S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 06:06

గద్వాలటౌన్, సెప్టెంబర్ 25: గద్వాల జిల్లా చేయాలని నడిగడ్డ ప్రజల ఆందోళనలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుతో నడిగడ్డ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించకుండా రాజకీయ కోణంలో జిల్లాల ఏర్పాటును ఎందుకు చేస్తున్నారని నడిగడ్డ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఉద్యమకారులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. జెఎసి మూడు రోజుల బంద్ విజయవంతంగా సాగింది.

09/26/2016 - 06:06

మక్తల్, సెప్టెంబర్ 25: మక్తల్, నారాయణపేట నియోజకవర్గంలోని 70 గ్రామాల ప్రజలకు సత్యసాయి తాగునీరు అందక దాదాపు రెండున్నర నెలలు కావస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం ఎంతవరకు సమంజసమని అఖిలపక్ష నాయకులు మక్తల్ మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత డిసిఎంఎస్ చైర్మన్ నిజాంపాష, జెడ్పీటిసి వాకిటి శ్రీహరి, పిసిసి సభ్యులు శ్రీనివాస్‌గుప్త, బిజెపి నాయకులు

09/26/2016 - 06:04

ఆదిలాబాద్, సెప్టెంబర్ 25: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా ఎగువ న కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పోటెత్తి పరవళ్లు తొక్కుతోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తివేసి 4లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరికి వదలడంతో జిల్లా సరిహద్దులోని గోదావరి పరివాహక ప్రాంతాలను హైఅలర్ట్ ప్రకటించారు.

09/26/2016 - 06:03

ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 25: మండలంలోని సదర్‌మాట్ ఆయకట్టు శనివారం రాత్రి 12 అడుగులకు చేరుకుంది. పోలీసులు బాదన్‌కుర్తి, ఒగులాపూర్ బ్రిడ్జిపై ఎప్పటికప్పుడు ప్రేక్షకులను గమనిస్తూ వారు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంచేస్తున్నారు. సదర్‌మాట్ ఆనకట్ట లోపలికి వెళ్లకుండా కంచెలు నిర్మించి చిన్నపిల్లలను లోనికిపోకుండా ఇరిగేషన్ డిప్యూటి, జె ఈలు పోలీసు పహారాలో కాపుకాస్తున్నారు.

09/26/2016 - 06:01

నిజామాబాద్, సెప్టెంబర్ 25: కుండపోత వానలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. జిల్లాలో ఇప్పటికే వర్షాల తాకిడితో ముగ్గురు మృత్యువాత పడగా, తాజాగా మరో ఇద్దరి ప్రాణాలను వరదలు కబళించాయి. కామారెడ్డి పట్టణంలో శనివారం రాత్రి ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షంతో పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపు జలాలు చొచ్చుకువచ్చాయి.

09/26/2016 - 06:01

బాన్సువాడ, సెప్టెంబర్ 25: ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయని, దీంతో వచ్చే సంవత్సర కాలం పాటు తాగు, సాగునీటికి ఢోకా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ మండలంలో పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకున్న కొన్ని చెరువులను సందర్శించి పరిశీలించారు.

09/26/2016 - 06:00

నిజామాబాద్, సెప్టెంబర్ 25: ఎగువ ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఉద్ధృతంగా వచ్చి చేరుతున్న వరద నీటితో నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. నిన్నమొన్నటి వరకు చుక్కనీరు చేరక బోసిపోయి కనిపించిన నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా ఒక్కసారిగా ముంచెత్తిన వరద ప్రవాహంతో నిండుదనాన్ని సంతరించుకుంది.

09/26/2016 - 06:00

వేల్పూర్, సెప్టెంబర్ 25: మూడు రోజుల క్రితం వేల్పూర్ మండలం పడిగెల గ్రామ శివారులోని నవాబు చెరువు అలుగు ప్రవాహానికి కొట్టుకుపోయిన పడిగెలకు చెందిన ప్రియాంక(25) మృతదేహం ఆదివారం మధ్యాహ్నం లభించింది. ప్రియాంక కుమారుడు వర్షిత్(2) మృతదేహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు వర్షిత్ అచూకి లభించలేదు.

09/26/2016 - 05:59

కామారెడ్డి, సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లా రైతాంగానికి వరప్రదాయినిగా నిలుస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్ట్‌జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ నిండుకుండాల ఉండటమే కాకుండా ప్రాజెక్ట్‌లోకి వస్తున్న వరదనీటిని 10వరద గేట్లను ఎత్తివేసి దిగువ గోదావరిలోకి వదిలిపెడ్తున్నారు.

09/26/2016 - 05:58

వరంగల్, సెప్టెంబర్ 25: వరంగల్ జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే ఓరుగల్లు నగరం తేరుకుంటోంది. ఆదివారం వరంగల్‌లో వర్షాలు లేకపోగా వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వడ్డేపల్లి, భద్రకాళి చెరువుల మత్తడి మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది.

Pages