S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 02:52

నిజాంపట్నం, జూలై 24: గ్రామంలోని ప్రజలు కలిసి కట్టుగా ఉన్ననాడే ఏదైనా సాధించుకోవచ్చునని కోస్టర్ సెక్యూరిటి ఐజి జి సూర్యప్రకాశరావు అన్నారు. మండలంలోని బొర్రావారిపాలెం నూతనంగా నిర్మించిన శ్రీఅంకమ్మతల్లి నీటిశుద్ది కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.

07/25/2016 - 02:48

కాకినాడ, జూలై 24: మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా జిల్లా ప్రజానీకాన్ని విషజ్వరాలు నిలువునా వణికిస్తున్నాయి. వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య గత రెండు రోజులుగా గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని ఏజన్సీ గ్రామాలలో విషజ్వరాలు విజృంభించిన విషయం తెలిసిందే. గిరిజన ప్రాంతాల్లో ప్రజలను విషజ్వరాలు పీడిస్తుండటంతో వైద్యఆరోగ్య శాఖ అప్రమమైంది.

07/25/2016 - 02:48

అమలాపురం, జూలై 24: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలన్న ప్రభుత్వ ఆశయానికి అధికారులు నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల లాభేపేక్ష తూట్లు పొడుస్తోంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి, వౌలిక సదుపాయాల కల్పనకు సర్వశిక్షాభియాన్ ద్వారా ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా వాటిని వినియోగించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

07/25/2016 - 02:47

సామర్లకోట, జూలై 24: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సామర్లకోటలో వున్న ఏలేరు కాలువలో వరద నీటి ఉద్ధృతి బాగా పెరిగింది. నిత్యం పరిశ్రమల వ్యర్థ జలాలతో దర్శనం ఇచ్చే ఏలేరు కాలువలో వరద నీటి ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. పెద్దాపురం పైనున్న మెట్ట ప్రాంతాల్లో జోరుగా కురిసిన వర్షం నీరు కిందకు వస్తోంది. దాంతో వరద నీటి ప్రవాహం ఏలేరు కాల్వకు పెరిగింది.

07/25/2016 - 02:47

కోటనందూరు, జూలై 24: తూర్పు, విశాఖ జిల్లాల్లోని మెట్ట భూములకు సాగునీరందించే తాండవ జలాశయం నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉండడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన తప్పడంలేదు. నీటి విడుదల సమయం సమీపిస్తున్నా నీటి మట్టం పెరుగుదలలో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ఇందుకు ప్రధాన కారణం జలాశయం పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే.

07/25/2016 - 02:46

శంఖవరం, జూలై 24: శంఖవరం మండలంలో గల గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ అండ్ బి రహదారులపై నేడు ప్రజలు, చిన్న వాహనాల కంటే భారీ వాహనాల రాకపోకలే విపరీతంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపై 25 టన్నులకు మించి ప్రయాణించకూడదని ప్రభుత్వ నిబంధనలు తేటతెల్లం చేస్తున్నప్పటికీ, ప్రజలు ఆందోళనలు చేపట్టినప్పటికీ భారీ వాహనాల రాకపోకలు పెరుగుతున్నాయి తప్ప, తగ్గడం లేదు.

07/25/2016 - 02:46

మలికిపురం, జూలై 24: గొల్లపాలెం జిజిఎస్ నుండి 20 రోజుల క్రితం క్రూడ్ ఆయిల్ మడ్ లీకేజి అయ్యి పరిసరాల్లోని పంట పొలాలు, సర్వే తోటలోకి వ్యాపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఒఎన్జీసీ అధికారుల బృందం ఈ లీకేజీపై సమగ్ర విచారణ జరిపేందుకు ఆదివారం జిజిఎస్ పరిసర ప్రాంతాల్లోని సర్వే తోటలను, పల్లపు ప్రాంతాలలో పర్యటించి విచారణ నిర్వహించారు.
నదీ గర్భం నుండి పైపులైను

07/25/2016 - 02:46

ఆలమూరు, జూలై 24: మండల పరిధిలోని జొన్నాడలో గౌతమి గోదావరి వద్ద నూతనంగా నిర్మించిన పుష్కర ఘాట్‌లో బురద పేరుకుపోయి ప్రమాదకరంగా మారింది. మరో నాలుగు రోజుల్లో అంత్యపుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. గోదావరి వరదల వల్ల అడుగున్నర మేర బురద పేరుకుపోయింది. ఆ రేవులో స్నానాలు చేసేందుకు ఇప్పటికే అక్కడకు వచ్చే భక్తులకు ప్రమాదకరంగా మారింది.

07/25/2016 - 02:45

కాకినాడ, జూలై 24: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు విధానాన్ని ఇకనుండి ఆన్‌లైన్‌లోనే తనిఖీ చేసేవిధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పిల్లలతో పాటు వసతి గృహాల సంక్షేమాధికారులు, సిబ్బంది హాజరును సైతం ఆన్‌లైన్‌లోనే ఆ శాఖ పర్యవేక్షించనుంది.

07/25/2016 - 02:45

రాజమహేంద్రవరం, జూలై 24: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎపిఎస్‌పిఎఫ్) రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కమాండెంట్ డిఎస్‌ఎ బాషా జెండా ఊపి ప్రారంభించారు.

Pages