S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/05/2019 - 13:29

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానంపై సమీక్ష నిర్వహించింది. కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రేపో రేటు 5.1ని మార్చలేదు. రివర్స్ రేపో రేటు 4.90గా ఉన్నది. బ్యాంకు రేటు 5.40 శాతంగా ఉన్నది. 2019-20 సంవ‌త్సరానికి జీడీపీ అంచ‌నాల‌ను త‌గ్గించారు.

12/05/2019 - 05:09

న్యూఢిల్లీ: బంగారం ధరలు బుధవారం మళ్లీ పరుగందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు (తులం) బంగారం ధర ఏకంగా రూ.332 ఎగబాకింది. మొత్తం ధర మళ్లీ 39వేల మార్కును దాటి రూ. 39,299గా ట్రేడైంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 38,967 పలికింది. స్పాట్‌గోల్డ్ ధరలు సైతం అదే స్థాయిలో పెరిగాయి.

12/04/2019 - 23:37

ముంబయి, డిసెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. గత మంగళవారం నష్టాల్లోకి జారిన మార్కెట్లు మళ్లీ వారం ఆరంభ రోజున పుంజుకోవడం విశేషం.

12/04/2019 - 23:36

చెన్నై, డిసెంబర్ 4: మధ్య,తూర్పు దేశాల్లో ఉన్న రామ్‌కో సిస్టమ్స్ అనుబంధ సంస్థ ఐదేళ్ల కాలానికి అమలయ్యే భారీ ఆర్డర్‌ను హస్తగతం చేసుకుంది. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న ఓ ప్రముఖ స్వతంత్ర కుటుంబానికి చెందిన బహుళజాతి సంస్థ నుంచి ఈ ఆర్డను దక్కించుకున్నట్టు రామ్‌కో సిస్టమ్స్ బుధవారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

12/04/2019 - 23:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: కొత్తగా అమలు కానున్న ‘వ్యక్తిగత డేటా రక్షణ చట్టం’ మేరకు నిబంధనలను అతిక్రమించిన కంపెనీలు పెనాల్టీగా రూ. 15 కోట్లు లేదా అంతర్జాతీయ టర్నోవర్‌లో 4 శాతం చెల్లించాల్సివుంటుంది. ఈ చట్టానికి సంబంధించిన ప్రతిపాదనలకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

12/04/2019 - 23:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రాథమిక బహిరంగ ఆఫరింగ్ (ఐపీఓ)కు మదుపర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆఫర్ ముగింపు రోజైన బుధవారం జరిగిన బిడ్డింగ్‌లో ఈ ఇష్యూ 126.36 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. రూ. 750 కోట్ల తాజా ఐపీఓకు మొత్తం 1,566 కోట్ల వాటాలకు బిడ్లు వచ్చాయి. జాతీయ స్టాక్ ఎక్చేంజి వద్ద లభించిన గణాంకాల మేరకు మొత్తం ఇష్యూ సైజు 12.39 కోట్ల వాటాలు.

12/04/2019 - 23:19

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రిలయన్స్ జియో బుధవారం కొత్త టారిఫ్‌ను ప్రకటించింది. గత టారిఫ్‌తో పోలిస్తే వివిధ ప్లాన్ల ధర 35 శాతం వరకూ పెరిగింది. అయితే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థల కంటే తమ కొత్త టారిఫ్ 28 శాతం ఖర్చు తక్కువ అని కంపెనీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. కొత్త టారిఫ్ ప్రకారం 84 రోజులు చెల్లుబాటు అయ్యే ఫ్రీ కాల్స్, రోజుకు 1.5 జీబీ డాటా ప్లాన్ కోసం రూ.555 చెల్లించాల్సి ఉంటుంది.

12/04/2019 - 05:47

న్యూఢిల్లీ: దేశాన్ని మరింతగా పెట్టుబడుల ఆకర్షక గమ్యస్ధానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం అవసరమైతే మరిన్ని సంస్కరణలను చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మంగళవారం నాడిక్కడ జరిగిన ‘్భరత్-స్వీడన్ వాణిజ్య శిఖరాగ్ర సదస్సు’లో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ విదేశీ సంస్థలు విరివిగా భారత్‌లో పెట్టుబడులు మదుపుచేయాలని పిలుపునిచ్చారు.

12/04/2019 - 05:37

అమరావతి, డిసెంబర్ 3: ఉల్లి కొరత తీరే వరకు రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించడం ద్వారా అధిక ధరలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉల్లి ధరలపై సీఎం కార్యాలయం (సీఎంఓ) ఎప్పటికప్పుడు వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు, రైతుబజార్ ఎస్టేట్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తోంది.

12/04/2019 - 04:38

ముంబయి, డిసెంబర్ 3: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాల్లోకి జారాయి. ఇప్పటికే చైనా, భారత్ వంటి దేశాలతో దిగుమతి సుంకాల వివాదాల్లో ఉన్న అమెరికా తాజాగా బ్రెజిల్, అర్జెంటీనా దేశాల నుంచి జరుగుతున్న దిగుమతులపై సైతం సుంకాలను పెంచాలని నిర్ణయించింది. దీంతో మరో వాణిజ్య వివాదం తలెత్తడంతోప్రధానంగా ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.

Pages