S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

01/12/2019 - 21:10

నటుడు నందమూరి తారక రామారావుది కృష్ణా జిల్లా నిమ్మకూరు. గుంటూరులో పట్ట్భద్రులయ్యారు. మన దేశం చిత్రంతో నటునిగా ప్రస్థానం ప్రారంభించి శత చిత్రాలు పూర్తి చేసుకున్నాక దర్శకత్వంపై దృష్టిసారించి 1961లో సీతారామకల్యాణం, 1962లో గులేబకావళి కథ చిత్రాలకు సారథ్యం వహించారు (దర్శకుడిగా పేరు మాత్రం వేసుకోలేదు). దర్శకుడిగా పేరు వేసుకున్న తొలి చిత్రం ‘శ్రీకృష్ణపాండవీయం’ (1966).

01/05/2019 - 22:07

కృష్ణా జిల్లా ఊడ్పుగల్లులోని సామాన్య కుటుంబంలో 1922 జూన్ 14న జన్మించారు వీరమాచినేని మధుసూధనరావు (వి మధుసూధనరావు). పునాదిపాడులో హైస్కూలు చదువు, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. యల్‌వి ప్రసాద్, కెయస్ ప్రకాశరావు, టి ప్రకాశ్‌రావు, ఆదుర్తి సుబ్బారావు వద్ద ఫిల్మ్ క్రాఫ్ట్‌లోని అంశాలు బాగా అధ్యయనం చేశారు.

12/29/2018 - 19:48

శ్రీ రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ హాస్య నటుడు, నిర్మాత బి పద్మనాభం తొలిసారిగా దర్శకత్వం వహించి, తన తమ్ముడు బి పురుషోత్తం నిర్మాతగా రూపొందించిన చిత్రం -శ్రీరామకథ. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరామునిగాథ పలు అంశాలతో వైవిధ్యభరితంగా పలు చిత్రాలు రూపొంది ప్రజాదరణ పొందాయి. ఒకే అంశంతో కూడిన ఈ చిత్రాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి.

12/22/2018 - 21:30

1911లో బందరులో జన్మించిన కమలాకర కామేశ్వరరావు తొలుత జర్నలిస్ట్‌గా పనిచేశారు. నిర్మాత హెచ్‌ఎం రెడ్డి ద్వారా 1937లో దర్శకత్వ శాఖలోకి ప్రవేశించారు. వాహిని, విజయా సంస్థలతో, బిఎన్ రెడ్డి, కెవి రెడ్డిల సన్నిహితత్వంతో తొలిసారి చంద్రహారం (1954) చిత్రానికి దర్శకత్వం వహించారు. 1999 వరకూ 30 తెలుగు చిత్రాలు, ఆరు తమిళ చిత్రాలకు దర్శకత్వం నెరపారు. ఆయన తీసిన చిత్రాలతో పౌరాణిక బ్రహ్మ బిరుదు పొందారు.

12/15/2018 - 20:25

కృష్ణా జిల్లా కోలవెన్నలో 1914లో జన్మించారు కోవెలమూడి సూర్య ప్రకాశరావు (కెఎస్ ప్రకాశరావు). ప్రజానాట్య మండలిలో సభ్యునిగా సమర్ధవంతమైన పాత్ర పోషించారు. నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో ‘అపవాదు’, ‘పత్ని’ చిత్రాల్లో నాయక పాత్రలు పోషించారు. ‘బభ్రువాహన’ పౌరాణిక చిత్రంలోనూ నటించిన తరువాత, ఒకవైపు నటన మరోవైపు దర్శకత్వంలో మెళుకువలు సాధించారు.

12/08/2018 - 20:29

వేంగి ప్రభువు రాజరాజ నరేంద్రుని చారిత్రక గాథ ‘సారంగధర’. ధర్మవరం రామకృష్ణమాచార్యులు, పానుగంటి లక్ష్మీనరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీవంటి ప్రముఖ రచయితలు నాటకాలుగా వ్రాసి ఈ గాథకు ప్రాచుర్యం కలిగించారు. కూచిమంచి తిమ్మన్న కవి, ‘సారంగధర’ ద్విపద కావ్యంగానూ రచించారు.

12/01/2018 - 20:23

1920లో పాలకొల్లులో జన్మించారు పినిశెట్టి శ్రీరామమూర్తి. 1946లో ఆదర్శజ్యోతి నాటకం ద్వారా ప్రముఖుల ప్రశంసలు పొందారు. 1950లో వీరు రచించిన ‘పల్లెపడుచు’ నాటకం సంచలనం సృష్టించింది. ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో రచయితగా సినీరంగంలోకి ప్రవేశించారు. అలా పినిశెట్టి రచించిన ‘పల్లెపడుచు’ నాటకాన్ని బోళ్ల సుబ్బారావు చలనచిత్రంగా రూపొందించారు.

11/24/2018 - 22:52

పాటలు: ఆరుద్ర
కూర్పు: కెవి మార్తాండ్
కళ: బిఎన్ కృష్ణ
స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నృత్యం: డి వేణుగోపాల్
స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఎస్‌ఆర్ పినిశెట్టి
నిర్మాత: తోట కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ: రౌతు పిక్చర్స్
**

11/17/2018 - 19:57

మచిలీపట్నానికి చెందిన నిర్మాత పింజల సుబ్బారావు. 1957లో మద్రాస్‌కు వచ్చి కొన్ని చిత్రాల్లో నటించారు. తరువాత శ్రీ కృష్ణా ఫిలిమ్స్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా ‘రామాంజనేయ యుద్ధం’, ‘సతీ సుకన్య’ చిత్రాలకు పనిచేశారు. తరువాత వేస్ట్ ఫిల్మ్ కొనుగోలు, అమ్మకం వ్యాపారం నిర్వహించారు. సినీ నిర్మాణంపట్ల అభిరుచితో ఓ తమిళ చిత్రాన్నికొని, ‘రాజద్రోహి’గా డబ్బింగ్ చేశారు.

11/10/2018 - 20:26

ప్రముఖ బెంగాలి రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 1907లో రచించిన నవల ‘బడా దీది’. బెంగాలి మ్యాగ్‌జైన్ భారతిలో సీరియల్‌గా ప్రచురితమైంది. ఈ నవలను రెండుమార్లు బెంగాలీలో సినిమాగానూ రూపొందించారు. తొలుత 1939లో ‘న్యూ థియేటర్స్’ వారు అమర్‌మాలిక్ దర్శకత్వంలో చిత్రం చేస్తే, దర్శకుడు, సినిమాట్రోగ్రాఫర్ అయిన అజయ్‌కారన్, ఉత్తమకుమార్, సంధ్యారాణిల కాంబినేషన్‌లో 1957లో రెండోసారి చిత్రంగా రూపొందింది.

Pages