S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

,
07/25/2016 - 00:39

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టా కరంగా నిర్వహించుకునే పండుగల్లో బోనాలు మొదటిది. మానవ సమాజంలో ప్రకృతి ఆరాధన అనాదికాలంనుంచి సాగుతూ వస్తున్నదే.

07/25/2016 - 00:31

* కులాంతర వివాహం చేసుకోకూడదా? అలా చేసుకున్న వారిని చంపటం ధర్మమా?
- యన్.సురేంద్ర, కొత్త గాజువాక
వర్ణాశ్రమ వ్యవస్థ ధర్మమైతే, దాన్ని అతిక్రమించి వర్ణాంతర వివాహాదులను ఆచరించటం అధర్మమే అవుతుంది. అది అధర్మమైనంత మాత్రాన దానికి మనకు తోచిన శిక్షవేయటం ధర్మం కాజాలదు. మన ధర్మశాస్త్రాల ప్రకారం ఇలాంటి అధర్మాలకు మరణదండన ఎంత మాత్రమూ విహితం కాదు, సమర్థనీయం కాదు.

07/25/2016 - 00:29

జగన్మాత నామాల్లో దుర్గామాత నామం విశిష్టమైనది. దుర్గానామం పలికేచోట శివుడి కైలాస మందిరమే ఉంటుందంటారు. దుర్గా నామాన్ని గ్రహించి, జపించి, స్మరించడంవల్ల సమస్త దేవతా నామ ఉచ్చారణ ఫలితం లభిస్తుంది. సమస్త ఆపదల సాగరాన్ని దాటడానికి, ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. సంపదల వృద్ధి జరుగుతుంది. దుర్గా నామ స్మరణే దుర్భేద్యమైన రక్షణ. దుర్గా నామ స్మరణ ఎవరైతే చేస్తారో వారికి ఈతి బాధలు ఉండవని వేదసారం.

07/25/2016 - 00:25

అమ్మవారికి చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు, ఆశ్వీయుజమాసంలో జరుపబడే శరన్నవరాత్రులు (దేవీ నవరాత్రులు) లోక ప్రసిద్ధమైనవి. వసంత ఋతువు, శరధృతువులలో ప్రజలు నానా విధములైన రోగాల బారిన పడుతుంటారు. అలాంటి బాధలు రాకుండా ఉండడంకోసం అమ్మవారిని కొలుస్తారు. ఈ రెండు నవరాత్రులే ప్రసిద్ధమైనప్పటికి, దేవీ భాగవతంలో అమ్మవారి నవరాత్రి చతుష్టయం వివరించబడింది.
శ్లో॥ తథాషాడే మాఘే కార్యోమహోత్సవః,

07/25/2016 - 00:24

అమ్మలగన్న అమ్మ బళ్ళారి దుర్గమ్మ. బళ్ళారి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో దుర్గమ్మను అనునిత్యం పూజలు చేస్తూ అమ్మవారిని కొలుస్తున్నారు. బళ్ళారికి వెళ్ళే ప్రతి ఒక్కరూ దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి తరిస్తున్నారు. ఎన్నో మహిమలుగల తల్లిగా కోర్కెలు తీర్చే దేవతగా భక్తులు ఆరాధిస్తున్నారు. దుర్గమ్మ అంటే సాక్షాత్తూ శక్తిస్వరూపిణి.

07/25/2016 - 00:19

సముద్రంలో ఎగసిపడే అలలతో కేరింతలు కొడుతాం కానీ సమస్యలు అనే అలలు జీవితంలోకి వస్తే అధైర్యంతో వెనకడుగు వేస్తాం. ఒక్కొక్క పరిస్థితిలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన చెయ్యడానికి కూడా ధైర్యం చాలదు. అటువంటప్పుడు మనం ఎంతగా క్రుంగిపోతాం అంటే చెప్పనక్కరలేదు. మానసికంగా కృంగిపోవడంతోపాటు శారీరకంగా బలహీనపడతాం.

07/25/2016 - 00:16

అపుడు శ్రీకృష్ణుడు దానిని తలకిందులు చేసి రెండు కాళ్ళు దొరకబుచ్చుకుని గిరగిర తప్పి నేలమీద కొట్టి చంపివేయాలని అనుకొంటూ ఉండగా ఆ ఉగ్రజ్వరాధిదేవత కుయ్యో మొర్రో అని ఆక్రోశించింది. అపుడు కృష్ణ కృష్ణ! జ్వరాన్ని కడతేర్చవద్దు. కరుణించి బతకనివ్వు అని అశరీరవాణి కృష్ణుణ్ణి అర్థించింది. కృష్ణుడు కరుణించాడు.

07/25/2016 - 00:15

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, తమన్నా జంటగా విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అభినేత్రి’. ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గూర్చి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ, ‘మూడు భాషల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

07/25/2016 - 00:12

చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన హైప్ ఎంత రావాలో అంత చేశారు. ఇంకా అది చాలదన్నట్లు హీరోయిన్ విషయమై రోజుకొక కొత్త వార్త వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ బంతి కాజల్ కోర్టులో పడింది. కాజల్ చిరంజీవి సరసన నటించడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది హీరోయిన్ల తర్వాత కాజల్ మాట వినిపిస్తోంది.

07/25/2016 - 00:10

జయ.బి దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రం నాలుగో షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాల్ని, ఓ ఫైట్‌ని, ఓ పాటని చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకురాలు జయ మాట్లాడుతూ, ‘లవ్‌లీ’ తర్వాత మరోసారి సూపర్‌హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా ‘వైశాఖం’. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ మిక్స్ అయిన ‘వైశాఖం’ అపార్ట్‌మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది.

Pages