S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

08/10/2019 - 20:24

ఎన్ నిత్యానంద్ భట్ (ఎన్‌ఎన్ భట్) 1935 అక్టోబర్ 2న నైనిటాల్‌లో పుట్టారు. చదువు పూర్తయ్యాక, ఢిల్లీలో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్ల బ్రాంచిలో కొంతకాలం పనిచేశారు. ఆ సంస్థ అధినేత మోతీలాల్‌కు కార్యదర్శిగా 1954 నుంచి 59 వరకూ వ్యవహరించారు. 1960లో విజయవాడ చమ్రియా టాకీ బ్రాంచి మేనేజర్‌గా ఉద్యోగం నిర్వర్తించి, అక్కడి నుంచి వైదొలగిన తరువాత నిర్మాతగా మారారు.

08/03/2019 - 20:32

కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి గ్రామంలో 1920 జనవరి 28న జన్మించారు బి విఠలాచార్య. హరికథలు, బుర్రకథలు, జానపద కథలపట్ల ఆసక్తితో వివిధ దేశాల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. తొలిసారి మహత్మా పిక్చర్స్‌వారి కన్నడ చిత్రం ‘నాగకన్నిక’ చిత్ర నిర్మాణంలో చురుకుగా వ్యవహరించారు. ఆ అనుభవంతో 1952లో తొలిసారి ‘శ్రీ శ్రీనివాస కల్యాణం’ చిత్రానికి దర్శకత్వం వహించారు.

07/27/2019 - 19:48

గుడివాడలో జన్మించిన అట్లూరి పూర్ణచంద్రావు చదువు పూర్తయ్యాక మద్రాస్ వెళ్లారు. విఠలాచార్య వద్ద ‘జయ- విజయ’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. నిర్మాత భావన్నారాయణ వద్ద ప్రొడక్షన్ మేనేజర్‌గా 1959నుంచి 1966వరకు అనుభవం సంపాదించారు. నిర్మాతగా 1968లో ‘అగ్గిమీద గుగ్గిలం’ మొదలుపెట్టి, పలు భాషల్లో పలు చిత్రాలు రూపొందించారు.

07/20/2019 - 20:29

బాపట్ల తాలూకా చెరువుజమ్ములపాలెంలో జన్మించారు పి ఏకామ్రేశ్వర రావు. మచిలీపట్నం కాలేజీలో బిఏ చదివే రోజుల్లోనే కళారంగంపై మక్కువతో ‘తుఫాన్’ నాటికలో కీలకమైన ‘రాఘవరెడ్డి’ పాత్ర పోషించి మెప్పించారు. తరువాత మద్రాసు చేరి కొంత కాలానికి నిర్మాత ఎన్‌ఎన్ భట్‌తో భాగస్వామిగా ‘సుఖ దుఃఖాలు’ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రంలో ఒక వేషం కూడా ధరించారు.

07/13/2019 - 20:43

విజయవాడకు చెందిన కాట్రగడ్డ శ్రీనివాసరావు అక్కడే విద్యనభ్యసించి బెనారస్ యూనివర్సిటీలో బికాం పూర్తి చేశారు. రాజకీయాల్లో కొంతకాలం చురుకుగా పాల్గొన్నారు. కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య ప్రోత్సాహంతో విజయవాడలో ‘నవయుగ ఫిలింస్’ పంపిణీ సంస్థ ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు రెండు వేల పైచిలుకు చిత్రాలను పంపిణీ చేశారు.

07/06/2019 - 20:14

గుడివాడ తాలుకా కొత్త నిమ్మకూరులో 1920లో జన్మించారు కుదరవల్లి సీతారామస్వామి. వీరి తండ్రి కుదరవల్లి నరసయ్య. ధాన్యం వ్యాపారం చేసేవారు. కొంతకాలం తండ్రి వ్యాపారంలో కొనసాగి, తరువాత బస్ కండక్టరుగా పనిచేసిన సీతారామస్వామి -మిత్రుడు పొట్లూరి వెంకట నారాయణరావుతో కలిసి శ్రీ లక్ష్మీనారాయణ కంబైన్స్ బ్యానర్‌పై 1967లో ఎన్టీ రామారావు, కాంతారావు కాంబినేషన్‌లో చిక్కడు-దొరకడు నిర్మించారు.

06/29/2019 - 20:00

కొయిలాడ్ ప్రభాకర్ కాకినాడలో 1936 జూలై 19న జన్మించారు. తల్లిదండ్రులు అప్పారావు, నాగరత్నమ్మ. వీరు కొంతకాలం కళాదర్శకుడు గోఖలేవద్ద సహాయకునిగా పనిచేశారు. తరువాత నిర్మాతగా మారి 1969లో రామ విజేత సంస్థను స్థాపించి.. జగ్గయ్య, కృష్ణ, కాంచనలతో ‘జరిగిన కథ’ చిత్రాన్ని నిర్మించారు. తరువాత తల్లితండ్రులు (1970), రామాలయం (1971), రామరాజ్యం (1972), తులసి (1973), లంబాడోళ్ల రాందాసు చిత్రాల్ని రూపొందించారు.

06/22/2019 - 20:20

రాజమండ్రికి చెందిన వైవి రావు (‘సువర్ణమాల’ చిత్ర నిర్మాణ బాధ్యతలకై 1948లో మద్రాస్ వచ్చారు) జర్నలిజంపై ఆసక్తితో టెంపోరావ్‌తో కలిసి ‘్ఫల్’, ‘టెంపో’ మొదలైన డిటెక్టివ్ సంపాదకవర్గంలో 1954 నుంచి పని చేశారు. వీరి బావ నిర్మాత భావన్నారాయణ స్థాపించిన గౌరీ ప్రొడక్షన్స్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

06/15/2019 - 20:56

ఆంధ్రదేశంలో తొలి ఎగ్జిబిటర్ అయిన పోతిన శ్రీనివాసరావు, అచ్చాయమ్మల రెండో కుమారుడు డూండేశ్వరరావు (డూండీ) 1932 జూన్ 9న విజయవాడలో జన్మించారు. విజయవాడ, రిషీవ్యాలీ, మద్రాస్‌లలో విద్య అభ్యసించారు. విజయవాడకు వచ్చే సినీ ప్రముఖులతో పరిచయాలు కలిగాయి. అలా విజయ నాగిరెడ్డి సలహాతో -అంజలీదేవి, రంజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నీలమలై తిరుడన్’ చిత్రాన్ని తెలుగులో ‘కొండవీటి దొంగ’గా అనువదించారు.

06/08/2019 - 20:53

1930 జూలై 9న తమిళనాడు తంజావూరులో జన్మించారు కైలాసం బాలచందర్. బీఎస్సీ చదివి మద్రాసులో అకౌంట్ జనరల్ ఆఫీసులో పని చేశారు. ఆ సమయంలోనే సర్వర్ సుందరం, మేజర్ చంద్రకాంత్ వంటి నాటకాలు రచించి ప్రదర్శించారు. అవి ప్రేక్షకుల ప్రశంసలు పొందటం, ఆ తరువాత అవి సినిమాలుగా రూపొందటం జరిగింది. వీరు కొన్ని చిత్రాలకు కథలు సమకూర్చటం, మరెన్నో (80కి పైగా) తమిళ, తెలుగు, హిందీ భాషా చిత్రాలకు దర్శకత్వం వహించటం జరిగింది.

Pages