S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 04:48

పామర్రు, నవంబర్ 20: సేవా సంస్థలు చేపట్టే ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్, పామర్రు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి వర్ల రామయ్య అన్నారు. మానవతా సేవా సంస్థ దత్తత తీసుకున్న స్థానిక వారణాసి హిందూ శ్మశానవాటిక పునర్నిర్మాణానికి ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే డివై దాస్‌తో కలిసి భూమిపూజ చేశారు.

11/21/2016 - 04:47

నాగాయలంక, నవంబర్ 20: దివిసీమ కేంద్రమైన అవనిగడ్డ ఆర్టీసీ బస్ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల విషయంలో సంబంధిత డిపో మేనేజర్ అవగాహనా లోపం, నిర్లక్ష్య వైఖరి వల్ల సంస్థ ఆదాయానికి లక్షల రూపాయల్లో గండి పడుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 1986లో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు అవనిగడ్డలో అప్పటివరకు ఉన్న బస్టేషన్‌కు అనుబంధంగా బస్ డిపోను ప్రారంభించారు.

11/21/2016 - 04:47

విజయవాడ (క్రైం), నవంబర్ 20: బ్యాంకులు, ఏటిఎం సెంటర్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్ హెచ్చరించారు. రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకులు, ఏటిఎం సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ప్రజల సౌకర్యార్ధం ఆయా చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

11/21/2016 - 04:45

విజయవాడ, నవంబర్ 20: రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే.. అలాగే ఆ నిర్ణయాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోరాదు. అయితే దీని వ్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నేడు అన్ని వర్గాల ప్రజలు విలవిలలాడుతున్నారంటూ ఎపి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.

11/21/2016 - 04:44

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 20: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టి-20 సిరీస్‌ను విండీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండవ టి-20లో 31 పరుగుల తేడాతో భారత్‌పై విజయాన్ని సాధించి మరో టి-20 మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది.

11/21/2016 - 04:43

బెంజిసర్కిల్, నవంబర్ 20: పెద్దనోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా, రాష్ట్రంలో అసాధారణ పరిస్థితి నెలకొందని శాసన మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య తెలిపారు. నోట్ల రద్దు కారణంగా రైతులు, రైతు కూలీలు, దినసరి కూలీలు, చేతి వృత్తులవారు, చిన్న వ్యాపారులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నాయని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

11/21/2016 - 04:43

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 20: సోమవారం జరగనున్న విఎంసి స్టాండింగ్ కమిటీలో తీసుకోబోతున్న పుష్కర బిల్లులపై కీలక నిర్ణయం పై తర్జన భర్జన నెలకొంది.

11/21/2016 - 04:42

విజయవాడ, నవంబర్ 20: బ్లాక్ మనీ జబ్బులో మునిగిపోయిన దేశాన్ని పెద్దనోట్ల రద్దుతో ఒడ్డున పడేసేందుకు ప్రధాన మోదీ చేస్తున్న ప్రయత్నానికి ప్రతిపక్షాలు సహకరించాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టేలా ఆరోపణలు చేయడం తగదని బిజెపి రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం ఆదివారం ఉదయం జరిగింది.

11/21/2016 - 04:42

విజయవాడ (కల్చరల్), నవంబర్ 20: సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను, సన్నివేశాలను హాస్యంగా మలిచి కార్టూన్ రూపంలో మనకు అందించి మనలో హాస్యం పుట్టించే కార్టూనిస్ట్ గొప్ప భావకుడని ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. హాస్యానందంగా సరదాగా సాయంత్రం కార్యక్రమం ఆదివారం సాయంత్రం గాంధీనగరంలోని ఒక హోటల్‌లో జరిగింది.

11/21/2016 - 04:41

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 20: దొంగనోట్లు, అక్రమార్కులు, నల్లధనం నిర్మూలనకై కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమని ఆంధ్రా బ్యాంక్ డిజిఎం జిఎస్‌వి కృష్ణారావు పేర్కొన్నారు.

Pages