S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/18/2020 - 22:52

తెలుగులో తొలి సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవాంతకుడు’ (1960). ‘జుమాలయే జీచంతో మానుష్’ అనే బెంగాలీ కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. భార్గవి బ్యానర్ మీద సి పుల్లయ్య స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రమిది. పురాణ పురుషులు భూమిమీద సంచరించడం తెరపై చూసి తెలుగు ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతికి లోనయ్యారు.

01/18/2020 - 22:52

హాస్య రసాధిదేవతకు హారతి పళ్లెం పట్టిన హాస్య నట చక్రవర్తి -రేలంగి. వెకిలి చేష్టలు, వికృత సంభాషణలకు తావివ్వకుండా ఆరోగ్యకరమైన హాస్యాన్ని చక్కని టైమింగ్‌తో విందు భోజనంలా ప్రేక్షకులకు అందించిన నవ్వులరేడు. రేలంగి లేకపోతే తెలుగు సినిమా లేదన్నంత స్థాయికి చేరి పద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు హాస్యనటుడు.

01/18/2020 - 22:41

వి మధుసూధన రావు గొప్ప నిర్మాత. అంతకుమించి మంచి దర్శకుడు. చేపట్టిన ఏ ప్రాజెక్టునైనా -సూపర్ హిట్ మార్గంలో నడిపించిన ఘనుడు. అందుకే ‘విక్టరీ’ ఇంటిపేరైంది. ఆయన దర్శకత్వం వహించిన గొప్ప చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది -కల్యాణ మంటపం. సంఘంలో వేళ్లూనుకున్న దురాచారాలను ఎత్తిచూపే కథకు తనే దర్శకత్వం వహించాలన్న ఆలోచనతో -కన్నడ అవార్డు చిత్రం ‘గజ్జెపూజ’ను ఎంచుకున్నారు.

01/18/2020 - 22:38

నీల గగన ఘనశ్యామా/ ఘన శ్యామా దేవా/ నీల గగన ఘన శ్యామా.. హాని కలిగితే అవతారాలను పూని బ్రోచునదీ నీవేకావా.. చదువులు హరించి అసురండేగిన జలచరమైతివి ఆగమ రూపా/ వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవేకావా.. కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి/ అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవేకావా.. సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగ నేరము/ పెండ్లికొడుకువై వెడలినాడవు ఎందులకొరకో హే జగదీశా..

01/11/2020 - 23:05

*ఆధునిక యుగానికి ఆదికవి అనిపించుకున్న ‘గురజాడ అప్పారావు’ వ్రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహితీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

01/11/2020 - 23:03

లవకుశ ఫేం ఎ.శంకరరెడ్డి లలితా పిక్చర్స్ బ్యానర్ క్రింద నిర్మించిన, తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘చరణదాసి’ (1956) రవీంద్రనాథ్ టాగూర్ వ్రాసిన ‘ది రెక్’ నవల ఆధారంగా రుూ చిత్రాన్ని నిర్మించారు. యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి, సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు జానకి, రేలంగి వంటి మేటి తారాగణమంతా నటించటంవల్ల యిది ఒక మల్టీస్టారర్ చిత్రం.

01/11/2020 - 23:01

1971లో కన్నడ భాషలో విడుదలైన సినిమా -శరపంజర. ఆ చిత్రాన్ని తెలుగు రీమేక్‌గా కృష్ణవేణి పేరిట గోపీకృష్ణ బ్యానర్‌పై నటుడు కృష్ణంరాజు నిర్మించి మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది వి మధుసూదనరావు.

01/11/2020 - 22:59

పెళ్లినాటి ప్రమాణాలు సినిమాలో -వెనె్నలలోనే వేడియేలనో అంటూ కొత్త దంపతుల విరహాగ్నిని వివరిస్తూ పింగళి కళం ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. పింగళి రచనను అభేరి రాగంలో ఘంటసాల రమణీయంగా స్వరాలద్దారు. లీలతో కలిసి ఆలిపిస్తే, తెరమీద నాగేశ్వరరావు, జమునల తొలి కాపురపు ముచ్చట్లను దర్శకుడు కెవి రెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు. కవి హృదయం కమనీయంగా వివరించే గీతమిది.

01/04/2020 - 22:58

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే/ కమ్మనీ ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే/ ఊహలన్ని పాటలే/ కనుల తోటలో/ తొలి కలల కవితలే మాట మాటలో.. / ఓహో -కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే/ ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే...

01/04/2020 - 22:55

మారని పల్లె మనస్తత్వాల మీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పట్టుగొమ్మలైన పల్లెలో మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య నడిచే కథలో సామాజికాంశం -ఊరు దత్తత. క్లుప్తంగా చెప్పుకుంటే శ్రీమంతుడు సినిమా ఇది. సినిమాకు కావాల్సిన కమర్షియాలిటీని జొప్పిస్తూ సామాజిక ఇతివృత్తాన్ని తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ.

Pages