S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 05:37

మార్లో (ఇంగ్లాండ్), జూలై 23: ఇంగ్లాండ్ పర్యటనలో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు దుమ్మురేపింది. మార్లోలోని బిషామ్ అబ్బే స్పోర్ట్ సెంటర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్ సీనియర్ జట్టును 1-2 గోల్స్ తేడాతో మట్టికరిపించి శుభారంభాన్ని సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జట్టుకు నీలకంఠ పెనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్‌ను అందించాడు.

07/24/2016 - 05:28

ఆదిలాబాద్, జూలై 23: సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ సమీపంలో నిర్మిస్తున్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం పనులు పూర్తికావడంతో ఆగస్టు 7న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,200 మెగావాట్ల జైపూర్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రానున్నారు.

07/24/2016 - 05:28

హైదరాబాద్, జూలై 23: ప్రముఖ ఆటోరంగ సంస్థ హ్యుందాయ్ యువ ఇంజనీర్లకు పెద్దపీట వేస్తోంది. ఇక్కడి హైటెక్ సిటీ సమీపంలోని హ్యుందాయ్ ఆర్‌అండ్‌డి సెంటర్‌లోకి 50 మంది కొత్త ఇంజనీర్లను తీసుకుంది. ఇప్పటికే ఇక్కడ 750 మంది ఇంజనీర్లు పనిచేస్తుండగా, దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కాలేజీల నుండి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొత్తవారిని ఎంపిక చేసినట్లు ఓ ప్రకటనలో శనివారం సంస్థ తెలిపింది.

07/24/2016 - 05:27

న్యూయార్క్, జూలై 23: అమెరికా టెలికామ్ దిగ్గజం వెరిజోన్ కమ్యూనికేషన్స్.. ఇంటర్నెట్ దిగ్గజం యాహూను కొనుగోలు చేస్తోందా? 5 బిలియన్ డాలర్లకు యాహూను చేజిక్కించుకుంటోందా?. గూగుల్, ఫేస్‌బుక్ ధాటికి తట్టుకోలేకపోయిన యాహూ తమ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టినది తెలిసిందే.

07/24/2016 - 05:25

ముంబయి, జూలై 23: ఇప్పుడిక కార్ల వంతు.. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకుని, వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా కార్లను బకాయిల వసూళ్లలో భాగంగా బ్యాంకర్లు అమ్మకానికి పెడుతున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి మాల్యా, ఆయన నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2014 జనవరి 31 నాటికి బకాయిపడింది 6,963 కోట్ల రూపాయలుగా ఉంది.

07/24/2016 - 05:23

విజయవాడ, జూలై 23: నవ్యాంధ్రలో 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో సౌర విద్యుత్ పార్కులను అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో నాలుగు వేల మెగవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పార్కులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు.

07/24/2016 - 05:14

విజయవాడ, జూలై 23: పోలీస్ శాఖలో కేవలం 60 రోజుల్లోనే చూడదగ్గ మార్పులు ప్రజలకు కనిపించేలా తాను చర్యలు చేపట్టనున్నానని ఇన్‌చార్జి డిజిపి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం డిజిపి క్యాంప్ కార్యాలయంలో జెవి రాముడు నుంచి బాధ్యతలు స్వీకరించిన తదుపరి పోలీస్ ఉన్నతాధికారులు, 13 జిల్లాల ఎస్పీలతో వివిధ అంశాలను సమీక్షించారు.

07/24/2016 - 05:10

అనకాపల్లి, జూలై 23: విద్యుత్ కొరతకు తావులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దానని, ఫలితంగా పరిశ్రమల పురోగతి మరింత వేగవంతం కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడి వద్ద 102 కోట్ల వ్యయంతో నిర్మించే ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్ శంకుస్థాపన శనివారం జరిగింది.

07/24/2016 - 05:07

గాజువాక, జూలై 23: ప్రత్యేక తరహాలో రూపొందించిన డ్రైవ్ ఇన్ థియేటర్ (కంటైనర్ థియేటర్)ను ఎపి సిఎం చంద్రబాబునాయుడు విశాఖలో శనివారం ప్రారంభించారు. సుమారు రూ.35 లక్షల వ్యయంతో కంటైనర్‌లో అత్యాధునిక సదుపాయాలతో థియేటర్‌ను ఎస్‌టిబిఎల్ సంస్థ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో మూతబడుతున్న సిన్మా హాళ్లను దృష్టిలో ఉంచుకుని, దీన్ని రూపొందించినట్టు సంస్థ యజమాని వీరభద్రరావు సిఎం చంద్రబాబుకు వివరించారు.

07/24/2016 - 05:05

ఔను..రోకలిబండ అని పిలిచే సహస్రపాది (మిల్లిపెడె) నేలమీద మనుగడ సాగించిన తొలి జీవిగా శాస్తవ్రేత్తలు చెబుతారు. దాదాపు 480 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఆధారాలతో వారు ఈ విషయాన్ని చెబుతున్నారు. మిల్లిపెడె అంటే వెయ్యికాళ్ల జీవి అని లాటిన్‌లో అర్థం. నిజానికి అన్నికాళ్లు వీటికి ఉండవు. వందనుంచి 750 వరకు ఉంటాయి. జెర్రికి, రోకలిబండకు స్పష్టమైన భేదం ఒకటి ఉంది.

Pages