S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 16:51

చెన్నై: తమిళనాడులో కృష్ణగిరి-హోసూరు ప్రధాన మార్గంలో ఆదివారం ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.

07/24/2016 - 16:46

విజయవాడ: పుష్కర యాత్రికులకు సంపూర్ణ సహకారం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి సంగమ ప్రదేశంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అక్షయ పాత్ర, టీటీడీ సహకారంతో పుష్కర యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం సూచించారు.

07/24/2016 - 16:43

ముంబయి: జస్టిస్‌ లోధా కమిటీ సిఫార్సులపై సుప్రీం కోర్టు తీర్పును ఏకగీవ్రంగా ఆమోదించినట్లు ముంబయి క్రికెట్‌ సంఘం ( ఎంసీఏ) అధ్యక్షుడు శరద్‌పవార్‌ ఆదివారం చెప్పారు. క్రికెట్‌ పరిపాలనా రాజ్యాంగాన్ని మార్పులు చేసి తిరిగి రాసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ఎంసీఏ అధ్యక్షుడు శరద్‌పవార్‌ నేతృత్వంలో ఆ సంఘం ఆదివారం సమావేశమైంది.

07/24/2016 - 16:29

మెదక్: మల్లన్నసాగర్ జలాశయ పథకాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ పథకానికి భూ సేకరణను వ్యతిరేకిస్తూ కొండపాక మండలం ఎర్రవల్లి వద్ద రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, రైతులపై లాఠీచార్జి చేశారు.

07/24/2016 - 16:29

హైదరాబాద్: ఫిలింనగర్‌లోని కల్చరల్ క్లబ్ వద్ద నిర్మిస్తున్న భవనానికి ఎలాంటి అనుమతులు లేవని, నాసిరకం పనుల వల్లే నిర్మాణంలో ఉండగా భవనం కూలిపోయిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదివారం విలేఖరులకు తెలిపారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు.

07/24/2016 - 16:28

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం మధ్యాహ్నం నగరంలో తెలంగాణ కెసిఆర్ అధికార నివాసంలో విందుకు హాజరయ్యారు. కేంద్ర సహాయం, సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు విభజన వంటి సమస్యలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

07/24/2016 - 15:36

భువనేశ్వర్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే తప్పుడు మార్గంలో వెళితే మనం ముక్కున వేలేసుకోవాల్సిందే. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఏడుగురు టీచర్లపై 15 మంది బాలికలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోరాపుట్‌ జిల్లా దమన్‌జోడిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఉదంతం వెలుగు చూసింది.

07/24/2016 - 14:21

పాట్నా: హౌరా- గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బిజెపి ఎమ్మెల్సీ తున్నాజీ పాండేను పోలీసులు అరెస్టు చేశారు. దురగ్‌పూర్ వద్ద రైలులో ఎక్కిన పాండే ఆదివారం తెల్లవారు జామున అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న బాలిక వద్దకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయగా ఆమె తల్లిదండ్రులు వచ్చి పాండేను నిలదీశారు.

07/24/2016 - 14:21

హైదరాబాద్: నగరంలోని ఫిలిం నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం ఆదివారం కుప్పకూలడంతో ముగ్గురు కూలీలు మరణించగా ఏడుగురు గాయపడ్డారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వద్ద సుమారు రెండు నెలలుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పది పిల్లర్లు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే జిహెచ్‌ఎంసి, అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలను ప్రారంభించారు. శిథాలాల నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు.

07/24/2016 - 13:39

విజయవాడ : కృష్ణాజిల్లా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం ఘాట్‌లో ఆదివారం ఉదయం కృష్ణా హారతి వైభవంగా జరిగింది. కృష్ణా పుష్కరాల ఆహ్వాన ఉత్సవంలో భాగంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ కృష్ణవేణి మాతకు నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Pages