S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 03:19

ఐక్యరాజ్య సమితి, జూలై 23: భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే ఆ రెండు దేశాలతో పాటు సభ్య దేశాల సౌహార్ద్రత అవసరమని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక కమిటీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ‘సభ్య దేశాల సౌహార్ద్రత లేకుండా సమస్యను ఎలా పరిష్కరించగలం’ అని కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ జీన్-పాల్ లాబోర్డే అన్నారు.

07/24/2016 - 03:16

విశాఖపట్నం, జూలై 23: మనం శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే విపక్ష పార్టీలు ఖాళీ కావాల్సిందేనని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ వేదికగా శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ పార్టీలోకి వచ్చి చేరుతున్న వారి విషయంలో సీనియర్లు, ఇతర నేతలు ఘర్షణ పూరిత పోకడలను ప్రదర్శించకూడదని హితవు చెప్పారు.

07/24/2016 - 03:16

విశాఖపట్నం, జూలై 23: వాయుసేనకు చెందిన ఎఎన్-32విమానం అదృశ్య ఘటనకు సంబంధించి విమానం ఆచూకీ శనివారం రాత్రికి కూడా లభించకపోవడంతో విశాఖలోని ఎన్‌ఎడికి చెందిన 8 మంది ఉద్యోగుల కుటుంబాలు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాయి. బాధిత కుటుంబాల ఇళ్ల వద్ద తుపాను ముందు ప్రశాంతతవంటి వాతావరణం నెలకొంది.

07/24/2016 - 03:12

హైదరాబాద్, జూలై 23: మరో 593 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టే పోస్టులకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 409 గ్రూప్ 2 పోస్టులను మంజూరు చేశారు. దీంతో మొత్తం 1002 గ్రూప్2 పోస్టులు మంజూరు అయ్యాయి. వ్యవసాయ శాఖ, సహకార శాఖ, రిజిస్టార్ ఆఫ్ కో ఆపరేటివ్‌లోని మొత్తం 62 పోస్టులు ఉన్నాయి.

07/24/2016 - 03:12

హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్‌ల పేరుతో మోసం వెలుగుచూసింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అరెస్టయిన నలుగురు నిందితుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. నిందితుల నుంచి రూ. 10.40 లక్షలు నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

07/24/2016 - 03:11

హైదరాబాద్, జూలై 23: రాజధాని నగరంలో ఇంటి నెంబర్ల సమస్య తీరిపోతుంది. ఎప్పుడో నిర్ణయించిన ఇంటి నెంబర్లతో అడ్రస్ పట్టుకోవడంలో ఇంతకాలం ఉన్న సమస్యను పరిష్కరించడానికి స్వచ్ఛంద సంస్థ ‘ఆస్కి’ ముందుకొచ్చింది. ఆస్కి కార్యాలయంలో హైదరాబాద్ సమస్యలపై మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు సమావేశం నిర్వహించారు. ఆస్కి ప్రతినిధులు, నగర మేయర్‌తో పాటు మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

07/24/2016 - 03:09

విశాఖపట్నం, జూలై 23: రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదాతో పాటు, చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత కేంద్రానిదేనని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.

07/24/2016 - 03:05

హైదరాబాద్, జూలై 23: ఐసిస్ కుట్ర కేసులో రెండో దఫా కస్డడీకి తీసుకున్న నిందితుడు అతావుల్లా రహ్మాన్ పోలీస్ కస్టడీ ముగిసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అతణ్ని శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరచారు. దీంతో కోర్టు అతనికి ఈనెల 26 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశానుసారం రహ్మాన్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

07/24/2016 - 02:54

హైదరాబాద్, జూలై 23: ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బోనాలలో భాగంగా ఆదివారం నుంచి సికిందరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాల జాతర నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఇద్దరు మంత్రులు పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్ అనుచురులు పోటీపడి మరీ ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదులతో ముప్పు పొంచి ఉన్నట్లు ముందస్తుగా గుర్తించిన పోలీసులు బోనాలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

07/24/2016 - 02:50

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ ప్రభుత్వం ధర్మ కార్యాలు నిర్వహిస్తోందని జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతి అన్నారు. ఆగస్టు 12నుంచి జరిగే పుష్కరాలకు రావాలని కోరుతో ప్రభుత్వ సలహాదారు, పుష్కరాల ఆహ్వాన కమిటీ చైర్మన్ కెవి రమణాచారి శనివారం ఆయనకు ఆహ్వాన పత్రం అందజేశారు.

Pages