S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 06:38

మల్లాపూర్, జూలై 21: మండలంలోని కొత్త దాంరాజ్‌పల్లికి చెందిన పోలాస కిషన్(50) అనే వ్యక్తి ఉపాధి కోసం వెళ్లీ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఉపాధి నిమిత్తం గత 20 ఏళ్ల నుండి సౌది వెళ్తున్న కిషన్ 15 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా, దాదాపు 15 రోజులు గడుస్తున్నా మృతదేహం స్వదేశానికి రాకపోవడంతో బార్య రాధ, ముగ్గురు కూతుళ్లు అందోళన చెందుతున్నారు.

07/22/2016 - 06:38

వేములవాడ, జూలై 21: శ్రీ రాజరాజేశ్వరస్వామిని భద్రాచలం ఆలయ ఇవో రమేశ్ గురువారం దర్శించుకున్నారు. అంతరాలయంలోని శ్రీ లక్ష్మిగణపతి స్వామివారికి తొలి పూజలను చేసుకున్నారు. అనంతరం లింగాకారంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు.

07/22/2016 - 06:36

తొర్రూరు, జూలై 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, గ్రామాల్లో విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు విద్యార్థులు, ప్రజలు, అంకితభావంతో కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

07/22/2016 - 06:36

మహబూబాబాద్, జూలై 21: పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు సాగుతున్నారని ఆయన ప్రవేశపెడుతున్న పథకాలు యావత్ భారతదేశానికే ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మానుకోట యువజన శిక్షణాకేంద్రం సమీపంలో వందలాదిమంది విద్యార్థులతో కలసి హరితహారంలో భాగంగా గురువారం సుమారు 5వేల మొక్కలు నాటారు.

07/22/2016 - 06:35

వరంగల్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన హరితహార కార్యక్రమం వరంగల్ జిల్లాలో ఉద్యమంలా కొనసాగుతుంది. ప్రతి పక్షాలు హరితహారానికి కాస్త దూరంగా ఉన్నప్పటికి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపిలు, కలెక్టర్, అధికార పార్టీ నాయకులతోపాటు అన్ని శాఖల అధికారులు, పోలీస్‌శాఖ ముమ్మరంగా హరితహార కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు.

07/22/2016 - 06:35

వడ్డేపల్లి, జూన్ 21: నగరంలో జరుగుతున్న పోలీసు కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత పొందిన పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా దేహదారుఢ్య పరీక్షలకు అర్హులే అని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

07/22/2016 - 06:34

రేగొండ, జూలై 21: పచ్చని చెట్లనే దేవుళ్లుగా కొలిచే సంస్కృతి తెలంగాణ ప్రజలదని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం రేగొండ మండలం కొడవటంచలో నిర్వహించిన హరితహార కార్యక్రమాన్ని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ కమటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిరికొండ మధుసూదనాచారిని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

07/22/2016 - 06:33

నిజామాబాద్, జూలై 21: వాతావరణం అనుకూలిస్తూ పంటల సాగుకు పరిస్థితులు కలిసి వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం చొరవతో ఎరువుల ధరలు తగ్గడం రైతులకు ఎంతగానో ఉపశమనాన్ని అందిస్తోంది. అయితే ఎరువుల ధరలు తగ్గినప్పటికీ, వాటికి ఇదివరకటి స్థాయిలో డిమాండ్ మాత్రం కనిపించడం లేదు.

07/22/2016 - 06:32

కోటగిరి, జూలై 21: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీకల్లును పూర్తిగా నిరోధించి, ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించేందుకే ప్రభుత్వం మేలు రకమైన గిరకతాళ్ల చెట్లను నాటిస్తోందన్నారు. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన కల్లుతో పాటు గీతకార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. కోటగిరి మండలం రాంపూర్ గ్రామ శివార్లలో గురువారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గిరకతాళ్ల చెట్లను నాటారు.

07/22/2016 - 06:32

బోధన్, జూలై 21:బోధన్ డివిజన్‌లో బాల కార్మిక నిర్మూలన కోసం ముస్కాన్ ఆపరేషన్ మొదలయ్యింది. పట్టణ కేంద్రాలతో పాటు గ్రామాలలోని ప్రైవేటు వ్యాపార సంస్థలు, హోటళ్లలో పనిచేస్తున్న బాల కార్మికులను పట్టుకుని పాఠశాలల్లో చేర్పించేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై ఒకటవ తారీఖు నుండి మొదలైన ఆపరేషన్ జూలై 30వ తారీఖు వరకు కొనసాగనుంది.

Pages