S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

03/15/2016 - 02:00

అనుకున్నంత కాదు..

03/07/2016 - 22:45

కొత్త ఏడాది చిన్న సినిమాలకు బాగానే కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. చిన్న బడ్జెట్‌తో గత రెండు నెలల కాలంలో వచ్చిన మెజారిటీ సినిమాలు థియేటర్ల వద్ద బాగానే హడావుడి చేశాయి. పట్టున్న కథ, కథనాలతో మంచి మార్కులే సంపాదించుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో -మొన్న వచ్చిన అడవి శేష్ ‘క్షణం’ సినిమాని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

02/29/2016 - 19:41

టైటిల్ జస్ట్ఫికేషన్

02/23/2016 - 01:10

వెనె్నలలో పాత చిత్రాల సమీక్షలు ఇచ్చేటప్పుడు అవి విడుదలైన సంవత్సరం, ఆరోజు తేదీ, నెల వ్రాయడం లేదు. అవి రాయగలరని మనవి. అలానే ఆ చిత్రాల నిర్మాణం అయిన ప్రదేశాలు తెలియజేస్తే సమీక్ష చదివే పాఠకులకు తియ్యని అనుభూతులు పొందుతారు. ఎందుకంటే ఆనాడు సినిమాలు చూసిన ప్రేక్షకులంతా నేడు 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధ అభిమానులే. అందుకే ఆ జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు. ఈ విషయం ఆయా రచయితలకు తెలియజేయండి.

02/15/2016 - 20:49

మళ్లీ సోషియో ఫాంటసీ వ్యాసం బాగుంది. మనవాళ్లు మంచి కథలు రాయలేరని, మెగా ఫ్యామిలీతోపాటు చాలామంది అభిప్రాయం ఏర్పరచుకుని, రీమేక్‌ల వైపే పరుగులు పెడుతున్నారు. కారణాలు అడక్కు, చూపించేదే చూడు అన్న ధోరణిలో ఫాంటసీలను వండి వార్చేయవచ్చు. ఫాంటసీలు ఏమాత్రం ప్రేక్షకులకు నచ్చకపోతే తిరగ్గొడతారు. మనవాళ్లు ఉత్తమెతక కాబట్టి, దేవతల్ని జోకర్లుగా చూపించినా భరిస్తున్నారు. ఈమధ్య ప్రజల ధోరణి మారింది.

02/08/2016 - 22:01

సంక్రాంతి బరిలో దిగిన నాలుగు తెలుగు చిత్రాలు, వాటి పేర్లు గమనిస్తే తెలుగు సినిమా పరిశ్రమ ఇంగ్లీషుపై ఎంత ఆధారపడిందో అర్ధమవుతుంది. సోగ్గాడే చిన్నినాయనా అచ్చమైన తెలుగు పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించింది. అదేవిధంగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో పేరులోనూ మధురం ఉన్నా, సినిమా మొత్తం మాత్రం విదేశాల్లో షూట్ చేశారు. మిగతా రెండు చిత్రాలు ఇంగ్లీషు టైటిల్స్‌తో వచ్చాయి.

01/25/2016 - 20:48

డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ బాగా నటించారు. అంజలితో డ్యూయెట్లు చిత్రీకరణ బాగుంది. ఆయన కెరీర్‌లో సూపర్‌హిట్ చిత్రమిది. దర్శకత్వ ప్రతిభ, బాలకృష్ణ ఫైట్స్, డైలాగ్ డెలివరీ రాణించాయి. బాలకృష్ణ అభిమానులకు చక్కని రిలీఫ్.
-అన్నా గురుమూర్తి, ఏలూరు

01/22/2016 - 00:19

నాగశౌర్య హీరోగా వచ్చిన ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం సహనాన్ని పరీక్షించింది. సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారో దర్శకుడికి సరైన క్లారిటీ ఉన్నట్టుగా లేదు. హీరోయిన్ ఎప్పటికప్పుడు తన హావభావాలు మార్చుకోవడానికి కారణమేమిటో సరిగా చెప్పలేకపోయాడు. హీరో ఉన్నాడు అంటే ఉండాలికాబట్టి ఉన్నాడు అన్నట్టుగా ఉంది. అబ్బాయితో అమ్మాయి కలిసి చేసే రొమాన్స్‌లు మాత్రమే ప్రధానంగా తీసుకుని సినిమా చుట్టేద్దామంటే కుదరు కదా.

01/15/2016 - 02:51

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేసిన గత చిత్రాలను నిర్మించిన విజయా, వాహిని, అన్నపూర్ణ, ఏవిఎం, పూర్ణోదయ, యువచిత్ర వంటి సంస్థల రుణం తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడూ తీర్చుకోలేడు. స్క్రిప్ట్ వర్క్ పోస్ట్‌ప్రొడక్షన్ వరకూ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా, సినిమా నిర్మాణం ఒక తపస్సులా భావించినందుకే చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన సినిమాలను వారు రూపొందించగలిగారు.

01/07/2016 - 23:07

హీరో రవితేజలో ఇదివరకటి తేజస్సు పోయింది. బక్కపల్చగా వున్నా బాహుబలుల లాంటి విలన్ గ్యాంగులను ఒంటి చేత్తో చితక్కొట్టడం మిక్కిలి అసహజం అనిపించింది. ఇటువంటివి మన తెలుగు సినిమాలో కొత్తేమీ కాదు. రాజకీయ నాయకుడిమీద రాయి విసరకుండా చెప్పు విసిరి ఉన్నట్టయితే సహజంగా ఉండేది. గతంలో రాజకీయ నాయకులమీద చెప్పులు, బూట్లు విసిరిన సందర్భాలున్నాయి. సెలబ్రిటీ శాస్ర్తీ అరుపుల డైలాగులు అలరించలేదు.

Pages