S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 23:50

ఇచ్చోడ, సెప్టెంబర్ 26: నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో బీడీ కార్మికురాలు బండి రుక్మ (40), శివాజీ బీడీ కంపెని యజమాని ఎర్రన్న (50) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే...

09/26/2016 - 23:49

కడెం, సెప్టెంబర్ 26: ఎన్నికల సమయంలో కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపి రాథోడ్ రమేష్ ఆరోపించారు. సోమవారం హరిత రిసార్ట్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కెసిఆర్ అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు అందించలేకపోయారన్నారు.

09/26/2016 - 23:49

మంచిర్యాల, సెప్టెంబర్ 26: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ఉదృతి కొనసాగుతోంది. ఎగువ కురిసిన వర్షాలు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేతతో సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు భారీగా చేరడం వల్ల ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తివేయడంతో 3.92లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వొదులుతున్నారు.

09/26/2016 - 23:49

దివ్యనగర్, సెప్టెంబర్ 26: భారీ వర్షాల మూలంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం దిలావర్‌పూర్ మండలంలోని గుండంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద జిల్లా ప్రత్యేకాధికారి వికాస్‌రాజ్, కలెక్టర్ జగన్‌మోహన్‌తో కలిసి పత్తి, మిరప, సోయాబీన్, వరి పంటలను పరిశీలించారు.

09/26/2016 - 23:48

ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెరువులు, కుంటలు, జలాశయాలు తెగి పోకుండా ముందస్తు చర్యలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలో జరిగిన భారీ వర్షాలతోసంభవించిన వరద నష్టంపై మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి నిర్మల్, ఆదిలాబాద్ నియోజక వర్గాలను సందర్శించారు.

09/26/2016 - 23:48

దిలవార్‌పూర్, సెప్టెంబర్ 26 : ఇటీవల కురిసిన బారీ వర్షాలకు నష్టపోయిన రైతులను,బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.మండలంలోని గుండంపెల్లి ఎక్స్ రోడ్డు వద్ద రైతులు నష్టపోయిన పంట పోలాలను, లోలంలో కూలీన ఇండ్లను సోమవారం మంత్రి అల్లోల ప్రత్యేకాధికారి వికాస్ రాజ్‌తో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు బాసటగా నిలుస్తామని

09/26/2016 - 23:47

ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: నూతన జిల్లాల ఏర్పాటుకు ముందే డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి అందిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జెసి సుందర్ అబ్నార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెసి అధ్యక్షతన డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించారు.

09/26/2016 - 23:47

ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహించగా జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నిండు కుండలా తలపిస్తున్నాయి. ఈనెల 23, 24 తేదీల్లో ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ మహారాష్ట్ర నుండి జిల్లాను తాకిన వరద నీటి ప్రవాహంతో గోదావరి ఉదృతరూపం దాల్చింది.

09/26/2016 - 23:45

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26: జిల్లాలో గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాది వర్షాలు లేక కరువులో కొరల్లో చిక్కుకున్న రైతులకు ఈ ఏడాది వర్షాలు సంవృద్దిగా కురిశాయి. ఆశించిన మేర వర్షాలు కురిసినా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురియడంతో రైతులు కుదేలైయ్యారు. వర్షాలు కురిసిన ఆనందం మరవకముందే నష్టాలు తమదరి చేరడంతో రైతులు లాబోదిబోమంటున్నారు.

09/26/2016 - 23:45

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26: జిల్లా కేంద్రమైన పాలమూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా కేంద్రంలోని పలు రోడ్లు చెరువులను తలపించాయి. ముఖ్యంగా జడ్చర్ల నుండి రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు, నాళాలు నిండి పొంగిపొర్లాయి.

Pages