S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 08:17

నిజామాబాద్, జూలై 23: హరితహారం అమలులో ముందంజలో ఉన్న నిజామాబాద్ జిల్లా యంత్రాంగం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టినట్టు రుజువు చేసేందుకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు సర్వే బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో మొత్తం 3.35కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 2.36కోట్ల వరకు మొక్కలు నాటడాన్ని పూర్తి చేశారు.

07/24/2016 - 08:15

భూదాన్ పోచంపల్లి, జూలై 23 : మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామం పిల్లాయిపల్లి సర్వే పనులను శనివారం నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సురేష్‌కుమార్ పరిశీలించారు. ఇటీవల ముఖ్యమంత్రి పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వపనులకు 350కోట్లు ప్రకటించారని, ఈ కాల్వ సర్వే పనులకు 1 కోటి 23 లక్షలు విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు.

07/24/2016 - 08:13

సంగారెడ్డి టౌన్, జూలై 23: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని ఈ 12నుంచి 23వ తేదీ వరకు టిఎస్ ఆర్టీసీ మెదక్ రీజియన్ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్‌ఎం టి.రఘునాథ్‌రావు తెలిపారు. శనివారం ఆర్‌ఎం కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతి రోజూ జిల్లాలోని అన్ని డిపోల నుంచి 70 బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

07/24/2016 - 08:11

అలంపూర్, జూలై 23: తెలంగాణకు హరితహారం అంటే భూమాతకు మణిహారం లాంటిదని మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్, బస్టాండ్ ఆవరణలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపి మంద జగన్నాథంలు మొక్కలను శనివారం నాటారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరితవనంలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

07/24/2016 - 08:09

మంచిర్యాల, జూలై 23: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని గుడిపేట, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు.

07/24/2016 - 08:06

మేడ్చల్, జూలై 23: మేడ్చల్‌లో డెంగీ వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. సీజనల్ వ్యాధుల ఫలితమో లేక పారిశుద్ధ్య నిర్వహణ లోపమో తెలియదు కానీ గత కొన్ని రోజలుగా వివిధ రకాల వ్యాధులు జ్వరాలతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని ఏకలవ్య నగర్ చెందిన లక్ష్మన్(38) అనే వ్యక్తి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ అని తెలింది.

07/24/2016 - 08:05

హైదరాబాద్, బేగంపేట, జూలై 23: ఆషాఢ బోనాల జాతరలో భాగంగా నేటి నుంచి సికిందరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాల జాతర జరగనుంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలను ముచ్చటగా ముస్తాబు చేశారు. లష్కర్ పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి.

07/24/2016 - 08:04

హైదరాబాద్, జూలై 23: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించేందుకు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ పరిషత్ సమావేశం మందిరంలో శనివారం హరితహారం కార్యక్రమంపై జిల్లాలోని శాసన సభ్యులు, జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులతో మంత్రి సమీక్షా నిర్వహించారు.

07/24/2016 - 08:03

హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, జూలై 23: మహానగరవాసులకు జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని మున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. అధికారులు కూడా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ భోలక్‌పూర్ కలుషిత నీటి ఘటన వంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఎప్పటికపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

07/24/2016 - 08:02

హైదరాబాద్, జూలై 23: మహానగరవాసులు తక్కువ సమయంలో, అతి తక్కువ ఛార్జీలకే ఎక్కువ దూరం, ఎంతో సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా అందుబాటులోకి రానున్న మెట్రోరైలు వ్యవస్థకు ఎంతో ఎంతో పటిష్టమైన సిసిటీవి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మెట్రో ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

Pages