S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 01:41

చింతపల్లి, జూలై 24: సిపిఐ సీనియర్ నాయకుడు, మునుగోడు నియోజకవర్గ స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని సిపి ఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని టి.గౌరారం గ్రామంలో ఆదివారం జరిగిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఉజ్జిని నారాయణరావు స్మారక స్ధూపాన్ని ఆవిష్కరించిన అనంతరం స్మారక సభలో ఆయన మాట్లాడారు.

07/25/2016 - 01:40

నాంపల్లి, జూలై 24: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండేళ్ళలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గట్టి సంకల్పంతో అభివృద్ది మంత్రంగా పనిచేస్తున్నాడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాలన్నీ అభివృద్ది చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని స్వాములవారి లింగోటం, పస్నూరు గ్రామాలలో వివిధ అభివృద్ది పనులకు శంఖుస్ధాపన చేశారు.

07/25/2016 - 01:39

నల్లగొండ టౌన్, జూలై 24: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం తీసుకున్న చోటే పనిచేసే విధంగా అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని టి ఎస్ యుటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం టి ఎస్ యుటి ఎఫ్ కార్యాలయంలో జిల్లా శాఖ ఆఫీసు బేరర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

07/25/2016 - 01:39

మేళ్లచెర్వు, జూలై 24: వచ్చే నెల 12నుండి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగనివ్వమని జిల్లా ఎస్పి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కిష్టాపురం, వజినేపల్లి, బుగ్గమాధారం పుష్కరఘాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. వాహన వోల్డి ప్రదేశాలు, పార్కింగ్ ప్రదేశాలు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు ట్రాఫిక్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

07/25/2016 - 01:38

బొమ్మలరామారం, జూలై 24: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఆలేరు ఎం ఎల్ ఏ, ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి అన్నారు.

07/25/2016 - 01:37

చింతపల్లి, జూలై 24: మానవ మనుగడకు మొక్కలే ఆధారమని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని షిరిడీ సాయిబాబా ఆలయ ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. మొక్కలు నాటినప్పుడే వర్షాలు బాగా కురుస్తాయని పేర్కొన్నారు.

07/25/2016 - 01:36

భువనగిరి, జూలై 24: మట్టికోసం జరిపిన తవ్వకాల్లో మహాంకాళి, ఆంజనేయస్వామి విగ్రహాలు బయల్పడ్డాయ. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని సీతానగర్ కాలనీలో ఆదివారం పట్టణంలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ శివారులోని సీతానగర్ కాలనీలో ఇటీవల వెలసిన వెంచర్ కోసం కోటగడ్డను తవ్వుతుండగా మహాంకాళి, ఆంజనేయస్వామి దేవాలయం బయటపడ్డాయ.

07/25/2016 - 00:51

అక్షరం మాతృభాష మాధుర్యం తాగించింది
పరభాష ఔన్నత్యం చూపించింది
మేనాలో మేఘాలపై వూరేగించింది
సముద్రాన్ని లంఘించి దాటించింది!
కోకిల సుధాగీతానికి
పావురాయి కుహుకుహు రాగానికి
అక్షర విన్యాసం వుంది
పరదేశంలో స్వదేశాన్ని పొగిడినా
స్వదేశీలో పరదేశాన్ని కీర్తించినా
అక్షర ప్రఖ్యానమే!
అక్షరానికి ఎల్లల్లేవు
ఐక్యరాజ్యసమితిలో అక్షరం ప్రబలితే

07/25/2016 - 00:48

ఈ నెల 11వ తేదీ సాహితిలో ‘అది చపలచిత్త చార్వాకమే’ అంటూ సాంధ్యశ్రీగారు రకరకాల ‘వాద సాహిత్యాలు’ గురించి క్లుప్తంగా అయినా సవివరంగా నిరసించారు. కులాలు, మతాలు, ప్రాంతాల అవలంబనగా, ఇంకా స్ర్తివాద సాహిత్యం అంటూ వెర్రిమొర్రి అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు వంటివి వైషమ్యాలతో కూడుకున్నవని ఇంతవరకూ, బహుశా ఎవరూ చెప్పలేనంత స్పష్టంగా, నిర్దుష్టంగా వారు వివరించారు.

07/25/2016 - 00:47

తెలుగు కవిత్వరంగంలో లఘు కవితా కిరణం ఒకటి వెలిగింది. అది ‘నానీలు’ కవితా రూపం. ఇది డా. ఎన్.గోపి చేతిలో నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. ఆయన కలం నుంచి ధారావాహికంగా కొన్నాళ్లు వెలువడ్డాయి. ఆ తరువాత ఆపేసారు. కానీ నానీలు విజృంభణ ఆగలేదు. నానీల్లో కవితా సృజనకి విరామం లేదు. నిర్విరామంగా సీనియర్ కవులనుండి కొత్త కవులదాకా, వయోధికుల నుండి బాలకవులదాకా నానీలను తలకెత్తుకున్నారు. కళ్లకద్దుకున్నారు.

Pages