S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 01:48

నారాయణపేటటౌన్, జూలై 24: అభివృద్ధ్ది కోసమే పార్టీలు ఫిరాయించి అధికార టిఆర్‌ఎస్‌లో చేరిన నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యేలు ఈ ప్రాంతాన్ని సస్యశామలంగా ఉంచేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెం.69ని వెంటనే అమలు చేయించాలని పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బిజెపి రాష్ట్ర ఉపాధ్యాక్షుడు నాగూరావు నామాజీ, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకుడు పోటు రంగ

07/25/2016 - 01:48

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 24: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు ఎబివిపి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కో-కన్వీనర్ ఆంజనేయులు విలేఖరులతో మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.

07/25/2016 - 01:46

నిజామాబాద్, జూలై 24: ప్రతిఏటా జరిపే ఆనవాయితీలో భాగంగా పుర ప్రముఖులు, కుల సంఘాల పెద్దలు ఆదివారం నిజామాబాద్ నగరంలో ఊర పండుగ ఉత్సవాన్ని సంప్రదాయ రీతిలో ఘనంగా జరుపుకున్నారు. అనేక విశిష్టతలు, దశాబ్దాల కాలం నుండి నెలకొని ఉన్న ప్రగాఢ నమ్మకాలకు ఈ వేడుక అద్దం పట్టింది.

07/25/2016 - 01:45

ఆర్మూర్, జూలై 24: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఆర్భాటాలే తప్ప అభివృద్ధి కనిపించడం లేదని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ విమర్శించారు. ఆదివారం ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనవసర ఆర్భాటాలు చేస్తూ ప్రజలు, రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చుతోందని అన్నారు.

07/25/2016 - 01:45

నిజామాబాద్, జూలై 24: జిల్లాలో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై అనేక ఫిర్యాదులు వస్తుండడంతో ఎట్టకేలకు ఉన్నత స్థాయి వర్గాలు స్పందించాయి. నిజామాబాద్‌లో కొనసాగుతున్న ఇసుక అక్రమ దందాపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని టిఎస్‌ఎండిసి చైర్మెన్ శేరి సుభాష్‌రెడ్డి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇలంబర్తిని ఆదేశించారు.

07/25/2016 - 01:44

మోర్తాడ్, జూలై 24: మోర్తాడ్ నుండి బస్టాండ్‌కు వెళ్లే డబుల్ రోడ్డు చిన్నపాటి వర్షానికే కాలువలా మారిపోతోంది. రోడ్లపై ఎక్కడికక్కడ గుంతలు పడడంతో వాహనదారులు అదుపుతప్పి ఈ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే సురేష్ కాలనీ వద్ద నాలుగు ప్రమాదాలు జరిగి పలువురు క్షతగాత్రులయ్యారు. కృష్ణవేణి పాఠశాల నుండి రైల్వే బ్రిడ్జి వరకు రోడ్డంతా నీటి ప్రవాహంతోనే కనిపిస్తోంది.

07/25/2016 - 01:44

ఆర్మూర్, జూలై 24: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండినందున వెంటనే గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి ఆర్మూర్ చివరి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు, టిటిడి డైరెక్టర్ అర్కెల నర్సారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/25/2016 - 01:43

డిచ్‌పల్లి రూరల్, జూలై 24: డిచ్‌పల్లిలోని టిఎస్‌ఎస్‌పి పోలీస్ బెటాలియన్‌లో ఆదివారం ఓఆర్‌ఎస్ వారోత్సవాలు నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ వై.శ్రీనివాస్‌రావు ఈ ఉత్సవాలను ప్రారంభించి, ఓఆర్‌ఎస్ వాడాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. సీజనల్ వ్యాధులు సోకి డీహైడ్రేషన్‌కు లోనైన వారికి తప్పనిసరిగా ఓఆర్‌ఎస్ ద్రావణం అందజేయాలని ఆయన సూచించారు.

07/25/2016 - 01:42

నల్లగొండ, జూలై 24: పాఠశాలల్లో యాజమాన్య కమిటీల ఎన్నికలకు నగరా మోగింది. ఆగస్టు 1నుండి 10వరకు పాఠశాలల యాజమాన్య కమిటీల(ఎస్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేయడంతో గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాకమిటీల ఎన్నికల కోలాహలానికి తెరలేచినట్లయింది.

07/25/2016 - 01:41

దామరచర్ల, జూలై 24: మండలంలోని ఇర్కిగూడెం, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లి పుష్కరఘాట్లను జిల్లా ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. పుష్కరపనులు త్వరితంగా పూర్తిచేయాలని ఆయన ఈసందర్భంగా అధికారులకు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేసేందుకు ఘాట్లు పూర్తి అయితేనే చేపట్టాల్సి ఉంటుందని త్వరితంగా ఘాట్లు పూర్తి అయితే ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి వీలు అవుతుందని అన్నారు.

Pages