S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/11/2015 - 08:06

దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన నీడ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో చిత్రాలు వస్తాయి. కానీ సమాజానికి ప్రయోజనకరమైన చిత్రాలు ఎప్పుడో ఒకటి వస్తాయి. ఈ చిత్రం యువతరాన్ని నిర్దేశించి రూపొందించింది. ఆవు గట్టున మేస్తే దూడ చేలో మేస్తుందా? అన్న సామెతకు తెర రూపం ఈ చిత్రం. పెద్దలు ఎలా ప్రవర్తిస్తే వాళ్లను చూసి పిల్లలు అలా పెరుగుతారు.

12/11/2015 - 08:05

ఎవరూ చేయక
నేనే దర్శకత్వం చేశా

-రామ్మోహన్

నానీని హీరోగా పరిచయం చేస్తూ అష్టాచమ్మా చిత్రాన్ని నిర్మించాడు రామ్మోహన్. తరువాత ఉయ్యాల జంపాల నిర్మించిన ఆయన దర్శకుడిగా మారి నిర్మించిన చిత్రం ‘తను నేను’. సంతోష్ శోభన్, అవికాగోర్ జంటగా నటించిన సినిమా ఇటీవలే
విడుదలైంది. రామ్మోహన్‌తో చిట్‌చాట్..

12/11/2015 - 08:03

సినిమా ప్రేక్షకాదరణ పొందాలంటే కథలో నవ్యత, కథనంలో పటుత్వం ఉండాలే తప్ప.. భారీ బడ్జెట్, పెద్ద హీరోలు, విదేశాల్లో చిత్రీకరణ కాదని ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. పెద్ద హీరోలు నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసువద్ద బోల్తాకొడితే, పిల్ల హీరోలు పెద్ద విజయాలను నమోదు చేసి సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అదుపులో లేని చిత్ర నిర్మాణ వ్యయం.

12/11/2015 - 08:15

ఏడు కొండలవాడ వెంకటారమణా/ తెల్లవారవటె తెలియద నాస్వామి/ సడి సేయకోగాలి సడిసేయబోకే/ ఏడనున్నాడో ఎక్కడ్నుడో.. -రాసుకుంటూ పోతే ఆ గొంతునుంచి పలికిన వందలాది అమృత గుళికలు. సూపర్‌హిట్ పాటలు పాడిన పి.లీల మాతృభాష తెలుగు కాదు. తెలుగు నేర్చుకొని పాడి శ్రోతలను ఆనందపర్చిన ఆమె మాతృభాష మలయాళం.

12/11/2015 - 05:17

వరుస అవకాశాలతో దుమ్మురేపుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్ మరో మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోతో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’ చిత్రంతో అల్లుఅర్జున్‌తో జతకట్టిన ఈ రకుల్ తాజాగా ‘కంచె’ చిత్రంతో తనను తాను ప్రూవ్ చేసుకున్న వరుణ్‌తేజ్‌తో నటించబోతోంది. ‘పండగచేస్కో’ చిత్ర దర్శకుడు గోపీచంద్ నేతృత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో దర్శకుడే రకుల్‌కు మరో అవకాశాన్ని ఇచ్చాడట.

12/11/2015 - 05:17

ఒక్క సినిమా హిట్టయితే చాలు ఆ అమ్మాయికి అదృష్టపు పుట్టుమచ్చ ఉందని పరిశ్రమలో పేరు పాకిపోతుంది. అలా తొలి సినిమా ‘ప్రేమమ్’ చిత్రంతో హిట్ కథానాయికగా నిలిచిన అనుపమా పరమేశ్వరన్‌కు ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు బాగా వస్తున్నాయి. తెలుగులో ప్రేమమ్ చిత్రాన్ని ‘ఆ..ఆ’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉంటే మొదటి హీరోయిన్ సమంత. సమంత అయితే ఓకే.

12/11/2015 - 05:16

ఏవి మొయ్యప్పన్ 1938లో అల్లిఅర్జున్‌తో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. 1945లో మద్రాస్ శాంధోమ్‌లో ఎవియం స్టూడియో నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కి పైగా చిత్రాలు నిర్మించారు. 1950లో ‘జీవితం’, ‘సంఘం’, ‘జాతకఫలం’, ‘శ్రీకాళహస్తి మహత్యం’ (1954) చిత్రాల తరువాత 1955లో వీరు నిర్మించిన చిత్రం ‘వదిన’. 9 సెప్టెంబర్ 1955లో విడుదలైంది. ఈ చిత్రానికి కథ సమకూర్చింది జావర్ సీతారామ్.

12/11/2015 - 05:02

ఈవారం కూడా బాక్సాఫీసు దగ్గర బోరు చిత్రాల హోరే వినిపించింది. శ్రీకాంత్ కథానాయకుడుగా వీడికి దూకుడెక్కువ, నిఖిల్ శంకరాభరణం, యవ్వనం ఒక ఫాంటసీ, బంగారు పాదం, సితార, శ్రీకంఠ మహిమలు చిత్రాలు ఈవారం విడుదలయ్యాయి. కానీ చాలా చిత్రాలకు థియేటర్లు దొరకలేదు. దొరక్కపోయినా పర్లేదు విడుదల చేసేస్తామని చేసినట్లున్నారు. ఈవారం విడుదలైన ఏ చిత్రమూ సరైన ఆదరణ పొందలేదు.

12/04/2015 - 06:30

1962లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ బిఎఎస్ ప్రొడక్షన్‌లో బివి సుబ్బారావు నిర్మించి, దర్శకత్వం వహించిన అపురూప మహాభారత దృశ్యకావ్యం -్భష్మ. భీష్మ వృత్తాంతం, శిఖండి కథ, కర్ణుని పాత్ర చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గాంగేయుడిగా ఎన్టీఆర్ నటనకు హద్దుల్లేవనే చెప్పాలి.

12/04/2015 - 06:29

‘స్వర్ణయుగం’ రోజుల్లో అన్నపూర్ణా సంస్థ నుంచి ఎన్నో గొప్ప సినిమాలొచ్చాయి. అందులో -డాక్టర్ చక్రవర్తి ఒకటి. కోడూరి కౌసల్యాదేవి ‘చక్రభ్రమణం’ నవల ఆధారంగా వచ్చిన తొలి తెలుగు సినిమా ఇది. సినిమా ఒక ఎత్తయితే, శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై’ పాట ఒక ఎత్తు. డా.చక్రవర్తి సినిమా కథాపరంగా గొప్పది.

Pages