S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

02/24/2018 - 21:41

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ విడుదలకు ముందు ఫస్ట్‌లుక్‌ని రికార్డు స్థాయిలో కోటిమందికిపైగా వీక్షించారనీ, రిలీజ్ ముందే 120 కోట్ల బిజినెస్ చేసి మరో రికార్డు సాధించామని చానల్స్ టాంటాం చేశాయి. సినిమా విడుదల మొదటిరోజు ఆ చిత్రం మీద వచ్చినన్ని జోక్స్ మరే చిత్రానికీ రాలేదు. రెండో రోజు గడిచాక సగం థియేటర్లు జారిపోయాయి. వారం తిరిగేసరికి మొత్తం వసూళ్లు యాభైకోట్లే!

02/17/2018 - 23:00

తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడిగా, డైలాగ్‌కింగ్‌గా మోహన్‌బాబుకు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్టయిల్‌ని ఏర్పరచుకున్నారు. వివిధ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని అలరించాయి. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించినన్ని పాత్రలు మరే నటుడూ చేయలేదంటే అతిశయోక్తి కాదేమో! చాలా కాలం విరామం తర్వాత సొంత నిర్మాణ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం ‘గాయత్రి’.

02/10/2018 - 21:54

బాహుబలి చిత్రంతో ప్రభాస్ జగత్ విఖ్యా తి పొందాడని మన మీడియా భజన మొదలుపెట్టింది. బాహుబలిలో కొందరి నటన బాగుందని విదేశీయులు గుర్తిస్తారు కాని వారికి పేర్లు తెలియవు. ప్రభాస్ చిత్రాలు మరో రెండు మూడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయితే వారు అతని పేరు, సమాచారాలు సేకరిస్తారు. అమీర్‌ఖాన్ ఇప్పటికే చైనాలో లగాన్, 3 ఇడియెట్స్ చిత్రాలతో పేరుపొందాడు.

02/03/2018 - 21:24

ఎన్‌కౌంటర్ చిత్రం ద్వారా దర్శకత్వంలోకి అడుగుపెట్టిన ఎన్.శంకర్, తెలుగులో 2 కంట్రీ స్ పేరుతో ఓ విభిన్నమైన చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు.

01/29/2018 - 18:50

మిడిల్‌క్లాస్ మెంటాలిటీ నేపథ్యంగా నాని, సాయిపల్లవి జంటగా నటించిన ఎంసిఏ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొత్త దర్శకుడు ఎంచుకున్న కథ, క్యారెక్టర్ నేపథ్యం కొత్తగా వున్నా, దానిని అలరించేలా ముందుకు నడిపించి ప్రేక్షకులకు సంతృప్తినివ్వడంలో నిరాశే మిగిల్చింది.

01/22/2018 - 18:13

యువతకు చక్కని సందేశం ఇచ్చే కథను ఎంచుకున్న బివిఎస్ రవి, ఎటువంటి పాత్రనైనా అవలీలగా పండించే సాయిధరమ్ తేజ్ లాంటి హీరో, కళ్ళల్లో సాఫ్ట్‌నెస్, క్రూరత్వం రెంటినీ క్షణాల్లో మార్చి చూపించగల ప్రసన్న లాంటి విలన్‌తో జత కట్టినా బలహీనమైన కథనం కారణంగా జవాన్‌ను ఒక సాదా సీదా సినిమాగా మిగల్చడం స్వయంకృతాపరాధమే!

01/08/2018 - 21:18

గతంలో సుధీర్‌బాబు, మారుతి కాంబినేషన్‌లో ‘ప్రేమకథా చిత్రమ్’ నచ్చింది. హారర్ కామెడీతో అదరగొట్టిన ఈ సినిమా తరహాలోనే థ్రిల్లర్ అన్నారు కదా అని ఈమధ్య వచ్చిన ‘కుటుంబ కథా చిత్రమ్’ పోస్టర్ చూసి సినిమాకెళితే పిచ్చిపట్టింది. ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన మహారాజశ్రీ దర్శకుడికి శతకోటి వందనాలు. ఆ టైటిల్ ఏంటో, ఆ సినిమా ఏంటో, ఆ కలల గోలేంటో అర్థమైతే ఒట్టు.

01/08/2018 - 19:55

జీవిత మార్గంలో కొన్ని కొన్ని సంఘటనలు విచిత్రంగా వుంటాయి. జమున చదువుకొనే రోజులలో దుగ్గిరాల పాఠశాలలో జగ్గయ్య గురువుగా విద్యాబోధన చేశారు. అదే పాఠశాలలో జమున చదువుకున్నారు. ఆ తరువాత 1953లో పుట్టిల్లుతో గరికపాటి రాజారావు చిత్రంతో చిత్ర పరిశ్రమకు వచ్చారు. ప్రభాకర్ రెడ్డి ఎంబిబిఎస్ డాక్టర్ కావలసిన సమయంలో యాక్టర్‌గా మారారు.

01/08/2018 - 19:55

తారల ఇంటర్‌వ్యూలు రాను రాను బోర్ కొడుతున్నాయి. ఇంచుమించు అన్నీ రొటీన్ ప్రశ్నలు, రొటీన్ జవాబులే. జిందగీ సక్సెస్‌ని మీరు ముందుగా ఊహించారా? అంటూ చచ్చుప్రశ్న. జవాబు మనం ఊహించుకోవచ్చు. అయితే మొదటి మూడు రోజులే ఆ చిత్రానికి సొమ్ములొచ్చాయి. తరువాత ఢమాల్. నష్టం మిగిలింది. ఇలాగే వుంటాయి అన్ని ప్రశ్నలు, డాబుసరి జవాబులు!
-ఆర్.శాంతి సమీర, వాకలపూడి

01/08/2018 - 19:54

హైదరాబాద్‌లో జరిగిన తెలుగు సభలలో అందరూ తెలుగులోనే మాట్లాడారు. పా ఠశాలల స్థాయి వరకు తెలుగు చదవాలని అన్నారు. వీరంతా మన తెలుగు సినిమాలలో ఇంగ్లీషు పదాలు లేని స్వచ్ఛమైన తెలుగు మాటలు ఉండాలని అనరెందుకు? వారు సినిమాలు చూడరా?
-డొక్కా యుగంధర్, ఒక్కలంక

Pages