S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/30/2017 - 19:16

సంఘంలో ‘పెద్దమనుషులు’గా చెలామణి అయ్యేవారు ఇతరత్రా ఎలా ప్రవర్తిస్తారన్నది ప్రాతిపదిక. ఒక ఊళ్ళోని మున్సిపాలిటీ- చైర్మన్, కౌన్సిలర్లు- కౌన్సిలర్లలో దేవాలయం పూజారి, పత్రికా సంపాదకుడు కూడా వుంటాడు. పత్రికా సంపాదకుడు తప్ప తక్కిన వాళ్ళంతా పెద్దమనుషులే. వీళ్లంతా ఆ వూళ్ళోని ఆలయానికి ధర్మకర్తలు కూడా. అలాగే వీళ్ళు అనాథ శరణాలయం కూడా నడుపుతూ వుంటారు.

10/30/2017 - 19:14

తెలుగు సినిమాలలో కథానాయిక పాత్ర రోజురోజుకీ నామమాత్రంగా మారుతోంది. హీరోయిన్ అంటే అందాలు ఆరబోసే ఆటబొమ్మగా, హీరో వెనుక గంతులేసే యంత్రంలా, పాటలకే పరిమితం చేశారు. ప్రముఖ తారలు ప్రత్యేక గీతాల్లో నర్తించడం చిత్ర విజయానికి కారణం కావచ్చునేమో కానీ హీరోయిన్ అభినయానికి మంచిది కాదు.

10/30/2017 - 19:13

‘అడుగడుగున గుడి వుంది - అందరిలో గుడి వుంది’ అనే అద్భుతమైన పల్లవితో పల్లవించిన కీ.శే.దేవులపల్లి కృష్ణశాస్ర్తీ గారి ఈ పాట సదా స్మరణీయం. 1968లో విడుదలైన ‘ఉండమ్మా బొట్టుపెడతా’ చిత్రంలోనిది.

10/30/2017 - 18:56

అగ్ర దర్శకులు ఆదుర్తి సుబ్బారావు బాగా బిజీగా వుంటూ కూడా అందరూ నూతన నటీనటులతో చిత్ర నిర్మాణం చేయాలనే సంకల్పానికి అక్కినేని లాంటి పెద్దల ప్రోత్సాహంతో బాలు మూవీస్ బ్యానర్‌పై ‘తేనెమనసులు’ చిత్ర నిర్మాణం ప్రారంభించారు.

10/23/2017 - 20:08

తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందే ‘సంఘమిత్ర’ చిత్రంలో కథానాయికగా పలువురు పేర్లను పరిశీలించి, చివరికి
దిశాపటానీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దిశా చాలా ఆనందంతో
ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు
మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. దీనికి ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు.

10/23/2017 - 20:06

విద్యార్థి దశలో నాటక రంగంపై ఎవరైనా శ్రద్ధ చూపిస్తే, చదువుపై శ్రద్ధ తగ్గుతుందని పెద్దలు నిరుత్సాహపరుస్తుంటారు సహజంగా. ఉద్యోగం చేస్తూ నాటకాలలో నటించాలంటే వృత్తిపరంగా కూడా అనేక అడ్డంకులు ఏర్పడటం సహజం. కానీ ఒక ప్రక్క వృత్తి పరంగా రాణిస్తూ నాటక రంగంలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందటం అన్నది మామూలు విషయం కాదు.

10/23/2017 - 20:04

నాగార్జున హీరోగా వచ్చిన ‘గీతాంజలి’ సినిమాలోని ‘ఒళ్ళంత కవ్వింత కావాలిలే’ అనే పాట ఒక జలపాతంలా అప్పుడు యువతరాన్ని ఊపేసింది. వేటూరి రచన, ఇళయరాజా సంగీతం, చిత్ర గాత్రం అన్నీ అలా కుదిరి పాటను అజరామరం చేశాయి. హీరోయిన్ గిరిజ తన ఉత్సాహం ఉరకలు వేసే నటనతో పరుగులెత్తించింది తనతోపాటు ప్రేక్షకుల్ని. ఓ పక్క ఎండ, ఓ పక్క వానలా వుంటుంది చిత్రీకరణ.

10/23/2017 - 20:02

నాకు నచ్చిన చిత్రం ఎన్.టి.రామారావు, దాసరి నారాయణవుల ‘బొబ్బిలిపులి’. ఈ సినిమాని నిర్మించింది విజయమాధవీ కంబైన్స్ సారథులు వడ్డే శోభనాద్రి, వడ్డే రమేశ్, వడ్డే కిశోర్. వార్తాపత్రికలో వచ్చిన ఒక వార్త ఆధారంగా ఈ చిత్ర కథను సిద్ధం చేసుకొన్నారట. దాసరి నారాయణరావు (కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం).

10/23/2017 - 19:49

రాజకీయ ప్రముఖులపై చలన చిత్రాలు నాటకాలు నిర్మించటం తరచు జరుగుతూ ఉంటాయి. అవి సకారాత్మకంగానూ నకారాత్మకంగానూ కూడా ఉండవచ్చు. భగత్‌సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారిమీద వచ్చిన చిత్రాలు సకారాత్మకాలు. అలాకాక వ్యంగ్య చిత్రాలు కొన్ని వచ్చా యి. ఇందిరాగాంధీ జీవితం మీద హిందీలో రెండు మూడు చిత్రాలు వచ్చాయి. తెలుగులో మహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్రం వచ్చింది.

10/23/2017 - 18:54

ఎన్.టి.రామారావు తొలి పౌరాణిక చిత్రం టి.పి.సుందరం దర్శకత్వం వహించిన ‘మాయారంభ’ (1950). ఇందులో నలకూబరుడిగా ఎన్‌టిఆర్ నటించాడు. శ్రీకృష్ణుని గెటప్‌లో తొలిసారిగా 1954లో విడుదలైన ‘ఇద్దరు పెళ్లాలు’ చిత్రంలో ‘మదిలో హాయి కలలే రేపే విరిసే నీ రేయి గోపాల బాల’ అనే ఆటలో ఒక నిముషంపాటు కన్పిస్తాడు.

Pages