S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 03:34

హైదరాబాద్, జూలై 23 : తెలంగాణ రాష్ట్రంలో దవాఖానాల్లో సంస్కరణలు తీసుకువస్తున్నామని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఔషధ సేవలు, వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎంఎస్‌ఐడిసి) పనితీరును శనివారం ఆయన సమీక్షించారు. ప్రభుత్వ దవాఖానాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

07/24/2016 - 03:32

వరంగల్, జూలై 23: హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్ రైలులో చిన్నపిల్లల తరలింపు కలకలం రేపింది. శనివారం ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌లో ఒరిస్సా నుంచి 78 మంది చిన్నపిల్లలను తరలిస్తున్నారంటూ ఇక్కడికి సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్ వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకొనేలోపే సివిల్, జిఆర్‌పి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

07/24/2016 - 03:30

కరీంనగర్, జూలై 23: జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు భద్రత కరువైంది. శనివారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని పిల్లల వార్డులో ఒక్కసారిగా భవనం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఒక చిన్నారి, ఆమె తల్లిదండ్రులతోపాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో జరిగిన ఈ ఘటన రోగులను భయాందోళనకు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/24/2016 - 03:30

ధర్మపురి, జూలై 23: గోదావరి పరివాహక ఎగువన కురిసిన వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు నుండి నీటిని నిరంతరంగా గోదావరిలోకి వదులుతుండడంతో శనివారం నది నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది.

07/24/2016 - 03:29

ఆర్మూర్, జూలై 23: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ నెల 14వ తేదిన మృతి చెందిన సుప్రజ(31), నాలుగు నెలల వయసు గల ఆమె కుమారుడు శ్రీహాన్‌ల మృతదేహాలు శుక్రవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చేరుకున్నాయి. అయితే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. మెల్‌బోర్న్‌లో సుప్రజ, కుమారుడు శ్రీహాన్‌లు ప్రమాదవశాత్తు వారు నివసించే భవనంపై నుంచి కింద పడి మృతి చెందారు,.

07/24/2016 - 03:24

హైదరాబాద్, జూలై 23:బీసీల పార్టీగా పేరున్న తెలుగుదేశం అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)పై పూర్తి స్థాయి దృష్టి సారించింది. జనాభాలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉండగా, వారిలో కూడా ఎంబీసీలే ఎక్కువ సంఖ్యలో ఉన్నందున, వారిని ఆకర్షించే ప్రణాళికలకు పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటయిన ఎంబీసీ కార్పొరేషన్ లక్ష్యం కూడా అదే.

07/24/2016 - 03:22

న్యూఢిల్లీ, జూలై 23:ముగ్గురు చైనా పాత్రికేయులను భారత్ బహిష్కరించింది. చైనా అధికార వార్తా సంస్థ జిన్హువాలో పనిచేస్తున్న వూ కియాంగ్, లూ టాంగ్, షియాంగాంగ్‌ల వీసాలను పొడిగించడానికి భారత్ నిరాకరించింది. ఇప్పటికే ఇరు దేశాల సంబంధాలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది.

07/24/2016 - 03:21

పామూరు, జూలై 23: ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని బలిజపాలెం, కోడిగుంపల, బొట్లగూడూరు, కంభాలదినె్న గ్రామాల్లో శనివారం ఉదయం 6.20 గంటలకు, 7.10 గంటలకు రెండుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పామూరు మండలంలో దాదాపు ఇరవై ఐదుసార్లు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు.

07/24/2016 - 03:21

నెల్లూరు, జూలై 23: నెల్లూరు జిల్లాలో నెలకొల్పనున్న అణు విద్యుత్ కర్మాగారం ప్రతిపాదనల్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరులో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు ఎనిమిది వేల మెగావాట్లు సరిపోతాయని, ఇప్పటికే ప్రభుత్వం 30 వేల మెగావాట్లకు అనుమతులు మంజూరు చేసిందన్నారు.

07/24/2016 - 03:20

హైదరాబాద్, జూలై 23:మిత్రపక్షం, ప్రతిపక్షం, తెదేపా అనుకూల మీడియా కలసి ప్రత్యేక హోదాపై తమను ముద్దాయిగా నిలబెట్టాయని బిజెపి అంతర్మధనం చెందుతోంది. బిల్లు ఓటింగు వరకూ రాదని తెలిసినప్పటికీ, రాష్ట్రంలో ఎదురుదాడి, ఆత్మరక్షణ ఏవిధంగా ఉండాలన్న దానిపై రాష్ట్ర నాయకత్వం నుంచి దిశానిర్దేశం కరవయిందన్న ఆగ్రహం బిజెపి నేతల్లో వ్యక్తమవుతోంది.

Pages