S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 00:46

దండేపల్లి, జూలై 24: మండలం గూడెం గోదావరి నదిపై గల పాత వంతెనపై నుంచి ఆదివారం ఆధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కడెం ప్రాజెక్ట్ నుండి గోదావరి నదిలోకి నీటిని వదలడంతో గోదావరి నదిలో నీటి ఉదృతి కోనసాగుతుంది. దీంతో పాత లోలేవల్ వంతెనకు ఇంచు కింద వరకు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గత కొద్ది రోజులుగా చిన్న వాహనాలకు అనుమతించిన అధికారులు ఆదివారం పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

07/25/2016 - 00:45

తిర్యాణి, జూలై 24: మండలంలో ఆదివారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో మండల కేంద్రం నుంచి మారుమూల గ్రామాలకు వెళ్లే రహదారుల మద్యలో గల వాగులన్నీ ఉప్పొంగడంతో రవాణా సౌకర్యం ఎక్కడికక్కడ స్థంబించిపోయింది. కాగా చెల్మెడ వాగు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు వచ్చి చేరడంతో మత్తడి పొంగిపొర్లుతోంది.

07/25/2016 - 00:45

మందమర్రి, జూలై 24: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కోరారు. ఆదివారం స్థానిక 6వ వార్డులోని ఊరు రామకృష్ణాపూర్‌లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరు రామకృష్ణాపూర్, ఎమ్మెల్యే కాలనీల్లో మొక్కలు నాటారు.

07/25/2016 - 00:45

కుంటాల, జూలై 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారంలో భాగంగా ఆదివారం మండలంలోని అర్లికె ఎక్స్‌రోడ్డు వద్ద గల సాయి శ్రేయ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి హరిత తెలంగాణను సాధించుకుందామని ఆయన తెలిపారు.

07/25/2016 - 00:44

నెనె్నల, జూలై 24: మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలం అయింది. వర్షానికి మండలంలోని కుమ్మరివాగు, జోగాపూర్ మత్తడి వాగు, ఎర్రవాగు, ఖర్జి వాగులు పొంగి పొర్లడంతో ఎటు ప్రయాణీకులు అటే నిలిచిపోయారు.

07/25/2016 - 00:44

శ్రీరాంపూర్ రూరల్, జూలై 24: సింగరేణిలో రెండునెలల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూ కత్తులుదూసుకుంటున్నా యి. కయ్యానికి కాలుదువ్వుతూ సై అంటే సై అని విమర్శలకు సిద్ధపడుతున్నారు.

07/25/2016 - 00:43

బాసర, జూలై 24: గోదావరి నదికి పుష్కరాలు గతేడాది జులై 14న ప్రారంభమై 12 రోజులపాటు వైభవంగా సాగాయి. సాధారణంగా ఏ నదికైనా మొదటి 12 రోజులు పుష్కరాలు నిర్వహిస్తారు. కాని గోదావరి నదికి మాత్రం అంత్య పుష్కరాలు నిర్వహించారు. పుష్కర సంవత్సరంలో చివరి 12 రోజులైన ఈనెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అంత్య పుష్కరాలు సాగనున్నాయి.

07/25/2016 - 00:43

ఆదిలాబాద్, జూలై 24: జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని, మావోయిస్టు, ఉగ్రవాదజాడలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం నిరాధారమని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ స్పష్టం చేశారు. ఆదివారం ఈ మేరకు మీడియాకు ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేస్తూ..

07/25/2016 - 00:42

భైంసా రూరల్, జూలై 24: ఈతకోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటి కుంటలోపడి మృతిచెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బారి ఇమామ్‌గల్లీ అసద్‌బాబానగర్ కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకోసం వెళ్లి నీటి కుంటలో పడి మృతిచెందారు.

07/25/2016 - 00:42

ఆదిలాబాద్ టౌన్, జూలై 24: పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని ఎంపి గెడం నగేష్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో రెండవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ మున్సి పల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషాతో కలిసి ఆయన మొక్కలు నాటారు.

Pages