S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/01/2017 - 21:33

ఈసారి ఏం మాయ చేయాలనుకుంటుందో తెలీదుగానీ, సమంతా మాత్రం కర్రసాము ప్రాక్టీస్ చేస్తోంది. ఒకపక్క చైతూతో ‘మెమరబుల్ థింగ్స్’ ఎంజాయ్ చేస్తూనే, మరోపక్క ప్రాజెక్టుల్లో బిజీగావున్న సమంత.. ఇంత అర్జంట్‌గా ‘కర్రసాము’ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందబ్బా? అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియోని చూసి అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

05/01/2017 - 21:28

నితిన్‌తో ‘చిన్నదాన నీకోసం’ అనిపించుకుని టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మిస్తీ చక్రవర్తి. అందం, ఆహార్యం అన్నీవున్నా ఎందుకో టాలీవుడ్ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. టాలీవుడ్‌లో మళ్లీ చాన్స్ రాకపోతుందా? అని ఎదురు చూస్తున్న మిస్తీకి -ఆశించినట్టే అవకాశం వచ్చింది. ‘బాబు బాగా బిజీ’తో మళ్లీ స్క్రీన్‌మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

05/01/2017 - 21:18

బాహుబలి కిక్కు బాగానే పనిచేస్తోంది -మిల్కీ బ్యూటీ తమన్నాకు. ‘కన్‌క్లూజన్’ స్క్రీన్‌మీద ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా, విడుదలకు ముందొచ్చిన క్రేజ్ కెరీర్‌కు బాగానే వర్కవుటైందని అంటున్నారు. నిజానికి బాహుబలి -2 తరువాత తమిళంలో అవకాశాలు వచ్చాయే తప్ప, తెలుగులో తమ్మూ బేబీకి ఒక్క చాన్సూ దక్కలేదు. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నా.. మంత్రం వేసినట్టు అవకాశాలు మాత్రం మాయమైపోయాయి.

05/01/2017 - 21:01

ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల సమయంలో ఇస్తోన్న ప్రసంగాలు సినిమాకు హైప్ తెస్తున్నాయి. కొన్ని ఫస్ట్‌లుక్స్.. టీజర్స్ డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో విడుదలవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల నుంచి కోట్ల వరకు లైక్‌లు సంపాదిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదో కొత్తరకం పోటీ.. పబ్లిసిటీ అమలవుతున్నట్టే.

05/01/2017 - 20:53

ఒక చిత్రం షూటింగ్ లేదా రికార్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుపటం పరిశ్రమలో ఆనవాయితీ. అది ఏ స్థాయిలో ఉంటుందనేది ఆయా సంస్థల అభిరుచి, పలుకుబడి మీద ఆధారపడి ఉంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం భారీగా జరుపుకుంటే, ఆ పబ్లిసిటీ ప్రభావం తరువాత వ్యాపారాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అనటంలో సందేహం లేదు.

05/01/2017 - 20:52

టైమ్ వస్తే ఏదీ ఆగదంటారు మనోళ్లు. నిజమే, కోరుకున్నది దక్కాలంటే టైం రావాలి మరి. ఈ మాటే నిజమంటోంది అందమైన అల్లరి పిల్ల తేజస్వి ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయినా తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదన్న బాధ మాత్రం తేజస్వికి ఉందట. వర్మ చిత్రం ‘ఐస్‌క్రీమ్’నై వెరీ నైస్‌గాళ్‌గా మురిపించిన తేజస్వి, కేరింతలోనూ తన స్థాయి నటనే ప్రదర్శించింది.

05/01/2017 - 20:50

భారతీరాజా దర్శకత్వంలో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ఇళయరాజా సంగీతంలో దృశ్యకావ్యంగా రూపొందిన ‘సీతాకోకచిలుక’ చిత్రంలోని ‘మినే్నటి సూరీడు వచ్చేనమ్మా/ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా/ అందమైన రంగవల్లులై/ ఎండలన్నీ పూలజల్లులై/ ముద్దుకే పొద్దుపొడిచే’ అనే పాట వింటుంటే ప్రేమికుల భాష ఎలా ఉంటుందో తెలుస్తుంది. 1981లో విడుదలైన ఈ సినిమాలో వేటూరి కలం ఈ పాటలో హొయలుపోయింది.

05/01/2017 - 20:48

కన్నవారిని పల్లెలు ఎలా చూస్తాయో దర్శకుడు ‘శతమానంభవతి’ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించాడు. జానకమ్మగా జయసుధ పడే ఆరాటం మర్చిపోలేని విధంగా ఉంటుంది. తండ్రిగా ప్రకాష్‌రాజ్ పాత్ర ద్వారా ‘ఎదురుగా పళ్లెంలో అన్నీ పెట్టుకుని చూస్తే కడుపు నిండదురా’ అని పలికే డైలాగు, వారసులకు చెంప ఛెళ్ళుమనిపిస్తుంది. బావామరదళ్ళుగా శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ నటన మన ఇంటి పక్క మనుషుల్లా చేశారనిపిస్తుంది.

05/01/2017 - 20:45

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

04/24/2017 - 22:44

వరుసగా సినిమాలు చేస్తూ జోరుమీదున్న లావణ్య త్రిపాఠికి వరుణ్‌తేజ్‌తో కలిసి చేసిన మిస్టర్ బ్రేక్‌తో పరిస్థితి తారుమారైందట. దీంతో టాలీవుడ్‌ను వదిలేసి కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టే యోచనలో ఉందంటున్నారు. ఇప్పటికే తమిళంలో రెండు సినిమాల్లో చేస్తున్న లావణ్య, తెలుగులో క్రేజ్ తగ్గడంతో కోలీవుడ్ బెటరన్న మూడ్‌కు మారిందని అంటున్నారు. మరోపక్క తెలుగులో ట్రెడిషనల్ పాత్రలే వస్తుండటం కూడా ఒక కారణం అంటున్నారు.

Pages