S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 06:18

కోడేరు, జూలై 21: పర్యావరణ పరిరక్షణకు చెట్లేమూలాధారమని స్థానిక ఎస్సై వెంకటరమణ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు గురువారం నిర్వహించిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని హరితహారం కార్యక్రమ ప్రాముఖ్యత గురించి వివరించారు. జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.

07/22/2016 - 06:16

నల్లగొండ, జూలై 21: రైతులు, ఖాతాదారులకు రుణాల పంపిణీలో జిల్లాలోని ఎస్‌బిఐ రెడ్లరేపాక(వలిగొండ) బ్రాంచ్ ఖమ్మం-నల్లగొండ రీజియన్‌లో అగ్రగామిగా నిలిచి అవార్డులు సాధించింది. మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్ వరకే ఏకంగా 2కోట్ల 14లక్షల బంగారు రుణాలు, 3కోట్ల 66లక్షల పంట రుణాలు పంపిణీ చేశారు.

07/22/2016 - 06:16

భువనగిరి, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే పాలన కొనసాగించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్దంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖా ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర తెలిపారు. గురువారం భువనగిరి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.

07/22/2016 - 06:15

నల్లగొండ, జూలై 21: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎట్టకేలకు బిల్లుల చెల్లింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వారం నుండి ఆన్‌లైన్ ద్వారా బిల్లుల చెల్లింపుకు గృహనిర్మాణ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గత రెండున్నర సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

07/22/2016 - 06:15

నల్లగొండ రూరల్, జూలై 21: ఆది మానవునికి నెలవని చెప్పబడుతున్న నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో ఇప్పటికే చారిత్రాత్మక ఆనవాళ్లు, ప్రాచీన సమాధులు ఉన్నాయన్న సంగతి విదితమే.. ఆంధ్రభూమి వరుస వార్తా కథనాలతో గ్రామంలో చర్చ జరగడంతోపాటు సమాచారం తెల్సుకొని ఆంధ్రభూమి గురువారం ఇదే గ్రామంలో దోమలపల్లి రోడ్డుకు వెళ్లే దారిలో ఉన్న వడ్ల వారి పాడును సందర్శించింది.

07/22/2016 - 06:14

నల్లగొండ, జూలై 21: ఎస్సీ, ఎస్టీలకు భూమి కొనుగోలు పథకం అమలు సక్రమంగా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఎస్పీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ మూడెకరాల భూపంపిణీ పథకం పురోగతిని ఆయన సమీక్షించారు.

07/22/2016 - 06:13

నాగార్జునసాగర్, జూలై 21: నాగార్జునసాగర్‌లోని డ్యాం దిగువ భాగాన కొత్త బ్రిడ్జి వద్ద కృష్ణానది తీరాన కొందరు అక్రమంగా మట్టిని త్రవ్వి ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ కారణంగా పెద్దపెద్ద గుంతలు లాంటి లోయలు ఏర్పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే జరుగుతున్నా అటు ఇరిగేషన్ అధికారులు, అటవిశాఖ అధికారులు సైతం పట్టించుకోవడంలేదు.

07/22/2016 - 06:13

కనగల్, జూలై 21 : కనగల్, దర్వేశిపురం పుష్కరఘాట్లను గురువారం జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. అంతకుముందు పుష్కరాల ఘాట్ల సందర్శనలో భాగంగా పోలీసు అధికారులు, సంబందిత ఉన్నత అధికారులను ఎక్కడ ఏమి చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డి ఎస్పీ సుధాకర్, చండూరు సి ఐ రమేష్, కనగల్ ఎస్ ఐ వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

07/22/2016 - 06:12

నల్లగొండ టౌన్, జూలై 21: జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల వజ్రోత్సవ వేడుకలు నేడు ఉదయం 10గంటలకు కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించేందుకు కళాశాల యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మంత్రి జి.జగదీష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎన్.

07/22/2016 - 06:11

కెరమెరి, జూలై 21: కొమురంభీం మనవడు కొమురం సోనేరావుకు త్వరలో సాగుకు యోగ్యమైన మూడు ఎకరాల భూమిని ల్యాండ్ పర్చేస్ కింద కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ అన్నారు. గురువారం మండలంలోని కొటారి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిని కలెక్టర్ జగన్‌మోహన్, ఐటిడి ఎ పీవో ఆర్‌వి కరుణన్‌తో కలసి పరిశీలించారు. ఈ భూమి వివరాలను ఆర్డీవో ఐలయ్య, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

Pages