S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 18:15

హైదరాబాద్: ఫిలింనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం, ఉద్యోగం ఇస్తామని క్లబ్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

07/24/2016 - 18:14

హైదరాబాద్: ఫిలిం నగర్‌లోని కల్చరల్ సెంటర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలి ఇద్దరు కూలీలు మరణించడంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. కల్చరల్ సెంటర్‌లోకి ప్రవేశించి అక్కడ తలుపులు, అద్దాలు, ఫర్నిచర్‌ను వారు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి నాయకత్వంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

07/24/2016 - 18:14

హైదరాబాద్: నగరంలో పలుచోట్ల అనుమతుల్లేకుండా, నాసిరకం పనులతో భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, కొందరు కాంట్రాక్టర్లు కూలీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఫిలింనగర్‌లో ఆదివారం కుప్పకూలిన భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

07/24/2016 - 18:13

పాట్నా: హౌరా-గోరఖ్‌పూర్ రైలులో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న బిజెపి ఎమ్మెల్సీ తున్నా పాండేపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పాండేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బిజెపి బిహార్ శాఖ ప్రకటించింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి పాండేను కోర్టులో హాజరుపరిచారు. ఆగస్టు 6వరకూ ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.

07/24/2016 - 18:07

చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యమై మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. మూడో రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉండటం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. 18 నౌకలు, 8 విమానాలు, ఒక సబ్మెరైన్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉపగ్రహాల సాయంతో శోధిస్తున్నారు.

07/24/2016 - 17:37

ఖమ్మం : బకెట్‌ బాంబుల పేరుతో పోలీసులను మావోయిస్టులు పరుగులు పెట్టించారు. గత రాత్రి రామచంద్రాపురం సమీపంలో వర్రెవాగు వద్ద బకెట్లు పెట్టి వాటిలో బాంబులు ఉన్నాయని చెప్పడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భద్రాచలం-వెంకటాపురం ప్రధాన రహదారిమీద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.ఆగి ఉన్న బస్పుకు కూడా ఒక బకెట్‌ తగిలించి ఈ నెల 28న జరిగే మావోయిస్టుల వారోత్సవాలను విజయవంతం చేయాలని నినాదాలు ఇచ్చారు.

07/24/2016 - 17:34

విజయవాడ: హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

07/24/2016 - 17:32

మహబూబ్‌నగర్‌: తెలంగాణకు అనేక కంపెనీలు రాబోతున్నాయని, హైదరాబాద్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారుతోందని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. షాద్‌నగర్‌ దగ్గర సింబయాసిస్‌ యూనివర్సిటీని ఆదివారం కేంద్రమంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

07/24/2016 - 16:55

హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లో భవనం కూలిన ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆధికారులను సీఎం ఆదేశించారు.

07/24/2016 - 16:52

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఆత్మహుతి దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్‌ పాయింట్‌ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

Pages