S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 02:19

జగిత్యాల టౌన్, జూలై 24: అణగారిన వర్గాలను బిజెపి పాలిత రాష్ట్రాలు అణచివేస్తున్నాయని డిసిసి ఉపాధ్యక్షుడు బండ శంకర్ ఆరోపించారు. ఈమేరకు ఆదివారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బండ శంకర్ మాట్లాడుతూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో అణగారిన వర్గాలను అవమానిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు.

07/25/2016 - 02:19

గోదావరిఖని, జూలై 24: సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కులను సాధించడంలో టిబిజికెఎస్ పూర్తిగా విఫలం చెందిందని సింగరేణి స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌టియుసి) ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ విమర్శించారు. కార్మికులకు మాయ మాటలు చెప్పి గుర్తింపు సంఘంగా ఎన్నికైన టిబిజికెఎస్ ఏ ఒక్కనాడు కార్మికుల కోసం పని చేయలేదన్నారు.

07/25/2016 - 02:18

మానకొండర్, జూలై 24: అగ్రవర్ణాల్లోని పేదలందరికి విద్య, వైద్య, ఉద్యోగ ఉపాధి రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అవకశం కల్పించి సమన్యాయం జరపాలనిఅగ్రకుల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తెలంగాణ ఉద్యమ తరహలో నిరంతరం ఉద్యమిస్తామన్నారు. అదివారం మండల కేంద్రంలోని వేంకటేశ్వర దేవలయంలో ఓసి సంక్షేమ సమావేశం జరిగింది.

07/25/2016 - 02:17

కమాన్‌పూర్, జూలై 24: మండలంలోని గుండారం రిజర్వాయర్ గేట్ల వద్ద బుంగ ఏర్పడడంతో ప్రమాదకరంగా మారింది. కాగా గతంలో ఆర్‌ఎస్‌బి గేట్ల పక్కన ఉన్న గోడ కూలిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌పి అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం దాని పక్కనే సుమారు 15 అడుగుల గోతి ఏర్పడింది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో ఈ గోతి ఏర్పడింది. సిబ్బంది గోతిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చలనం లేదు.

07/25/2016 - 02:17

కరీంనగర్ టౌన్, జూలై 24: సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నీతూ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి మాత్రం యదావిధిగా కొనసాగుతుందని, ఈ మార్పును ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

07/25/2016 - 02:16

కరీంనగర్ టౌన్, జూలై 25: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీలో మూడో దశ ప్రవేశాలు నేటి నుంచి మొదలవుతాయని శాతవాహన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. ఎం. కోమల్‌రెడ్డి తెలిపారు. వర్సిటీ పరిధిలోని 125 డిగ్రీ కళాశాలల్లో 53,880 సీట్లు ఉండగా, ఇప్పటివరకు 22,038 సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు వెల్లడించారు.

07/25/2016 - 02:15

మహదేవపూర్, జూలై 24: మండలంలోని కాళేశ్వర పుణ్యక్షేత్రంలో ఆదివారం కరీంనగర్ జిల్లా ఓఎస్‌డి సుబ్బారాయుడు కుటుంబ సమేతంగా శని పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం పుణ్య స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈవో హరిప్రకాష్ స్వామి వారి తీర్థ ప్రసాదాలతోపాటు మెమోంటోను అందజేశారు. ఆయన వెంట కాటారం సిఐ సదన్ కుమార్, మహదేవ్‌పూర్ ఎస్‌ఐ కృష్ణా రెడ్డి ఉన్నారు.

07/25/2016 - 02:13

ఏటూరునాగారం, జూలై 24: ఏజెన్సీ మండలాలైన ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈనెల 28 నుండి జరిగే మావోయిస్టు వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని మావోలు బాహాటంగా పత్రికా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో, వారోత్సవాలను భగ్నం చేసే దిశగా పోలీసులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

07/25/2016 - 02:12

పరకాల, జూలై 24: పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతికి కారణమైన డాక్టర్లను, నర్సులను తక్షణమే సస్పెండ్ చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చిట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి గందం సమ్మయ్య, మండల పార్టీ అధ్యక్షులు చాడ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

07/25/2016 - 02:11

జనగామ టౌన్, జూలై 24: రాష్ట్రంలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవద్దని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. జనగామ డివిజన్ మద్దూర్ మండలం దూల్మిట్ట గ్రామంలో ఆదివారం ‘ఆణిముత్యాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హన్మంతారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

Pages