S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 12:36

ఢిల్లీ: చైనాకు చెందిన అధికార వార్తా సంస్థ 'జిన్హువా' తరఫున పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు జూలై 31వ తేదీలోగా దేశం విడిచిపెట్టాలని ఇండియా ఆదేశించింది.

07/24/2016 - 08:51

విశాఖపట్నం, జూలై 23: రాష్ట్రానికి మేలు చేస్తామని ప్రజలు భావించడం వల్లే మనకు అధికారాన్ని కట్టబెట్టారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కార్యకర్తలు పనిచేయాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ దివంగత నేత ఎన్‌టిఆర్ పార్టీని స్థాపించి జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి తీసుకెళ్లారని అన్నారు.

07/24/2016 - 08:51

ఏలూరు, జూలై 23 : పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పనుల్లో అలసత్వం వహించిన హెడ్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

07/24/2016 - 08:45

శ్రీకాకుళం, జూలై 23: జిల్లాలో వైద్యం అందని ద్రాక్షగా మారింది. మారుమూల గిరిజన ప్రాంతాలైతే మరీ నిర్లక్ష్యం. కనీసం ప్రశ్నిస్తామంటే ప్రజాప్రతినిధులను సమీక్షలకు పిలవరు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ సంచివైద్యంపై ఆధారపడి కుటుంబ నియంత్రణ చేయించుకుంటున్నారంటే నమ్ముతారా? ఎపుడు మీరు మారుతారు అంటూ పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి తనదైన రీతిలో వైద్యాధికారుల సమీక్షా సమావేశంలో మండిపడ్డారు.

07/24/2016 - 08:44

విజయనగరం, జూలై 23: సంపూర్ణ బహిరంగ మలవిసర్జన గ్రామాలుగా మార్చే కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్ నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో స్వచ్ఛ్భారత్, గ్రామీణ పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన నిర్మూలన అంశాలపై కలెక్టర్ నాయక్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/24/2016 - 08:41

నెల్లూరు, జూలై 23: దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో రైల్వే శాఖకు ఆదాయం అందించే జిల్లాలో విజయవాడ తర్వాతి స్థానం నెల్లూరు జిల్లాది. అంతటి ప్రాధాన్యం కలిగిన నెల్లూరుకు రైల్వే కేటాయింపుల్లోనూ, కొత్త రైళ్ల ఏర్పాటు, హాల్టింగ్ వంటి విషయాల్లోనూ ఎప్పుడూ రైల్వే బడ్జెట్‌లో నిరాశే ఎదురవుతోంది.

07/24/2016 - 08:41

ఒంగోలు,జూలై 23:ఒంగోలు నగర కార్పొరేషన్ వైకాపా మేయర్ అభ్యర్థి రేసులో ఒంగోలుకు చెందిన డి శమంతకమణి ఉన్నారు. ఆ మేరకు ఆమెను పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఒంగోలులోని సిఆర్‌పి క్వార్టర్స్‌కు చెందిన ఆమె వైకాపా తరపున చురుగ్గా పార్టీకార్యక్రమాల్లో పాల్గొంటునే మరోపక్క సేవా కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు.

07/24/2016 - 08:38

కర్నూలు, జూలై 23:గుర్తింపునకు నోచుకోకుండా ఉన్న సప్తనదీ సంగమేశ్వరంపై అధికారుల దృష్టి పడింది. సంగమేశ్వరంలో జరుగుతున్న కృష్ణా పుష్కర పనులను ఉన్నతాధికారులు పరిశీలిస్తూ పనుల వేగం, నాణ్యతను పెంచేందుకు తీశ్రంగా శ్రమిస్తున్నారు. కలెక్టర్ విజయమోహన్ ఇంతవరకూ సంగమేశ్వరంలో పర్యటిస్తూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించగా పుష్కరాల ప్రత్యేకాధికారి అనంతరాము సైతం సంగమేశ్వరాన్ని సందర్శించారు.

07/24/2016 - 08:37

గుంటూరు, జూలై 23: కార్యకర్తలు.. నాయకులు.. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల్లో సమన్వయంతో వ్యవహరిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, ప్రతిపక్షాల ఆరోపణలకు ఊతమిచ్చే విధంగా కాకుండా సమిష్టిగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని డెప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప పార్టీ శ్రేణులకు హితవు పలికారు.

07/24/2016 - 08:35

కాకినాడ, జూలై 23: సమాచార హక్కు చట్టంపై విద్యార్థి దశ నుంచే అవగాహన ముఖ్యమని, ఈ చట్టాన్ని పాఠశాల, కళాశాల విద్యల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ ఆచార్యులు అన్నారు. సమాచార హక్కులో ఉన్న అంశాలతో పాటు భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.

Pages