S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 02:11

వడ్డేపల్లి, జూలై 24: గత కొన్ని రోజులుగా సమస్యలపై నిర్వహించాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం కోరం లేక ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో వాయిదా పడింది. ముందుగా తెరాస జడ్పీటిసి సభ్యులు రాకపోవడంతో ప్రతిపక్షం నుండి కాంగ్రెస్ జడ్పీటిసి సభ్యులు పది మంది, టిడిపి నుండి ఇద్దరు, ఇండిపెండెంట్ ఒకరు, బిజెపి నుండి ఒకరు సభ్యులు హాజరయ్యారు.

07/25/2016 - 02:10

వడ్డేపల్లి, జూలై 24: భూమిపై మానవ మనుగడ ఎక్కువ కాలం నిలవాలంటే మొక్కల పెంపకం ఎంతో అవసరమని అది ప్రతి ఒక్కరి బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ధర్మసాగర్ మండలంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సిపి ప్రారంభించారు.

07/25/2016 - 02:09

మొగుళ్ళపల్లి, జూలై 24: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి ప్రజలను చైతన్య పర్చి పోరాడేందుకు సిద్దం కావాలని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. మొగుళ్ళపల్లి మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మొగుళ్ళపల్లిలో నిర్వహించారు.

07/25/2016 - 02:02

పాపన్నపేట, జూలై 24: తెలంగాణలో అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావానిమాత ఆలయం ఆదివారం నాడు భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసాన్ని పురష్కరించుకొని అమ్మవారు శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వనదుర్గామాత సన్నిధిలో ప్రవహిస్తున్న పవిత్ర మంజీర నదీపాయల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్దలతో వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

07/25/2016 - 02:01

సంగారెడ్డి టౌన్, జూలై 24: ఆషాడమాసం అమ్మవార్లకు సమర్పించే బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభయ్యాయి. జిల్లాకేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఊరేగింపుగా వెళ్లి ఎల్లమ్మ, పోచమ్మతల్లి ఆలయాల్లో బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓడిఎఫ్‌లో జరిగిన ఉత్సవాల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

07/25/2016 - 02:00

మెదక్ రూరల్, జూలై 24: మిషన్ భగీరథ పనుల నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. సంపు నిర్మాణం కోసం గుట్ట వద్ద ఉన్న బండరాళ్లను బ్లాస్టింగ్ చేయగా రాళ్లు ఎగిసిపడి సమీపంలోనేగల కోళ్లఫారం రేకులు ధ్వంసమయ్యాయి. వందకుపైగా కోళ్లు మృతిచెందాయి. సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.

07/25/2016 - 01:59

వెల్దుర్తి, జూలై 24: జూలై 24 వచ్చిందంటే మాసాయిపేట, తూప్రాన్ మండల ప్రజలనేకాక యావత్ దేశానే్న కుదిపేసిన రైల్వే

07/25/2016 - 01:59

జ్వేల్, జూలై 24: శాంతియుతంగా మల్లన్నసాగర్ ముంపు బాదితులు నిరసన తెలుపుతున్న క్రమంలో పోలీసులు ఉక్కుపాదం మోపి బయబ్రాంతులకు గురిచేస్తుండడం సిగ్గుచేటని మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పోలీసుల లాఠీ దెబ్బలతో గజ్వేల్ ఆసుపత్రికి చేరుకున్న బాదితులను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సునితారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

07/25/2016 - 01:58

మెదక్, జూలై 24: మల్లన్న సాగర్ నిర్వాసితులపై పోలీస్ లాఠీచార్జీని నిరిసిస్తూ సోమవారం నాడు మెదక్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు డిసిసి అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఆదివారం నాడు ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు.

07/25/2016 - 01:58

రాయికోడ్, జూలై 24: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని టిజెఎసి చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. మల్లన్నసాగర్ ముంపుగ్రామాల ప్రజలపై లాఠీ చార్జీ చేయడం దారుణమన్నారు.

Pages