S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

06/01/2019 - 22:29

కృష్ణా జిల్లాలో 1924 అక్టోబర్ 31న జన్మించారు కొల్లి ప్రత్యగాత్మ. తాతినేని ప్రకాశరావువద్ద ‘ఇల్లరికం’ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. వీరి ప్రతిభను గుర్తించిన ప్రసాద్ ఆర్ట్స్ అధినేత ఏవి సుబ్బారావు, ‘ఇల్లరికం’ తరువాత 1961లో వారు రూపొందించిన ‘భార్యాభర్తలు’ చిత్రానికి దర్శకునిగా ప్రత్యగాత్మను ఎన్నుకున్నారు.

05/25/2019 - 20:34

ప్రముఖ నిర్మాత, దర్శకులు, నటులు కోవెలమూడి సూర్యప్రకాశరావు (కెఎస్ ప్రకాశరావు) దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వాసిగాంచిన నందమూరి తారక రామారావు 2 చిత్రాల్లో నటించారు. 1967లో రామానాయుడు రూపొందించిన ‘స్ర్తిజన్మ’ ఒక చిత్రమైతే, 1969లో శ్రీరాజ్ ఆర్ట్స్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించబడిన ఆ రెండో చిత్రమే ‘విచిత్ర కుటుంబం’. ఈ 2 సినిమాల్లో యన్‌టిఆర్, కృష్ణలు సోదరులుగా నటించటం ప్రత్యేకాంశం.

05/18/2019 - 21:51

దేవ వైద్యులు అశ్వనీ కుమారులకు యజ్ఞ హవిర్భాగ్యం కలిగించిన చ్యవన మహర్షి, సుకన్య దంపతుల పౌరాణిక గాథ -సతీ సుకన్య చిత్రం.
శ్రీ వేంకటేశ్వరా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన సినిమా జనవరి 30, 1959న విడుదలైంది. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రమిది.

05/11/2019 - 20:46

శత చిత్ర నిర్మాతగా గిన్నీస్‌బుక్ వరల్డ్ రికార్డు సాధించిన వ్యక్తి దగ్గుబాటి రామానాయుడు. కారంచేడు గ్రామానికి చెందిన ఈయన చిత్ర నిర్మాణంపట్ల ఆసక్తితో తొలుత ‘కాంభోజరాజు కథ’ నిర్మాత భాస్కర్‌రావుతో కలిసి ‘అనురూప ఫిలిమ్స్’ పతాకంపై ‘అనురాగం’ చిత్రం రూపొందించారు. ఆ చిత్రం ఆర్థికంగా అంత విజయం సాధించలేదు.

05/04/2019 - 19:49

మహాలింగం వెంకటరామన్ (ఎంవి రామన్) తమిళనాడులోని తిరుచునాపల్లిలో 1913 జూన్ 26న జన్మించారు. అకౌంటెన్సీలో పట్ట్భద్రులయ్యారు. ఆపైన మద్రాసు శ్రీనివాసా స్టూడియోలో కెమెరామెన్‌గా, సౌండ్ ఇంజనీరుగా, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో అనుభవం సాధించారు. 1945 నుంచీ దర్శకునిగా ప్రయాణం మొదలెట్టారు.

04/27/2019 - 20:51

కృష్ణాజిల్లా పునాదిపాడులో 1926 జనవరి 20న పుట్టారు అనుమోలు వెంకట సుబ్బారావు. కొంతకాలం మద్రాస్‌లో రిపబ్లిక్ గార్డెన్స్‌లో నివసించారు. అప్పట్లో తాతినేని ప్రకాశరావు, ఎన్టీ రామారావు అదే ప్రాంతంలో నివసించటంతో వాళ్లతో పరిచయం కలిగింది. తాతినేని ప్రకాశరావు ప్రోత్సాహంతో ‘ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ప్రారంభించారు.

04/20/2019 - 20:42

1956లో ఏవీఎం స్టూడియోస్, ఎస్‌కె పిక్చర్స్‌తో కలిసి దర్శకుడు కృష్ణన్ పంజూ సారథ్యంలో తమిళంలో రూపొందించిన చిత్రం -కులదైవం. అంతగా అభివృద్ధి భావాలు చోటుచేసుకోని ఆ రోజుల్లోనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని కష్టనష్టాలు, విడో మ్యారేజీ అంశాలను పొందుపర్చి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన కథ ఆధారం.

04/13/2019 - 20:42

మచిలీపట్నానికి చెందిన పినపాల వెంకటదాసు (పివి దాసు) స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసేవారు. తెలుగు చిత్ర పరిశ్రమ దక్షిణాదిలో ప్రారంభించాలనే భావనతో కొంతమంది భాగస్తులతో కలిసి 1934లో వేల్ పిక్చర్స్ ప్రారంభించారు. తొలి చిత్రంగా పౌరాణిక సినిమా ‘సీతాకల్యాణం’ను తీయాలనుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే సూచనతో బొంబాయిలోవున్న తెలుగు వ్యక్తి చిత్రపు నరసింహారావును దర్శకునిగా నిర్ణయించుకున్నారు.

04/07/2019 - 22:50

మహాకవిగా ఘనత వహించిన ‘కాళిదాసు’పై పలు చిత్రాలు నిర్మితమయినాయి. తెలుగులో ‘్భక్తప్రహ్లాద’ తరువాత ఇంపీరియల్ కంపెనీ, హెచ్‌ఎం రెడ్డి దర్శకత్వంలో తొలి తమిళ టాకీ ‘కాళిదాసు’ (1931లో) నిర్మించారు. విద్యాధరిగా నటించిన టిపి రాజ్యలక్ష్మికి తమిళం తప్ప వేరే భాష రాకపోవటంతో ఆమె పాటలు, మాటలు మాత్రం తమిళంలోనూ, కథానాయకుడిగా నటించిన శ్రీనివాసరావు సంభాషణలు తెలుగులో సాగాయి. ఈ చిత్రం విజయం సాధించింది.

03/30/2019 - 21:03

తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో డిసెంబర్ 13, 1928న జన్మించారు దాట్ల వెంకట సూర్యనారాయణరాజు (డివిఎస్ రాజు). 1950లో మద్రాస్ చేరి సినీరంగంలో పలువురితో పరిచయాలు పెంచుకున్నారు. ముఖ్యంగా నందమూరి సోదరులు (యన్‌టి రామారావు, త్రివిక్రమరావుల)తో ఏర్పడిన స్నేహంతో 1953లో వారి నిర్మాణ సంస్థ ‘నేషనల్ ఆర్ట్స్ థియేటర్స్‌లో ‘తోడుదొంగలు’ చిత్రం నుంచి భాగస్వామ్యం మొదలెట్టి గులేబకావళి (1962) వరకూ సాగించారు.

Pages