క్రీడాభూమి

మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లకు సుప్రీంకోర్టు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మహారాష్టక్రు కేటాయించిన మ్యాచ్‌ల్లో ఈనెల 30 తర్వాత జరగాల్సిన మ్యాచ్‌లను మరో కేంద్రానికి తరలించాలన్న బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు బలపరచింది. అయితే, వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని మే ఒకటిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి బాంబే హైకోర్టు ఇచ్చిన అనుమతిని కొట్టేసింది. ఈనెల 30వ తేదీ తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లను నిర్వహించరాదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)కు కోర్టు స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు ఇంతకు ముందే మేలో జరగాల్సిన అన్ని మ్యాచ్‌లను మహారాష్టల్రో నిర్వహించరాదని స్పష్టం చేసింది. అయితే, పుణెలో గుజరాత్ లయన్స్‌తో రైజింగ్ పుణె జట్టు ఈనెల 29న మ్యాచ్ ఆడాల్సి ఉందని, మే ఒకటిన మహారాష్టల్రో కాకుండా మరో ప్రాంతంలో మ్యాచ్ ఆడేందుకు తగినంత సమయం ఉండదు కాబట్టి ఆ ఒక్క మ్యాచ్‌ని అనుమతించాలని బిసిసిఐ కోరింది. బోర్డు అభ్యర్థనపై స్పందించిన బాంబే హైకోర్టు మే ఒకటో తేదీన పుణెలో రైజింగ్ పుణె, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి అనుమతినిచ్చింది. కానీ, సుప్రీం కోర్టు ఈ విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బుట్టదాఖలు చేసింది. మహారాష్టల్రో నీటి ఎద్దడి నెలకొన్న కారణంగా, ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 30 తర్వాత ఒక్క మ్యాచ్‌ని కూడా ఆ రాష్ట్రంలో నిర్వహించరాదని బోర్డును ఆదేశించింది. ప్రతిసారి మాదిరిగానే ఈసారికూడా ఐపిఎల్ మ్యాచ్‌లను వివిధ ఫ్రాంచైజీల హోం గ్రౌండ్, ప్రత్యర్థి జట్ల కేంద్రాలుగా చేసుకొని మ్యాచ్‌లను ఐపిఎల్ నిర్వాహణ కమిటీ ఖరారు చేసింది. అందులో భాగంగానే మహారాష్టల్రోని ముంబయి, నాగపూర్, పుణె నగరాల్లో ఫైనల్‌సహా మొత్తం 20 మ్యాచ్‌లను ఐపిఎల్ నిర్వాహణ కమిటీ కేటాయించింది. అయితే, మహారాష్టల్రో కరవు తాండవిస్తూ, చాలా ప్రాంతాల్లో తీవ్రనీటి ఎద్దడి కొనసాగుతుంటే ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం నీటిని వృథా చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మహారాష్టల్రో మ్యాచ్‌లకు 60 నుంచి 70 లక్షల లీటర్ల నీటిని వాడాల్సి వస్తుందని, దీనితో సామాన్య ప్రజలు నీటి బొట్టు దొరక్క నానా ఇబ్బందులు పడతారని లోక్‌సత్తా మూమెంట్ విమర్శించింది. అందుకే, మహారాష్టల్రో జరగాల్సిన అన్ని ఐపిఎల్ మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మహారాష్టల్రో మ్యాచ్‌లను కోరుతున్న ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ), బిసిసిఐ ఒక జట్టుగా, లోక్‌సత్తా మూమెంట్, ప్రజా సంఘాలు మరో జట్టుగా ఏర్పడి వాదను వినిపించాయి. ఇప్పటికే టికెట్లు అమ్మేశామని, ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నామని, హఠాత్తుగా మరో ప్రాంతానికి మ్యాచ్‌లను తరలించడం సులభ సాధ్యం కాదని బిసిసిఐ వాపోయింది. భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని, అందుకే షెడ్యూల్ ప్రకారమే మహారాష్టల్రో మ్యాచ్‌లను నిర్వహించుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరింది. ఈ విజ్ఞప్తిపై బాంబే హైకోర్టు పాక్షికంగా స్పందించింది. ఈనెల 30వ తేదీలోగా జరగాల్సిన మ్యాచ్‌లను నిర్వహించుకోవడానికి అనుమతించింది. అయితే, ఆతర్వాత జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాల్సిందేనని తేల్చిచెప్పింది. కాగా, సమయాభావం కారణంగా మే ఒకటిన జరగాల్సిన మ్యాచ్‌ని తరలించడం పుణె జట్టుకు సాధ్యం కాదని కోర్టుకు బిసిసిఐ మొరపెట్టుకుంది. మే మాసంలో కనీసం ఆ ఒక్క మ్యాచ్‌ని నిర్వహించేందుకు అనుమతించాలని కోరింది. ఈ విజ్ఞప్తిని బాంబే కోర్టు మన్నించింది. రైజింగ్ పుణె, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మే ఒకటిన జరిగే మ్యాచ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. మే మాసంలో ఒక్క మ్యాచ్ కూడా మహారాష్టల్రో నిర్వహించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా మ్యాచ్‌లను మరో కేంద్రానికి తరలించాల్సిందేనని పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మే 1న పుణె రైజింగ్, ముంబయి మ్యాచ్‌తోపాటు 7న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (నాగపూర్‌లో), 8న ముంబయి ఇండియన్స్/ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబయిలో), మే 9న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (నాగపూర్‌లో), 10న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్/ సన్‌రైజర్స్ హైదరాబాద్ (పుణెలో), 13న ముంబయి ఇండియన్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ముంబయిలో), 15న ముంబయి ఇండియన్స్/ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ముంబయిలో), 15న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ సన్‌రైజర్స్ హైదరాబాద్ (నాగపూర్‌లో), 17న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్/ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (పుణెలో), 21న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (పుణెలో) జరిగే గ్రూప్ మ్యాచ్‌లను మరో చోటికి మార్చాలి. అదే విధంగా 25న పుణెలో జరగాల్సిన ఎలిమినేటర్, 27వ తేదీ నాటి రెండో క్వాలిఫయర్, 29న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సిన ఫైనల్‌ను కూడా ఇతర కేంద్రాలను తరలించాల్సి ఉంటుంది. ఇలావుంటే, పుణెలో జరగాల్సిన మూడు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడేందుకు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ ఇది వరకే అంగీకరించింది. ఈ నెల 10న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, 17న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో, 21న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఈ జట్టు పుణెలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈమూడు మ్యాచ్‌లకు విశాఖ పట్నం వేదిక కానుంది. ముంబయి ఇండియన్స్ జట్టు తమ మ్యాచ్‌లను రాజ్‌కోట్‌లో ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశంపై బిసిసిఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.