్ని మన మనస్సు చూడ ఇచ్ఛగించదు.

05/19/2018 - 22:17

స్వర్గం అనేది ఒకటుందని విశ్వసిస్తూ ఆ స్వర్గాన్ని చేరుకోవటానికి కూడా నోట్ల కట్టలు మీద తుది శ్వాస విడిస్తే సరిపోతుందనుకుంటే ఎలా?’

04/14/2018 - 22:11

గిక గీత
*
మనం మాతృగర్భ అవతారులం.. భూగర్భ జీవులం.
మన మాతృగర్భాలకు సరితూగే మాతృగర్భాలు ఈ భూగర్భంలో కోటానుకోట్లు.
ఈ భూగర్భం విశ్వగర్భంలోనిదే.. ఈ విశ్వ గర్భాన్ని పోలిన విశ్వగర్భాలు అనేకాలు.
మొత్తానికి, మాతృగర్భమైనా, భూగర్భమైనా, విశ్వగర్భమైనా ఏకగర్భమైన ఆ హిరణ్యగర్భ అంశలే...
ఆ అరూప గర్భానికి రూప అంశలే!
ఆ అరూప అంశనే మన ఆత్మ కూడా!

04/08/2018 - 00:54

బద్ధి యోగం చేతనే యోగసాధకులమైన మనం ‘ఆది’ అస్తిత్వాన్ని
ఆవిష్కరించుకోగలం. అయితే ఈ బుద్ధియోగానికి కావలసింది
ఆత్మభావం. ఈ ఆత్మభావం స్వయం ప్రకాశకం. ఈ జ్ఞాన ప్రకాశం వల్లనే అజ్ఞానం అనే అంధకారం తొలగుతుంది. అప్పుడు కానీ ఆదితత్వం అందుబాటులోకి రాదు. ఇదీ యోగసాధకుల యోగవిభూతి వైభవం.

04/01/2018 - 00:11

విశ్వం, సృష్టి, ప్రకృతి, చరం, ఆచరం, దృశ్యం, అదృశ్యం, వృతం, అమృతం, సత్, అసత్, అణువు, కణం - ఇలా అన్నిటికీ కేంద్రమైంది ఆది స్థితి.. అన్నిటా తానే అయి ఉంది ఆరిజిన్. ఇలా ‘ఆది’ది విరాట్ తత్వం.. విరాడ్రూపం.
* * *

03/24/2018 - 21:44

‘భగవద్గీతలో విభూతి యోగం అంటూ ఒక అధ్యాయం ఉంది కదా! నుదుట విభూతి పెట్టుకుని ధ్యానం చేయటమే విభూతి యోగమా?’ చైతన్య ప్రశ్న.

03/17/2018 - 21:48

‘నాకు నేనుగా ఉండలేనా?’
కలిసిన ప్రతిసారి చైతన్య ఇలాగే ప్రశ్నిస్తుంటాడు.
చైతన్యకు అవి ప్రశ్నలు కావచ్చు కానీ నాకు మాత్రం అవి ప్రశ్నల్లా అనిపించవు. అది ఆరాటం.. తపన.
నిజానికి ఈ ప్రశ్నలు చైతన్య ఒక్కడిదే కాదు, తన తరానికి చెందిన ఆరాటమే కాదు.. అది తరతరాల తపన.
తపనకు సమాధానం తపస్సు, యోగసాధన తప్ప మాటల అల్లిక కాదు.. ఆలోచనల గూడూ కాదు.

03/10/2018 - 23:15

‘వృత్యువు విరాట్ తత్వాన్ని వొడిసి పట్టుకోవటం అంటున్నారు కదా! నిజం చెప్పాలంటే ఈ మృత్యు తాత్విక దర్శనం కాస్త తికమకగా ఉంది. ‘ఆత్మ’ విశ్వరూప దర్శనం కళ్ల ముందుకు వస్తోంది.. ‘ఆది’ విరాట్ తత్వం దర్శనీయమవుతోంది.. ‘మృత్యువు’ విరాట్ తత్వాన్ని చిత్రించుకోవాలంటే ఏ మాత్రం పాలుపోవటం లేదు’ బ్రహ్మయ్య గొణుగుడు కార్యక్రమంలో పడ్డాడు.

03/04/2018 - 21:56

హ్మయ్య చాలకాలం తర్వాత మరోమారు దర్శనమిచ్చాడు. అతడి రాక అంతరార్థం ఏవో కొన్ని భావాలను వెదజల్లటానికే.. మరికొన్ని ఆలోచనలను రేకెత్తించటానికే. ఇంకొన్ని రహస్యాలను రాబట్టడానికే.

02/17/2018 - 23:57

ఆత్మా! హృదయ క్షేత్రంలో ఉంటూ దేహాతీతంగా నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు. నీ ప్రయాణ పరిణామంతో మృత్యువుకు అతీతంగా, కాలానికి అతీతంగా ఈ మానవజన్మను మరుజన్మ లేకుండా పరిక్రమింప చెయ్యి.
-ఇదీ గిక సంకల్పం.. ఇదీ గిక లక్ష్యం.
* * *

Pages