S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 02:10

వానలు వస్తాయనుకున్నప్పుడు రావు. రావేమో అనుకున్నప్పుడు వచ్చి ముంచుతాయి. 2016 అనే ఈ సంవత్సరంలో ఏప్రిల్‌లో ఎండలు మండిపోయాయి. మామూలు ఫొటో ఇంత బాగుంటే ఎక్సరే ఫొటో మరెంత బాగుంటుందో అన్నట్టు మే, జూన్‌లలో ఎండలు ఎలాగుంటాయని ఆలోచించి అందరమూ భయపడ్డాము. కానీ అనుకోకుండా మేలో వానలు వచ్చాయి. అడపాదడపా వచ్చిన వానలతో ఎండల తాపం తగ్గింది.

07/24/2016 - 02:05

ఈ శీర్షికన అందిస్తున్న కథలూ సందేశాలూ బాగుంటున్నాయి. ‘్భజనం’ చదివి స్ఫూర్తి పొంది రోజులో కనీసం ఒకసారి కుటుంబ సభ్యులందరం కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంటర్నెట్, టీవీ, కంప్యూటర్, మొబైల్ అన్నీ ఈ సమయంలో బంద్. లాండ్ ఫోన్ కూడా పక్కన పెట్టేస్తున్నాం. ఈ చిన్న విషయాన్ని శ్రద్ధతో పాటిస్తే కుటుంబంలో ఐక్యత పెరిగి, మమతానురాగాలు వృద్ధి చెందుతాయన్న నమ్మకం బాగా కలిగింది.

,
07/24/2016 - 02:04

కాబూల్, జూలై 23: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో 80 మంది మృతి చెందారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక ప్రతిపాదిత విద్యుత్ లైన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించడానికి అనేకమంది మైనారిటీ షియా హజారాలు చేరుకున్న ప్రదేశంలో ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడ్డారు.

07/24/2016 - 02:00

ఇదెక్కడి నరమేధం?
ప్రపంచాన్ని శాసించగల అగ్రరాజ్యం
తన బిడ్డల్ని నియంత్రించలేదా?
చంపుకుంటే చంపుకోండని
తుపాకీలకు ఆమోదముద్రలు వేస్తుందా?
ఒక మానవ రాక్షసుడు
ట్రిగ్గర్ నొక్కి అరవై ప్రాణాల్ని
క్షణకాలంలో హరించడమా!
తన నడిబొడ్డులో
నివాసముంటున్న
హంతకుల్ని గుర్తించే టెక్నాలజీ లేదా?
తుపాకీల లైసెన్సులను
నియంత్రించే సత్తా లేదా?

,
07/24/2016 - 01:59

చెన్నై, జూలై 23: బంగాళా ఖాతం మీదుగా ఎగురుతూండగా శుక్రవారం 29మందితో అదృశ్యమైన ఎఎన్ 32 వైమానిక దళ రవాణా విమానం ఆచూకీ ఇంకా తెలియలేదు. బయలు దేరిన కొద్ది నిముషాలకే రాడార్ నుంచి తప్పిపోయిన ఈ విమానం కోసం నలుదిశలా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి పొద్దుపోయే వరకూ విమానం ఏమైంది.. కూలిపోయిందా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

07/24/2016 - 01:58

మూలన ముక్కివాసన కొడుతున్న
లియో టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్’
చేతిలోకి తీసుకుని దులుపుతుంటే-
జాలరి వలలోంచి చటుక్కున మళ్లీ
నీళ్లలోకి దూకిన చేపపిల్లల్లా
రెండు పాత బస్సు టిక్కెట్లు జారి
నా కాళ్ల వేళ్ల మీద పడ్డాయి.
పాతికేళ్ల నాటి పాపాయిలవి!
రెంటిలో ఒకటి నాది
మరొకటి కచ్చితంగా నీదే!
మన డిగ్రీ చివరి సంవత్సరపు చివరి రోజు

07/24/2016 - 01:56

మహానుభావా...
విత్తనం నీదే!
ప్రతీ నేలా-
ఏపుగా ఎదిగే పైరు కోసం
ఫలసాయం కోసం
ఎదురుచూస్తూనే ఉంటుంది.
నీ విత్తనం విఫలం అయినప్పుడు
నేల ‘తల్లి’ని దూషించడమెందుకు?
ఆమెని ‘గొడ్రాలని’ చెప్పి
గొడ్డలితో నరకడమెందుకు?
అమ్మతనం కోసం
అమ్మ ఎప్పుడూ సంసిద్ధమే...
రకరకాల రుగ్మతలతో
మగాడా...
నువ్వే నిషిద్ధం!!

07/24/2016 - 01:52

బి.వి.ఎస్.ప్రసాద్, bvcartoons@gmail.com
ఫేపర్లో ఒకరు నవ్యాంధ్ర అంటారు. స్వర్ణ ఆంధ్ర అని ఒకరు రాస్తారు. మరో సందర్భంలో అవశేష ఆంధ్రప్రదేశ్ అంటారు. ఏది సరైనది?
విశేషణాలు అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే చాలు.

07/24/2016 - 01:43

మనకున్న దానిలో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ...
మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం.

07/24/2016 - 01:39

మహబూబ్‌నగర్/కర్నూలు, జూలై 23: శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చిచేరుతోంది. జూరాల నుంచి విడుదలైన వరద నీరు శనివారం మధ్యాహ్నానికి శ్రీశైలం జలాశయాన్ని చేరుకుంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 788.88 అడుగులకు చేరుకుంది. 23.88 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ జూరాల గేజ్ పాయింట్ వద్ద 35 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Pages