S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/21/2020 - 05:27

‘‘వీణలోన... తీగలోన... ఎక్కడున్నది నాదము...’’ ఈ గీతం ‘చక్రవాకం’లోనిది. డి.రామానాయుడు అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని మెప్పించే తీరున నిర్మించారు.
గీత రచయిత ఆచార్య ఆత్రేయ. చక్రవాక రాగంలో సాగే ఈ గీతానికి సంగీతం కె.వి.మహదేవన్. సాహిత్యం రసస్ఫూర్తి నింపితే, స్వరకీర్తి సంగీతం చేసిన తీరు హృదయాన్ని అలరిస్తుంది. ఇక వాణిశ్రీ అభినయం మది స్వాంతన కలిగిస్తుంది. ఫీల్‌తో కూడిన పాటను సుశీలమ్మ పాడింది.

12/10/2019 - 22:40

శివరామ చంద్రవరపు ప్రధాన పాత్రలో మజిలీ సినిమా పతాకంపై బొగడపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సూసైడ్ క్లబ్’. ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకటకృష్ణ, చందన ముఖ్యపాత్రల్లో నటించారు. విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో ట్రైలర్ షోను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. నిర్మాత ప్రవీణ్ ప్రభు మాట్లాడుతూ -చక్కని పాయింట్‌తో దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. టెక్నికల్‌గా సినిమా సరికొత్తగా వుంటుంది.

12/10/2019 - 22:39

సినిమా మీదున్న పాషన్‌తో ఫీల్డ్‌కి వచ్చిన నిర్మాత విశ్వనాథ్ తన్నీరు. ఇదివరకే హారర్ సినిమా నిర్మించిన ఆయన, విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమామీద కథ ఎలా వుండాలి అన్న చర్చతో తాను ఈ రంగానికి వచ్చాను. దర్శకత్వ శాఖలో అనుభవం కూడా వుండడంతో అనేక సీరియల్స్ చేసి అన్నిటికన్నా కష్టతరమైన పని చిన్న సినిమాలు రూపొందించడమని తెలుసుకున్నా.

12/10/2019 - 22:32

ముందుతరం హాస్యనటుల్లో తనదైన స్టయిలున్న నటుడు భీమన సీతారాం. ఊహ తెలిసినప్పటినుండీ నటనే ప్రాణంగా పెరిగాడు. విజయవాడ కొత్తపేట సెంటర్‌లో 1944 ముందునుండే నటన పిచ్చితో తిరుగాడినవాడు. ఆయనకొక స్నేహితుడు వాలిశెట్టి కోటేశ్వరరావు. ఇద్దరూ కలిసి నటనా పిచ్చితో ఎక్కడెక్కడ ఏ నాటకాలు జరిగినా అక్కడ వాలిపోయేవారు. కళ్ళు విప్పార్చి మరీ ఆ నాటకాలను చూసి ఆస్వాదించి ఇంటికొచ్చేవారు. ఇద్దరికీ ఆహార్యంలో తేడా ఉండేది.

12/10/2019 - 22:22

శ్రీమంతుడు చిత్రాన్ని విశ్వశాంతి ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మాత జి.రాధాకృష్ణమూర్తి కె.ప్రత్యాగాత్మ దర్శకత్వంలో నిర్మించి 16-7-1971వ తేదీన విడుదల చేశారు. ఇది యావరేజి హిట్ చిత్రమైనా మంచి వినోదంతో కూడిన హుషారైన చిత్రం. టి.చలపతిరావు సంగీత స్వరాలతో చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్ సాంగ్స్. ఆరుద్ర, దాశరథి, కొసరాజు సాహిత్యమందించిన పాటలు సినిమా విజయంతో సంబంధం లేకుండా అత్యంత ప్రజాదరణ పొందాయి.

12/10/2019 - 22:20

సినిమాల్లోని మధురమైన పాటలను వింటున్నపుడు శారీరక, మానసిక అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆ పాటల్లోని తియ్యని రాగాలే ఆరోగ్యాన్నిస్తాయి. మన తెలుగు సినిమాలలోని నాటి పాటలను తియ్యనివి కొన్నింటిని గుర్తు చేసుకుందాం.
‘‘ఈనాటి ఈ హారుూ/ కలకాదోయి నిజమోయి -అంటూ జయసింహ చిత్రానికి ఘంటసాల, సుశీల పాడారు. నందమూరి తారకరామారావు, అంజలీదేవి నటించారు. ఈ పాటకు మధురానుభూతి ఖాయం.

11/30/2019 - 22:28

తనీష్ కొత్త సినిమా -మహాప్రస్థానం. ‘జర్నీ ఆఫ్ ఏన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉప శీర్షిక. ‘అంతకుమించి..’ లాంటి హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులు జాని తెరకెక్కిస్తోన్న రెండో చిత్రాన్ని ఓంకారేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. కబీర్ దుహాన్‌సింగ్, అమిత్, కంచెరపాలెం రాజు తదితర ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటించనున్నారు.

11/30/2019 - 22:25

సాయితేజ్, రాశీఖన్నా లీడ్‌రోల్స్‌లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం -ప్రతిరోజూ పండగే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ రూపొందిస్తున్న చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. చిత్రంలోని మైండ్ బ్లోయింగ్ డాన్స్ నెంబర్ సాంగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన గ్రాండ్ సెట్లో చిత్రీకరణ జరుపుకుంది. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అద్భుతమైన థీమ్, కలర్ ప్యాట్రన్‌లో సెట్ వేశారు.

11/30/2019 - 22:22

100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ సంయుక్తంగా రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న భక్తి చిత్రం -వీరశాస్త అయ్యప్ప కటాక్షం. విఎస్‌పి తెనే్నటి చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు సమకూర్చి, టిఎస్ బద్రీష్‌రామ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. విఎస్‌ఎల్ జయకుమార్ సంగీతం సమకూర్చిన చిత్రం ఆడియో విడుదలైంది.

11/30/2019 - 22:20

సృష్టిలో అత్యంత అల్పప్రాణి చీమ మనిషిగా మారాలనుకుంటుంది. కోరిక సరే, అలా మారడం సాధ్యమా? మారితే ఏం జరుగుతుంది? అలా మారిన చీమకు ప్రేమ, శృంగారం తోడైతే ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే -చీమ ప్రేమ మధ్యలో భామ. మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్‌ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తోన్న చిత్రమిది.

Pages