S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

12/04/2017 - 18:51

సినిమా ఫంక్షన్స్‌లలో గరగర స్వరంతో సరిగా వినిపించని, అర్థంకాని రీతిలో మాట్లాడే కమల్‌హాసన్ నేతగా బహిరంగ సభల్లో అనర్గళంగా మాట్లాడుతాడు అనుకోలేం. ఒక ట్వీట్‌లో అతడు హిందూ ఉగ్రవాదం అనడంతో తమిళ హిందూ సంస్థ ఒకటి ఆయన్ని చంపేయాలన్నది. కమల్‌ని సమర్థిస్తూ ప్రకాశ్‌రాజ్ రాజకీయాల్లోకి నా రాకను ఎవరూ అడ్డుకోలేదని అన్నారు. ఎవరు అడ్డుకున్నారుట?! ఆయన తప్పక రాజకీయాల్లోకి రావాలి. కమల్ పార్టీలో చేరాలి.

12/04/2017 - 18:51

అక్టోబర్ 10వ తేదీ ‘వెనె్నల’లో లవకుశ చిత్రం గురిం చి పూజారి వారు చెప్పిన నాలుగు మాటలు బాగున్నాయి. కొనసాగింపుగా మరో రెండు మాటలు.

12/04/2017 - 18:50

టీవీ కామెడీ షోలలో బూతులు కూస్తూ స్ర్తి పాత్రధారుల్ని తన్నడం, కొట్టడం చేస్తూంటే కార్యక్రమంలో మహి ళా జడ్జి పకపక నవ్వుతూ ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. మన చర్మాలు కాస్త మందం కాబట్టి ఇవన్నీ కామెడీగా చెల్లిపోతున్నాయి. హిందీ నటుడు అక్కి (అక్షయ్‌కుమార్) హాస్యనటి మల్లిక జడ్జీలుగా నిర్వహించే ఒక హిందీ కామెడీ షోలో అతను ఆమెతో ‘నువ్వు ఆ గంటను మోగించు, నేను నిన్ను మోగిస్తా’ అన్నాడట.

12/04/2017 - 18:50

సుదీర్ఘకాలం మరో ధ్యాస లేకుండా నామమాత్ర పారితోషికానికి బాహుబలిలో నటించి అద్భుత విజయం అందుకున్నాడు ప్రభాస్. అతడిప్పుడు తప్పటడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. హిందీలో డైరెక్ట్ చిత్రం కోసం ప్రఖ్యాత దర్శకుడు కరణ్ జోహార్ అతనిని సంప్రదిస్తే దిమ్మతిరిగేట్లు 20 కోట్ల పారితోషికం అడిగాడట. రజనీకాంత్‌కే నేరుగా హిందీ చిత్రాలు లేవు. అన్నీ డబ్బింగ్‌లే. నిజానికి మన హీరోలెవరూ బాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయారు.

12/04/2017 - 18:49

స్పైడర్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చిన లేఖ చూసి లోకోభిన్నరుచిః అని నవ్వుకున్నాం. ఎందుకంటే ఆ చిత్రం మహేష్ అభిమానులకూ తృప్తినివ్వలేదు. సాదాసీదా కథ, నటనకవకాశం లేని హీరో పాత్ర, చప్పని క్లైమాక్స్ విలన్‌కే ఎక్కువ ప్రాధాన్యం- అన్నీ కలిసి చిత్రాన్ని దెబ్బతీశాయి. నిర్మాతకు లాభాలొచ్చినా పెద్ద మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్స్ మునిగిపోయారు. తమిళంలో కూడా ఈ చిత్రం ఎవరినీ మెప్పించలేదు.

11/27/2017 - 19:24

31-10-17లోని ఆంధ్రభూమి ‘వెనె్నల’లో సినీయుగానికి సృష్టికర్త అయిన రఘుపతి వెంకయ్య నాయుడుపై వ్యాసం చదివి 2012లో నరేశ్ హీరోగా తీసి, 13లో విడుదలకు సిద్ధమైతే ఎవరూ కొనడానికి రాకపోవడం సిగ్గుగా ఉంది. కోట్లు సంపాదించే సినీ పరిశ్రమ రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా రిలీజ్‌ను ‘మా’ ద్వారా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా విడుదల చెయ్యాలి. రఘుపతి వెంకయ్యనాయుడుగా సీనియర్ హీరో నరేశ్ అచ్చుగుద్దినట్లుగా సరిపోయారు.

11/27/2017 - 19:21

అంధులుగా నటించడం ఒక ఛాలెంజ్. అంధులుగా నటించడం అంటే ఒక దిశలో కళ్లు నిలబెట్టి చేతులు చా చి తడుముకుంటూ నడవ డం! కాని ఇది సరికాదు. అంధులు ఉన్నట్టుండి కళ్ళు పెద్దవి చేస్తారు. ఒక క్షణంలో కంటి రెప్పలు ఐదారుసార్లు టపటపలాడిస్తారు. అంధులందరూ చేసే ఈ పనిని మనవాళ్ళు ఎప్పుడూ చూపించలేరు కాని హిందీ నటుడు నసీరుద్దీన్ షా పరఫెక్ట్‌గా అంధుని పాత్ర పోషించాడు. మనవాళ్లకు తెలియదు, చూసి నేర్చుకుందామన్న ధ్యాస ఉండదు.

11/27/2017 - 19:21

మంగళవారం 31, అక్టోబర్ 2017 వెనె్నల సినిమా సంచికలో 1954 ఉత్తమ చిత్రాలకు రాష్టప్రతి బహుమతులు ప్రవేశపెట్టేటప్పుడు ఆ సంవత్సరం ఉత్తమ తెలుగు చిత్రం వాహినివారి పెద్దమనుషులు ఎన్నికై రజత పతకం పొందింది. పెద్దమనుషుల సినిమా సమీక్షతోపాటు సాంకేతిక వర్గాన్ని పరిచయం చేశారు.

11/27/2017 - 19:20

విజయ్ నటించిన తమిళ చిత్రం ‘మెర్సెల్’లో జిఎస్‌టి వ్యతిరేకంగా ఉన్న సంభాషణలన్నీ తొలగించాలంటూ తమిళనాడు భాజపా నేతలు కోరగా రాహుల్, చిదంబరం, కమల్‌హాసన్, శరత్‌కుమార్ మరికొందరు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇందిర హయాంలో ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించిన ‘కిస్సా కుర్సీకా’ చిత్రం సెన్సారు బోర్డు నుంచి మాయమైంది. ఆ చిత్రానికి సెన్సార్ సర్ట్ఫికెట్ లభించలేదు.

11/27/2017 - 19:20

‘రాజుగారి గది’ ప్రచారంలో ‘ఆయనొక మెంటలిస్ట్. కళ్లలోకి చూస్తూ గుండెలో ఏముందో చెప్పగలడు’ అన్న వ్యాఖ్య భలేగా ఉందనిపిస్తుంది. కానీ కాస్త తార్కికంగా ఆలోచిస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే గుండెలో ఏముందో తెలుసుకోవడానికి కళ్ళలోకి చూడనక్కరలేదు. సైన్స్ పుస్తకం చూస్తే చాలు, గుండెలో నాలుగు గదులుంటాయని, రక్తనాళాలుంటాయని తెలుస్తుంది.

Pages