సాహితి

అశ్రు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజ్ఞాత మిత్రమా
ఎవరు కన్నబిడ్డవో
ఎవర్ని కన్నతండ్రివో నీవు
ఎనే్నండ్లు బతికేవో

ఈమధ్యనే కాలధర్మం చెంది
కానరాని లోకాలకేగినట్టున్నావు
నాకెలా తెలిసిందనా?

ప్రాణంతో నున్ననాడు
పాలచుక్క పోయనోడు
చచ్చినోని సమాధిమీద
ఆవును కట్టేసినట్టుగా
నీ బ్రహ్మాండమైన చిత్తరువును
నాలుగురోడ్ల కూడళ్ళలోనూ
రహదారుల అభివృద్ధికి
నిదర్శనంగా నిలబడ్డ హోర్డింగుల
తుప్పుపట్టిన సలాకలమీదా
బస్టాండులకు ఓ ప్రక్కగా
‘పాస్’ కోసమన్నట్టుగా పెరుగుతూ
చావలేక బతుకుతున్న
చెట్ల విరిగిన కొమ్మలకూ
‘స్మృత్యంజలి’ ‘అశ్రునివాళు’ల హెడ్డింగ్‌లతో,
పెడరెక్కలు విరిచికట్టి,
వధ్యశిలకు తీసుకుపోబడుతున్న నేరస్థునిలా
శ్మశానంలో ఊడలమర్రికి
ఊగులాడుతున్న అస్థిపంజరాలలా
‘నీ వాండ్లు’ నీ జ్ఞాపకార్థం
ఫ్లెక్సీలను వేలాడదిస్తేనూ..
నాకు తెలిసిందలా...!!

అజ్ఞాత నేస్తమా...
బతికినపుడు నువ్వు
ఏ మరకా లేకుండా బతికినా,
చచ్చాక మాత్రం నీ ‘తస్‌వీర్’మీద
దుమ్మూ, ధూళీ, మరకా, మన్నూ
విహంగాదుల విసర్జనలూ..
ఏ ప్రయోజనం కోసం వేలాడగట్టారని ఎవర్నీ అడగలేనుగానీ,
ఒకర్ని చూసి ఒకరు నేర్చుకుంటున్న
వెర్రి సంస్కృతి కారణంగా
నీ ప్రమేయం లేకుండానే
దుమ్ము కొట్టుకుపోతుంటే
‘జాతస్య మరణం ధృవమ్’ కనుక
నువ్వు మరణించినందుకు కాదుగానీ,
మీ వారి ‘ఆదరాభిమానాల’వల్ల
నీకు కలిగిన ఈ దుస్థితికి
ఇదే నా ‘అశ్రునివాళి!’

- జి.బాలసరస్వతి, 9912661463