S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/03/2017 - 20:54

తెలుగు సినిమాది 85 ఏళ్ల చరిత్ర. మూకీయుగం దాటి టాకీయుగం మొదలైనప్పటి నుంచి వేల చిత్రాలొచ్చాయి. నాటి నారాయణరావు దగ్గరనుంచి నేటి యువ హీరోల వరకు, నాటి ఋష్యేంద్రమణి నుంచి నేటి యువ హీరోయిన్ల వరకు, కస్తూరి శివరావు నుంచి ఈనాటి హాస్య నటులవరకు వచ్చారు, వస్తున్నారు, వస్తునే ఉంటారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమను 70-80 శకం వరకే స్వర్ణయుగమని ఎందుకు చెప్పుకోవాలి.

06/26/2017 - 21:47

సినిమా అంటేనే గ్లామర్. ఆ అందాన్ని దాచేస్తానంటూ మనల్ని ప్రశ్నించేవాళ్లు ఎవ్వరూ ఉండరు. కాకపోతే, మనకే కెరీర్ లేకుండాపోతుంది’ అంటుంది పూజా హెగ్దె. ఇప్పటి వరకూ ఐదు సినిమాలు చేసిన పూజ, పొందిగ్గానే కనిపించేది. అలాగే కంటిన్యూ అయితే తన కెరీర్‌కి ఫుల్‌స్టాప్ తప్పదని భావించిందో ఏమో.. డిజెలో దుమ్ము దులిపేసింది. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోలే టార్గెట్‌గా -గ్లామర్ ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

06/26/2017 - 21:37

1975లో విడుదలైన కథానాయకుని కథ చిత్రం ఇప్పటికీ అలనాటి ప్రేక్షకులను వెన్నాడే మధురమైన జ్ఞాపకం. ఎన్.టి.రామారావు అంటేనే ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల దిట్ట. వాణిశ్రీతో జతకట్టి ఆయన నటించిన కథానాయకుని కథ చిత్రం వైవిధ్యమైన కథనంతో రూపొంది అప్పటి ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తింది. ఈ సినిమాలో విశేషం ఏమిటంటే, హీరో పాత్రే సినిమా నటుడు. ఆయన సినీ పరిశ్రమలో నెంబర్‌వన్‌గా చెలామణి అవుతుంటాడు.

06/26/2017 - 21:35

దేనికదే చెప్పుకోవాలి కానీ మన తెలుగు నిర్మాతలకు తెలుగమ్మాయిలంటే అస్సలు నచ్చదు. తెలుగు సామెత ‘పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదు’ అన్నట్టు ఎక్కడినుంచో తెచ్చుకున్న వేపాకుతోనే వైద్యం చేసుకుంటారు. అలాగే తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎదిగితే అస్సలు సహించలేరు. వారికి ఎటువంటి అవకాశాలు ఇవ్వరు మనవారు. ఎందుకనేది లోతుగా ఆలోచిస్తే చాలా కారణాలు బయటపడతాయి.

06/26/2017 - 21:33

మన హీరోయిన్లు అప్పుడప్పుడూ చిలకపలుకులు పలుకుతుంటారు. పలాని సినిమాలో పలానా పాత్రకోసం చాలా పరిశోధన చేశానని, అలాంటి వ్యక్తులు ఉండే చోటుకువెళ్లి పరిశీలించి మరీ వారిలా నటించే ప్రయత్నం చేశామని చెప్పుకొస్తుంటారు. అది ఎంతవరకు చెప్పాలో అంతవరకూ చెబితేనే నమ్మబుల్‌గా వుంటుంది. మరీ పరిమితిమించి చెబితే సోది చెప్పేస్తుందిరా బాబూ అని అనుకోవడం షరా మామూలే. అలాంటి ఐటెం ఇప్పుడు కత్రినా కైఫ్ పాలిట నమోదైంది.

06/26/2017 - 21:17

సినిమా ప్రపంచం ఇప్పుడు గ్రాఫిక్స్ వెనుక పరిగెడుతోందా? అన్న సందేహాలు ముసురుతున్నాయి. ఒకప్పుడు కథ. తరువాత కథనం. కొంతకాలం అద్భుతమైన ఫొటోగ్రఫీ. ఇప్పుడు వీటన్నింటికీ జతగా గ్రాఫిక్స్ మాయ. వందల కోట్ల పెట్టుబడి, అత్యున్నత సినీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగించి భారీ సినిమాలు తీసి ప్రేక్షకులపైకి వదలడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న నిర్మాతలు ఇప్పుడు తెరపైకి వస్తున్నారు.

06/26/2017 - 21:16

తెలుగు సినిమా దర్శకుల గురించి పుస్తకం రాస్తే అందులో వీరమాచనేని మధుసూదనరావు గురించి ప్రత్యేకంగా రాయాలి. మొదటి చిత్రం సతీతులసి (1959). అది విజయవంతం కాకపోయినా, తర్వాత వచ్చిన విజయాల పరంపరతో తన ఇంటిపేరునే ‘విక్టరీ’గా మార్చుకోవాల్సి వచ్చింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తూనే, దర్శకత్వ శాఖలో తన అసిస్టెంట్లుగా పనిచేసిన కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, పి.చంద్రశేఖరరెడ్డి, నిట్టల గోపాలకృష్ణ..

06/26/2017 - 21:14

ఏకాంతంలోవున్న మనల్ని రెండు నిఘా నేత్రాలు గమనిస్తున్నాయంటే -మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ‘ఎవ్వరూ మనల్ని గమనించడం లేదనిపించినపుడు మనం ఎలా ఉంటామో అదే మనం’ అంటూ అదేదో సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తోంది కదూ! ఒక్కముక్కలో చెప్పాలంటే ఇదే ‘బిగ్‌బాస్’ షో. జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న తొలి రియాల్టీ షో ఇది.

06/26/2017 - 21:14

‘మోసగాళ్ళకు మోసగాడు’ నాకు నచ్చిన సినిమా. 28 ఆగస్టు, 1971న రిలీజైన ఈ సినిమా సెనే్సషన్ క్రియేట్ చేసింది. అంతవరకు తెలుగు స్క్రీన్‌పై రాని ఒక కొత్త కథ సంవిధానంతో ఈ సినిమా తీయబడింది. ఈ కొత్త ఒరవడిని కె.ఎస్.ఆర్.దాస్ ఈ సినిమా ద్వారా సృష్టించారు. రాజస్థాన్ ఎడారుల్లో తీసిన ఈ సినిమా నభూతో నభవిష్యతి! అంతవరకు తెలుగు తెరకు కౌబాయ్ చిత్రాలు తెలీవు. ఎడారుల్లో సినిమా తీయడం తెలీదు.

06/26/2017 - 21:13

ఇటీవల విడుదలైన ‘శతమానంభవతి’ చిత్రంలోని ‘‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా..’’ అనే పాట 4 నిమిషాల 12 సెకండ్ల పాట మనసును పట్టుకొని ఊపేస్తుంది, కదిలించేస్తుంది, కన్నీళ్ళు తెప్పిస్తుంది, ఇంకా ఎన్నో చేస్తోంది. రమ్య బెహరా, మోహన్ భోగరాజ్‌లు పాడిన ఈ పాటకు మిక్కీ జె మేయర్ తన సంగీతంతో ప్రాణం పోశాడు.

Pages