S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/19/2019 - 21:00

లండన్, జూలై 19: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌కు చోటు లభించింది. సచిన్‌తోపాటు, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలాన్ డొనాల్డ్, రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాకు మహిళల వరల్డ్ కప్‌ను సాధించిపెట్టిన కాథరిన్ ఫిజ్‌పాట్రిక్ పేర్లను కూడా ఐసీసీ ఈ జాబితాలో చేర్చింది.

07/19/2019 - 20:58

జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్ పీవీ సింధు. క్వార్టర్ ఫైనల్లో ఆమె జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాను 21-14, 21-7 తేడాతో ఓడించి,
సెమీస్‌లో చెన్ యూ ఫెయ్‌తో పోరును ఖరారు చేసుకుంది.

07/19/2019 - 20:54

న్యూఢిల్లీ, జూలై 19: ఢిల్లీకి చెందిన టీనేజర్ ప్రీతూ గుప్తా గ్రాండ్‌మాస్టర్ హోదాను సంపాదించాడు. భారత 64వ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. పోర్చుగీస్ లీగ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఇంటర్నేషనల్ మాస్టర్ లెవ్ యానె్కలెవిచ్‌ను ఓడించడంతో 15 ఏళ్ల ప్రీతూ ఖాతాలో 2,500 ఎలో రేటింగ్ పాయింట్లు చేరాయి. అతనికి గ్రాండ్‌మాస్టర్ హోదా లభించింది.

07/19/2019 - 20:52

న్యూఢిల్లీ, జూలై 19: జింబాబ్వేతో వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన వనే్డ సిరీస్‌పై అక్టోబర్ వరకూ వేచి చూస్తామని, ఆతర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్న కారణంగా జింబాబ్వే క్రికెట్ (జెడ్‌సీ)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో పలు అంతర్జాతీయ టూర్లు, సిరీస్‌ల పరిస్థితి అయోమయంలో పడింది.

07/19/2019 - 20:51

కొలంబో, జూలై 19: శ్రీలంక క్రికెట్ కోచ్‌లపై వేటు పడింది. జాతీయ క్రికెట్ చీఫ్ కోచ్, ఇతర కోచ్‌లను తొలగించాలని శ్రీలంక క్రీడా శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో ఆదేశాలు జారీ చేశాడు. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో లంక దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వనే్డ సిరీస్ ఉన్నందున, అది పూర్తయిన వెంటనే హెడ్ కోచ్ చంద్రిక హతురసింఘ, ఇతర కోచ్‌లను తొలగించనున్నట్టు ప్రకటించాడు.

07/19/2019 - 14:05

న్యూఢిల్లీ: భారత క్రికెట్ లెజండరీ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ పేమ్‌లో స్థానం లభించింది. ఆయనతో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలన్ డోనాల్ట్, ఆసిస్ మాజీ మహిళా క్రికెటర్ క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు సైతం ఈ అవకాశం దక్కింది.

07/18/2019 - 23:32

ముంబయి, జూలై 18: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జాతీయ జట్టులో చోటు ఉంటుందా? లేక అతని స్థానంలో యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను ఎంపిక చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చేనెల వెస్టిండీస్ టూర్‌కు టీమిండియాను ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన సమావేశం కానున్న జాతీయ సెలక్షన్ కమిటీ ధోనీకి చోటు కల్పించే విషయంపై ప్రధానంగా చర్చిస్తుందని సమాచారం.

07/18/2019 - 23:30

ముంబయి, జూలై 18: ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ కెరీర్ ముగిసినట్టేనని పరిశీలకుల అభిప్రాయం. వరల్డ్ కప్ క్రికెట్‌లో వీరిద్దరి ఆట అందరినీ నిరాశకు గురి చేసింది. ఆ మెగా టోర్నీలో ముగ్గురు కీపర్లు, ధోనీ, పంత్, దినేష్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడించడంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. యువ ఆటగాడు పంత్ రేసులో ఉన్నందున దినేష్‌కు చోటు దక్కడం అసంభవంగానే చెప్పాలి.

07/18/2019 - 23:28

న్యూఢిల్లీ, జూలై 18: ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌గా ట్రెవర్ బేలిస్ సేవలు అందించనున్నాడు. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకున్న ఇంగ్లాండ్‌కు కోచ్‌గా వ్యవహరించిన బేలిస్‌ను టామ్ మూడీ స్థానంలో సన్‌రైజర్స్ కోచ్‌గా నియమించారు. వచ్చేవారం ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ తర్వాత, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో బేలిస్ ఒప్పందం ముగుస్తుంది.

07/18/2019 - 23:27

న్యూఢిల్లీ, జూలై 18: భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ లెజెండ్ పీటీ ఉషకు సరైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ‘వెటరన్ పిన్’గా ఆమె పేరును పరిశీలనకు తీసుకున్నారు. ‘క్వీన్ ఆఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్’, ‘పయోలీ ఎక్స్‌ప్రెస్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఉష జాతీయ పోటీల్లో ఐదు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది.

Pages