S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 13:35

మహబూబ్‌నగర్‌ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లి వద్ద సింబయాసిస్‌ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని (ఎస్‌ఐయూ) ప్రారంభించారు. నాసిక్‌, నోయిడా, బెంగళూరులో ఇప్పటికే ఎస్‌ఐయూ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

07/24/2016 - 12:54

నల్గొండ: ఓ రైతు తన పొలాన్ని చదును చేస్తుండగా భూమిలో నుంచి కాళికాదేవి విగ్రహం బయటపడింది. నల్గొండ జిల్లా భువనగిరి మండలం సీతానగరం వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాళీమాత విగ్రహాన్ని చూసేందుకు సమీప గ్రామాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. కాళీమాత విగ్రహానికి పూజలు చేస్తున్నారు.

07/24/2016 - 12:54

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా కొంపల్లిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కెటిఆర్ మొక్కను నాటగా, తెరాస నేతలు కేక్ కట్ చేశారు. కెటిఆర్ జన్మదినం సందర్భంగా లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు మొక్కలు నాటారు.

07/24/2016 - 12:53

హైదరాబాద్: తెలంగాణ ఐటి, మున్సిపల్ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్‌కు చెందిన తెరాస నాయకుడు ఎం.ప్రతాప్ ప్రైవేటు విమానం ద్వారా నగరంలో మూడు చోట్ల ఆదివారం ఉదయం పూలవాన కురిపించారు. ట్యాంక్‌బండ్, తెరాస భవనం, సచివాలయం ప్రాంతాల్లో విమానం ద్వారా పూలవాన కురిసింది. నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో పలురకాల విత్తనాలను కూడా విమానం ద్వారా జారవిడిచారు.

07/24/2016 - 12:52

దిల్లీ: ఓ మహిళను బెదిరించినట్లు వచ్చిన అభియోగంపై దిల్లీలో ఆదివారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలి కాలంలో పలు కేసుల్లో ఆప్ ఎమ్మెల్యేలు వరుసగా అరెస్టు కావడం గమనార్హం. తమ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ప్రధాని మోదీజీ అరెస్టు చేయించారని ఆప్ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

07/24/2016 - 12:51

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం కెసిఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

07/24/2016 - 12:51

హైదరాబాద్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్-2 ప్రవేశపరీక్ష ఆదివారం ఉదయం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగే పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో 23వేల మంది, విజయవాడ,విశాఖల్లో 20 వేల మంది అభ్యర్థులు నీట్-2కు దరఖాస్తు చేశారు.

07/24/2016 - 12:44

కర్నూలు : నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి శ్రీశైలం సమీపంలోని పాతాళగంగలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో భక్తులు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా పుష్కరాల పనుల నిర్వహణకు అంతరాయం ఏర్పడుతోంది. రోప్ వే రాకపోకలు నిలిచిపోయాయి.

07/24/2016 - 12:41

విశాఖ : విమానంలో గల్లంతైన ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలను తూర్పు నావికాదళ వైస్‌ అడ్మిరల్‌ బిస్త్‌ ఆదివారం పరామర్శించారు. గల్లంతైన విమానంలో విశాఖపట్టణానికి చెందిన 8 మంది ఎన్ఏడీ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మొత్తం ఆందోళనలో ఉన్నారు.

07/24/2016 - 12:38

చెన్నై : అదృశ్యమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ విమానం కోసం మూడోరోజైన అదివారం గాలింపు కొనసాగుతోంది. 5వేల కిలోమీటర్ల పరిధిలో గాలింపు కొనసాగిస్తున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ ప్రకటించింది. అదృశ్యమైన విమానం జాడ కనిపెట్టే అవకాశం 50 శాతమే ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇస్రో సయితం రంగంలోకి దిగింది. విమానం కూలిందని భావిస్తున్న ప్రాంతంలో సముద్రం లోతు మూడున్నర కిలోమీటర్లవరకు ఉంది.

Pages