S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 12:26

గాంధీనగర్: గుజరాత్‌లోని ఉనాలో దళితులపై దాడి ఘటన ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం నాడు ఉనాలో బాధిత దళితులను పరామర్శించారు. దళిత వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తున్న బిజెపి నాయకులకు త్వరలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.

07/22/2016 - 12:25

దిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఎపికి ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుపై ఈరోజు రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున తమ పార్టీ ఎంపీలు సభలోనే ఉండాలని టిడిపి, బిజెపి విప్ జారీ చేశాయి. తన పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ ఇదివరకే విప్ జారీ చేసింది. ప్రైవేటుబిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు టిడిపి నేతలు ఇప్పటికే ప్రకటించగా, బిజెపి వైఖరి ఇంకా బహిర్గతం కాలేదు.

07/22/2016 - 07:38

విజయనగరం, జూలై 21: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ కాళిదాసు పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డిఎస్పీలు, సిఐలతో జిల్లావ్యాప్తంగా నమోదైన అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించారు.

07/22/2016 - 07:37

విజయనగరం, జూలై 21: జిల్లాలో చేపల పెంపకానికి అనువైన వాతావరణం, అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. గ్రామ పంచాయతీల తీర్మానంతో ఆయా గ్రామాల పరిధిలోని చెరువులను మహిళా సంఘాలకు అప్పగించి అక్కడ చేపల పెంపకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో మత్స్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

07/22/2016 - 07:37

విజయనగరం, జూలై 21: జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అధికారులు సహకరించి అనుమతులు త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులకు సూచించారు.

07/22/2016 - 07:36

విజయనగరం(టౌన్), జూలై 21: మున్సిపాలిటీలో ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై శే్వతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు డిమాండ్ చేశారు. గడపగడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా గురువారం 19వ వార్డు స్టేడియంపేటలో పాదయాత్ర నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రూపొందించిన ప్రజా బ్యాలెట్‌ను ఇంటింటికి పంపిణీ చేశారు.

07/22/2016 - 07:36

విజయనగరం, జూలై 21: జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులపై సీజన్‌కు ముందుగా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి తెలియజేస్తే రైతులకు వీటిని సకాలంలో అందజేసేందుకు వీలు ఉంటుందన్నారు.

07/22/2016 - 07:35

మక్కువ, జూలై 21: మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఒఎస్‌డి వెంకటప్పలనాయుడు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిఆర్‌పిఎఫ్ వసతి గదులు, భోజనం వాటిని పరిశీలించి ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలపై సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జగన్మోహనరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు.

07/22/2016 - 07:34

బొబ్బిలి (రూరల్), జూలై 21: రెండు రోజులుగా వర్షాలు కురవడంతో కాలువల్లో చెత్తాచెదారాలు ఉండకుండా తక్షణమే పరిశుభ్రం చేయాలని అధికారులను మున్సిపల్ చైర్‌పర్సన్ టి.అచ్యుతవల్లి ఆదేశించారు. ఈ మేరకు తారకరామా కాలనీలో కాలువలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తారకరామా కాలనీలో ఉన్న కాలువల్లో చెత్త నిల్వ ఉండిపోవడంతో వర్షపునీరు వెళ్లేందుకు అవకాశం లేదన్నారు.

Pages