S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 08:34

తిరుపతి, జూలై 22: రాత్రనక, పగలనక ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మలమూత్రాలను శుభ్రంచేసి పారిశుద్ధ్యాన్ని అందిస్తున్న కార్మికులు కడుపుకాలి పనిచేయడం ఆపితే ఆ పని మరొకరు చేయలేరని ధర్మబద్ధంగా జీతాలిచ్చి వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌కు విజ్ఞప్తిచేశారు.

07/24/2016 - 08:32

కడప,జూలై 23: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ భూములు, రైతుల భూముల్లో కోటి మ్కొలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు. వనం - మనం కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కలెక్టర్ గట్టి చర్యలు తీసుకుని జిల్లా వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు.

07/24/2016 - 08:30

ముదిగుబ్బ, జూలై 23: కర్ణాటక నుంచి దైవ దర్శనానికై తిరుపతి వెళ్తూ ముదిగుబ్బ, సంకేపల్లి మధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5కుటుంబాలకు చెందిన 5గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ముదిగుబ్బ ఎస్సై తెలిపిన మేరకు వివరాలు...

07/24/2016 - 08:28

మచిలీపట్నం, జూలై 23: బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపనలో మరో మైలురాయి పడింది. ఏడాది క్రితం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ల్యాండ్ పూలింగ్ (్భసమీకరణ)గా మారుస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని శనివారం ప్రభుత్వం జీవో నెం. 185 రూపంలో విడుదల చేసింది. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) ద్వారా భూముల సమీకరణకు రంగం సిద్ధమైంది.

07/24/2016 - 08:27

విజయవాడ (క్రైం), జూలై 23: రాష్ట్ర కొత్త డిజిపిగా నండూరి సాంబశివరావు బాధ్యతలు చేపట్టారు. పదవి విరమణ పొందిన జెవి రాముడు నుంచి ఆయన డిజిపి క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నాం బాధ్యతలు అందుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కొత్త డిజిపి కొలువు తీరడమే తడవుగా రాష్ట్రంలోని యూనిట్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.

07/24/2016 - 08:26

మచిలీపట్నం, జూలై 23: తెలుగువారి సంస్కృతి, సంసాంప్రదాయాల విశిష్టత భావితరాలకు తెలియజేసేలా కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మండల పరిధిలోని వాడపాలెం, చినయాదర, భోగిరెడ్డిపల్లి పుష్కర ఘాట్లను మంత్రి రవీంద్ర ఎంపి కొనకళ్ళ నారాయణరావుతో కలిసి శనివారం పరిశీలిచారు.

07/24/2016 - 08:25

నూజివీడు, జూలై 23: నూతన రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వ అవసరాలకు నూజివీడు ప్రాంతంలో అటవీ భూములు సమృద్దిగా ఉన్నాయని జిల్లా అటవీ అధికారి పిజె బెనర్జీ తెలిపారు. నూజివీడుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 5,900 హెక్టార్ల అటవీ భూమిని గుర్తించి, ప్రభుత్వానికి పంపామని ఆయన వివరించారు. శనివారం స్థానిక అటవీశాఖ కార్యాలయాన్ని సందర్శించారు.

07/24/2016 - 08:24

అవనిగడ్డ, జూలై 23: భావితరాలకూ ఉపయోగపడేలా కృష్ణా పుష్కర ఘాట్లను ఆధునీకరిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. అవనిగడ్డ శివారు కొత్తపేట, హంసలదీవిలోని సాగర సంగమం, నాగాయలంక పుష్కర ఘాట్లను పరిశీలించిన ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడారు. శాసనసభ ఉప సభాపతి బుద్ధప్రసాద్ చొరవతో అవనిగడ్డ ఘాట్‌ను రూ.32 లక్షల నుండి రూ.88 లక్షలకు అంచనాలు పెంచటం ద్వారా ఆధునీకరిస్తున్నామన్నారు.

07/24/2016 - 08:21

ఖమ్మం, జూలై 23: నాణ్యతతో పనులు చేపట్టి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామ శివారు బుర్హెన్‌పురంతండాలో 68లక్షల వ్యయంతో చేపట్టిన బిటి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందన్నారు.

07/24/2016 - 08:19

పరకాల, జూలై 23: పరకాల ఆసుపత్రిలో కాన్పు కోసం వస్తే పసికందు మృతి చెందడం ఇది రెండవ సంఘటన అని పలు పార్టీల నేతలు తెలిపారు. జూన్ 28న శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన గజ్జి శ్యాంసుందర్ తన భార్య శృతిని డెలివరీ కోసం తీసుకువస్తే డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో వారు ఆందోళన చెందారు.

Pages